అన్వేషించండి

Brahmamudi Serial Today January 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కళ్యాణ్‌కు షాక్‌ ఇచ్చిన అప్పు – ట్రైనింగ్‌ లోంచి వచ్చేసిన అప్పు

Brahmamudi Today Episode: ట్రైనింగ్‌ లోంచి వచ్చిన అప్పును చూసి కళ్యాణ్‌ షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode:   ఇంట్లో వాళ్లకు నిజం చెప్పేద్దామంటాడు రాజ్‌. నిజం చెప్తే ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుందో కావ్య చెప్తుంది. కావ్య చెప్పడం ఊహించుకున్న రాజ్‌ షాక్‌ అవుతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటూ కావ్యను అడుగుతాడు.

కావ్య: వంద కోట్ల నిజాన్ని మనమే దిగమింగాలి.

రాజ్‌: స్టెల్లా చేసిన వంటను దిగమింగినట్టు దిగమింగాలి. తర్వాత ఏం చేద్దాం..

కావ్య: పగలంతా ఆఫీసులో వర్క్‌ చేద్దాం.. రాత్రిళ్లు ఆ ఎండీ గాడిని వెతుకుదాం.. అదృష్టం బాగుండి వాడు దొరికితే ఆ డబ్బులు మొత్తం వాడితో కక్కించి బ్యాంకు వాళ్లకు డబ్బులు కట్టి ప్రశాంతం పడుకుందాం

రాజ్‌: ఒకవేళ వాడు దొరక్కపోతే..?

కావ్య: ఒక్కటైనా పాజిటివ్‌గా ఆలోచించరా.. వాడు దొరకాలి.. దొరికితేనే వంద కోట్ల అప్పు కట్టగలం.

రాజ్‌: నిజమే కానీ వాడి అదృష్టం బాగుండి.. మన దురదృష్టం ఇంకా బాగుండి వాడు దొరక్కపోతే ఎలా

కావ్య: రోజు ఆఫీసుకు వెళ్లి అప్పు తీర్చడం కోసం గొడ్డులా కష్టపడి అప్పు తీర్చాలి.. అప్పటి వరకు ఇంట్లో వాళ్లు తిడుతూ ఉంటే నీళ్లలో బిస్కట్లు అద్దుకుని తినాలి.

రాజ్‌: అంతా బాగానే ఉంది కానీ ఇంట్లో వాళ్లు మనల్ని తిడుతుంటే.. మనం నీళ్లలో బిస్కట్లు అద్దుకుని తినే కాన్సెఫ్టే బాగాలేదు.

కావ్య: ఏవండి నేను ఇంత మ్యాటర్‌ చెప్తుంటే.. బిస్కెట్‌ గురించి చెప్తారేంటి..?

అంటూ కావ్య కోప్పడుతుంది. రాజ్‌ సరే అయితే ఓకే అంటాడు. మరోవైపు ధాన్యలక్ష్మిని తమ మాటలతో రెచ్చగొడుతుంటారు రాహుల్‌, రుద్రాణి.

రుద్రాణి: ఉదయాన్నే లేచి హడావిడిగా రెడీ అయి రాజ్ ఒక బ్యాగ్‌.. కావ్య ఒక మేకప్‌ బాగ్‌ పట్టుకుని ఎవరినో ఉద్దించడానికి వెళ్తున్నట్టు బిల్డప్‌ ఇచ్చారు. కట్‌ చేస్తే ఐదు లక్షల కోసం కూడా నగలు తాకట్టు పెట్టారు

రాహుల్‌: పైగా ఎవరితో కూడా మాట్లాడేవారు కాదు మమ్మీ.

రుద్రాణి: ఎందుకు మాట్లాడుతారురా.. మాట్లాడితే ఫ్లో లో అన్ని నిజాలు భయటపడిపోతాయి కదా

రాహుల్‌: అసలు ఐదు లక్షలు కూడా ఇంట్లో లేకపోవడం ఏంటి మామ్‌

దాన్యలక్ష్మీ: అసలు డబ్బులు లేవన్నది పచ్చి అబద్దం. ఆ రాజ్‌, కావ్య కలిసి ఏదో  నాటకం ఆడుతున్నారు.

రాహుల్‌: కరెక్టు అత్తా కావ్య అంటేనే పడని రాజ్‌.. ఇప్పుడు కావ్యతోనే జత కట్టాడు. అప్పుడే నాకు డౌటు వచ్చింది.

రుద్రాణి: ఈ కథలో బయట కనిపించే క్యారెక్టర్స్‌ రాజ్‌, కావ్య మాత్రమే.. కానీ వెనక ఉండి స్క్రీన్‌ ప్లే రాస్తుందంతా సుభాష్‌ అన్నయ్యా.. అపర్ణ వదిన.

ధాన్యలక్ష్మీ : ఏమంటున్నావు నువ్వు

రుద్రాణి: నీకింకా అర్థం కాలేదా..? మనం ఆస్తుల గురించి న్యాయపోరాటం ఎప్పుడైతే మొదలుపెట్టామో..  అప్పటి నుంచి వాళ్లలో మార్పు వచ్చింది. కొడుకుతో కుమ్ముక్కై  మా నాన్న మంచం ఎక్కగానే ఆస్తులన్నీ రాయించుకున్నారు. తెలివిగా డబ్బంతా సైడు ట్రాక్‌లో దాటించేస్తున్నారు. కావాలంటే నువ్వే చూడు మనకు అన్ని విషయాలు తెలియగానే వాళ్లు మాకేమీ సంబంధం లేదని చేతులు ఎత్తేస్తారు.

రాహుల్‌: చివరికి సొంత అక్క సీమంతం కూడా నార్మల్‌ గా జరిపించారు. పాపం స్వప్న చాలా ఫీల్ అయింది.

రుద్రాణి: డబ్బు పిచ్చి పట్టాక తన మన అనేది ఉండదురా..? అందరూ నీలాగా నాలాగా మన ధాన్యలక్ష్మీ లాగా ఉండరురా కదా

అని రాహుల్‌ ను కంపెనీ అకౌంట్‌ గురించి ఆరా తీయమని చెప్తుంది రుద్రాణి అలాగేనని రాహుల్‌ వెళ్లిపోతాడు. మందు తాగుతూ ఆ కుంటుంబం రోడ్డున పడటమే నాకు కావాల్సింది అంటుంది అనామిక.. నాకు కావాల్సింది కంపెనీ కదా అంటాడు సామంత్‌. తొక్కలో కంపెనీది ఏముంది అంటుంది అనామిక. దీంతో సామంత్, అనామికను అనుమానిస్తాడు.

 ఇంతలో అనామిక రుద్రాణికి ఫోన్‌ చేసి మరో పిడుగు లాంటి న్యూస్ చెప్తాను రెడీగా ఉండు అంటుంది.  తర్వాత అప్పు హాస్పిటల్‌కు వచ్చినా కళ్యాణ్‌ నమ్మడు. ఎవరిని చూసినా అప్పులాగే కనిపిస్తున్నారు అనుకుంటాడు. అప్పు దగ్గరకు వచ్చి గిల్లగానే అరే నిజమే నా పొట్టి వచ్చింది అని ఎత్తుకుని తిరుగుతుంటే నర్స్‌ వచ్చి తిడుతుంది. ఇక సీతారామయ్య గురించి తెలుసుకుని అప్పు బాధపడుతుంది.  తర్వాత ఇంట్లో కావ్య కాపీ తీసుకొచ్చి అపర్ణకు ఇస్తే నిజం చెప్పని వాళ్ల టీ నేను తీసుకోనని అపర్ణ కోప్పడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur Latest News : గుంటూరు నగర మేయర్ రాజీనామా- కారణం ఏంటంటే?
గుంటూరు నగర మేయర్ రాజీనామా- కారణం ఏంటంటే?
Andhra Pradesh Latest News:
"అక్టోబర్‌ 2 తర్వాత హెలికాప్టర్ ఎక్కడైనా దిగొచ్చు" చంద్రబాబు వార్నింగ్ మెసేజ్ 
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Tirupati Crime News:రాత్రికి రాత్రే గోవుల మాయం - గూడూరులో సంచలనం
రాత్రికి రాత్రే గోవుల మాయం - గూడూరులో సంచలనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga babu Indirect Counters on Varma | టీడీపీ ఇన్ ఛార్జి వర్మపై నాగబాబు పరోక్ష కౌంటర్లు | ABP DesamPawan Kalyan on Tamil Movies | భారతదేశం ఏమన్నా కేకు ముక్క కోసుకోవటానికి.? | ABP DesamPawan Kalyan on his Ideology | పూటకో పార్టీతో ఉంటావనే వాళ్లకు ఇదే నా ఆన్సర్ | ABP DesamPawan Kalyan on Tamilnadu Language Fight | హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీలో మాట్లాడి మేటర్ చెప్పిన పవన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Latest News : గుంటూరు నగర మేయర్ రాజీనామా- కారణం ఏంటంటే?
గుంటూరు నగర మేయర్ రాజీనామా- కారణం ఏంటంటే?
Andhra Pradesh Latest News:
"అక్టోబర్‌ 2 తర్వాత హెలికాప్టర్ ఎక్కడైనా దిగొచ్చు" చంద్రబాబు వార్నింగ్ మెసేజ్ 
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Tirupati Crime News:రాత్రికి రాత్రే గోవుల మాయం - గూడూరులో సంచలనం
రాత్రికి రాత్రే గోవుల మాయం - గూడూరులో సంచలనం
Telangana CM Revanth Reddy:
"కేసీఆర్ ఆరోగ్యంతో వందేళ్లు అక్కడ ఉండాలే- మేం ఇక్కడ ఉండాలే" స్టేచర్‌పై మళ్లీ రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Telangana CM Revanth Reddy : కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
Kurnool Crime News: కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
Telangana Assembly Sessions : తెలంగాణలో సీఎం ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన బీఆర్‌ఎస్- అసెంబ్లీ నుంచి వాకౌట్‌ 
తెలంగాణలో సీఎం ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన బీఆర్‌ఎస్- అసెంబ్లీ నుంచి వాకౌట్‌ 
Embed widget