అన్వేషించండి

Brahmamudi Serial Today February 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : రాజ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన శ్వేత – అరవింద్ కు వార్నింగ్ ఇచ్చిన కావ్య

Brahmamudi Today Episode: కావ్య విషయంలో రాజ్ తప్పు చేస్తున్నాడని అర్థం చేసుకున్న శ్వేత, రాజ్ ను కన్వీన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  శ్వేత కోపంగా రాజ్‌ను తిడుతుంది. నాలాగా కావ్య జీవితం కావొద్దని వారిస్తుంది. ఇదొక ఆడపిల్ల జీవితం. నువ్వు నేను కలిసి ఉండటం చూసి తను అడగాలి విడాకులు. అలాంటిది కావ్య ఉక్రోషంతో  రగిలిపోతుంది తప్పా వదిలేసి పోతాననడం లేదు కదా? ఈ అపార్థాలు తొలిగిపోయి తను హ్యాపీగా ఉండాలి. మీరిద్దరు కలిసి ఉండాలి. వెళ్లి మన మధ్య ఉన్నది స్నేహమేనని.. నా సమస్య తీర్చడానికే మనం కలుస్తున్నామని చెప్పు అని శ్వేత తలంటు పోస్తే..

 రాజ్‌: నేను చెప్పను.

శ్వేత: అప్పుడు నా దృష్టిలో నీకు నా భర్తకు పెద్ద తేడా ఏముండదు. వాడు పైకి కనబడతాడు. నువ్వు కనబడకుండానే కాపురాన్ని కూల్చుకుంటున్నావు. పెళ్లంటే బొమ్మలాట అయిపోయిందా?

అంటూ శ్వేత అడగ్గానే తను కావ్యతో కలిసి ఉండలేనని చెప్తాడు. అయితే నేనే వెళ్లి ఇప్పుడే చెప్పేస్తాను. అని వెళ్లబోతుంటే రాజ్‌ అడ్డుపడతాడు. మరోవైపు తన చాంబర్‌లో  కోపంతో రగిలిపోతున్న కావ్య, కళ్యాణ్‌కు ఫోన్‌ చేసి ఆఫీసులో జరుగుతున్న విషయం చెప్తుంది. శ్వేత ఆఫీసుకు వచ్చిందని.. మొదటిసారి మర్డర్‌ ప్లాన్‌ చేస్తున్న నాకు మారణాయుధాలు కావాలి అని అడగడంతో కళ్యాణ్‌ షాక్‌ అవుతాడు. మరోవైపు రాజ్‌, శ్వేతను కారు దగ్గరకు  తీసుకుని వెళ్లి

రాజ్‌: నువ్వు ప్రశాంతంగా వెళ్లు

శ్వేత: ప్రశాంతంగా ఎలా వెళ్లాలి. నా కాపురంలో ప్రాబ్లమ్స్‌ వస్తే నువ్వు అండగా నిలబడ్డావు. అలాంటిది నా వల్ల నీ కాపురంలో సమస్య వస్తే నాకెందుకు అని ఎలా అనుకోవాలి.

రాజ్‌: ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావా ఏంటి?

శ్వేత: అసలు నువ్వు ఆలోచిస్తున్నావా? కావ్య తప్పేంటి చెప్పమంటే ఒక్క కారణం కూడా చూపించలేకపోయావు. మీ ఇద్దరి మధ్య గొడవే లేదు రాజ్‌. 

  అంటూ శ్వేత, రాజ్‌ను కన్వీన్స్‌ చేస్తుంటే..  నేను పెళ్లి అయినప్పుడే డిసైడ్‌ అయ్యాను విడిపోవాలని అంటాడు రాజ్‌. వీళ్లిద్దరిని దూరం నుంచి కావ్య చూస్తుంది. కావ్య చూడటాన్ని గమనించిన రాజ్‌, శ్వేతకు మరింత క్లోజ్‌గా మూవ్‌ అవుతూ శ్వేతను పంపిస్తాడు. మరోవైపు మూర్తి వాళ్ల ఇంట్లో అప్పుకు పెళ్లి సంబంధం వస్తుంది. తమ అబ్బాయి అప్పూను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడని.. అందుకే పెళ్లి సంబంధం అడగడానికి వచ్చామని వాళ్లు చెప్పడంతో కనకం, మూర్తి డైలమాలో పడతారు.

ఇంతలో అప్పు వస్తుంది. తనకు ఇప్పడే పెళ్లి చేసుకోవాలని లేదని వాళ్లకు చెప్తుంది. దీంతో వాళ్లు నీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు  చెప్పండి అంతవరకు మేము ఎదురుచూస్తామని చెప్పి వెళ్లిపోతారు. దీంతో కనకం అప్పు మీద సీరియస్‌ అవుతుంది.

కనకం: నన్నెప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి.

అప్పు: నేనే కాదు. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవాలి.

కనకం: సరే అర్థం చేసుకుంటాను. ఎందుకు ఈ పెళ్లి వద్దంటున్నావు.  అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు.

అంటూ కనకం గట్టిగ నిలదీసి అడగ్గానే.. పోలీసు అవుదామనుకున్నా అంటూ ఇదే నా నిర్ణయం, ఇదే ఫైనల్‌ అనుకోండి అంటూ చెప్పి వెళ్లిపోతుంది. కనకం, మూర్తి ఆలోచనలో పడిపోతారు. మరోవైపు కావ్య  బాధపడుతూ కారులో వెళ్లుతుంటే శ్వేత భర్త అరవింద్‌ అడ్డుగా వస్తాడు. దీంతో డ్రైవర్‌ కారు అపగానే కావ్య కోపంగా అరవింద్‌  దగ్గరకు వెళ్లి ఎందుకు అడ్డుగా వచ్చావని తిడుతుంది.

దీంతో తాను శ్వేత భర్తను అని అరవింద్‌ చెప్పడంతో కావ్య షాక్‌ అవుతుంది. మీ ఆయన, నాభార్య కలిసి ఉన్న ఫోటోలు మీకు సెండ్‌ చేసింది నేనే అని అరవింద్‌ చెప్పగానే కావ్య కోపంగా అరవింద్ ను తిడుతుంది. ముందు నీ భార్యను అదుపులో పెట్టుకో.. కంట్రోల్‌ చేసుకో.. లేదంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది కావ్య. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: స్టేజ్‌పైనే దర్శకుడికి రాఖి కట్టిన అనుపమ - పాపం ఎంత ఫీల్ అయ్యాడో!

టాప్ హెడ్ లైన్స్

Abhishek Yannam: 'ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
Jaya Chiravuri: యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget