అన్వేషించండి

Brahmamudi Serial Today February 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: సొంత బిడ్డను ఎత్తుకుని ఆడించిన తులసి – రాజ్‌, కావ్యలకు ధర్మేంద్ర వార్నింగ్‌  

Brahmamudi serial today episode February 2nd: తులసి తన సొంత బిడ్డను ఎత్తుకుని ఆడిస్తుంది. అది తెలిసి ధర్మేంద్ర రాజ్‌, కావ్యలకు వార్నింగ్‌ ఇవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: రాజ్‌, కావ్య, తులసి దగ్గర ఉన్న తమ బిడ్డను చూసి మురిసిపోతుంటారు. ఇంతలో తులసి చేతుల్లో ఉన్న పాప ఏడుస్తుంది. పాపకు తాను పాలు పట్టిస్తానని చెప్పడంతో ఇంకొకరి పాలు పాపకు పట్టించొచ్చా డాక్టర్‌ అని తులసి అడగ్గానే.. డాక్టర్‌ పట్టించొచ్చు అని చెప్తుంది. దీంతో తులసి పాపను కావ్యకు ఇస్తుంది. కావ్య పాపను పక్కకు తీసుకెళ్లి పాలు పట్టిస్తుంది.

కావ్య: తప్పు ఎవరు చేసినా ఈ అమ్మకి దూరమై నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు.. దీనికి కారణం నేను కాకపోయినా, నీకు గుక్కెడు పాలు ఇవ్వలేకపోయాను తల్లి

రాజ్‌ దూరం నుంచి చూస్తూ బాధపడుతుంటాడు. తులసి తన బిడ్డను ఎత్తుకుని ఆడిస్తుంటుంది. అప్పుడే కావ్య పాపను తీసుకుని దగ్గరకు వస్తుంది.

తులసి: మీ వల్లే మా పాప ఏడుపు ఆపింది. ఇక మీ పాపను తీసుకుని నా పాపను ఇవ్వండి.. మనిద్దరికీ ఏదో రుణానుబంధం ఉన్నట్లుగా ఉంది. లేకపోతే ప్రతిసారి మా పాపకు మీరే సాయం చేస్తున్నారు. ఆరోజు గుడిలో ఏడిస్తే పాట పాడి ఊరుకోబెట్టారు.. ఈరోజు నా పాప ఆకలి తీర్చారు. మీ రుణాన్ని పెంచుకుంటూ పోతున్నారు

కావ్య: నేను కూడా తల్లినే కదండి.. బిడ్డ ఆకలికి రుణం అని పేరు పెట్టడం సరికాదు

తులసి: నా కోసం ఇంత చేసిన మీకు నేను ఏదైనా చేయాలని చిన్న ఆశ

కావ్య: మీరు పాపను బాగా చూసుకుంటే నాకు అదే చాలు

తులసి: పాప నా ప్రాణం.. మీరు ఒకసారి మా ఇంటికి రండి, మా వారు తలచుకుంటే మీ సమస్య ఇట్టే తీరిపోతుంది.

రాజ్‌:  మీరు చెప్పారు కదా రాకుండా ఉంటామా..?

అనగానే సరే అంటూ తులసి వెళ్లిపోతుంది.

కావ్య: ఆ దేవుడు నాతో ఇలా ఆడుకుంటున్నాడు.. నా బిడ్డకు నేను పాలివ్వడానికి.. నా బిడ్డను ఒక్క నిమిషం హత్తు కోవడానికి, ఇంకొకరిని అడగాల్సి వస్తోంది. నా పాప అలా వెళ్లిపోతుంటే నా ప్రాణాన్ని ఎవరో పట్టుకుని తీసుకుని వెళ్లిపోతున్నట్లుగా ఉంది.

రాజ్‌: ఆ దేవుడు మన పాపని దూరం చేయడం లేదు. నీకు దగ్గర చేస్తున్నాడు. మన పాప త్వరలోనే మన దగ్గరకి తిరిగి వస్తుంది.. లేకపోతే ఆ దేవుడు ఇలా చేయడు

అంటూ రాజ్‌ చెప్పగానే.. కావ్య మాత్రం ఎమోషనల్‌ గా చూస్తూనే ఉంటుంది. తర్వాత దుగ్గిరాల ఇంట్లో పాప జాతకం చూపించాలని పంతులును పిలుస్తారు. పాప జాతకం చూసిన పంతులు చాలా బాగుందని చెప్తాడు. కానీ ఏవేవో చిక్కులు వస్తున్నాయని ఆరోగ్యం కూడా బాగాలేదని అపర్ణ చెప్తుంది. అలాంటి చిన్న చిన్న సమస్యలు రావడం సహజమేనని కానీ పాపకు మహారాణి యోగం ఉందని పంతులు చెప్తాడు. అప్పుడే బారసాల గురించి ఇందిరాదేవి అడగ్గానే.. రేఖ వచ్చి కావ్య పరిస్థితే బాగాలేదు బారసాల ఎలా చేస్తారని ప్రశ్నిస్తుంది. దీంతో ఇందిరాదేవి రేఖను తిట్టి పంపిస్తుంది. మరోవైపు మినిస్టర్‌ బాధపడుతుంటే రుద్రాణి వెళ్లి ఓదారుస్తుంది.

రుద్రాణి: కావ్య సొంత ఇట్లోనే పిచ్చిది అయిపోయింది.. అలాంటిది మిమ్మల్ని ఎదుర్కోవడం మామూలు విషయం కాదు.

రాజ్, కావ్యలు మినిస్టర్‌ ఇంటికి వస్తారు. రుద్రాణి చాటుకు వెళ్లిపోతుంది.

మినిస్టర్‌: ఎందుకు వచ్చారు..?

రాజ్‌:  నా భార్య చేయి పట్టుకుని నా బిడ్డ కోసం మీ గుమ్మంలోకి వచ్చేశాను.

మినిస్టర్‌: నా గురించి మీకు తెలియదు.. నేను ఏం చేయగలనో, ఎంతకు తెగించగలనో మీకు తెలియదు

తులసి వస్తుంది. తులసిని చూసి ధర్మేంద్ర సైలెంట్ అవుతాడు.

తులసి: ఏవండి తన బిడ్డ కోసం కావ్య ఎంతో బాధపడుతుంది. వాళ్ల బిడ్డను వాళ్లకు అప్పగించడంలో మీరే సాయం చేయాలి. అప్పుడే వాళ్ల రుణం మనం తీర్చుకున్న వాళ్లం అవుతాం

మినిస్టర్‌: వాళ్ల రుణం మనం తీర్చుకోవడం ఏంటీ

అనగానే అదే ఆరోజు గుడిలో మన పాప ఏడుస్తుంటే.. ఊరుకోబెట్టింది. నిన్న హాస్పిటల్‌ లో పాప ఏడుస్తుంటే పాలు పట్టించింది ఆ రుణం అని తులసి చెప్పగానే.. మినిస్టర్‌, రుద్రాణి షాక్‌ అవుతారు. తులసి పాపను తీసుకుని లోపలికి వెళ్లిపోతుంటే పాపను ఒకసారి ఎత్తుకుంటాను ఇస్తారా..? అని కావ్య అడుగుతుంది. దీంతో మినిస్టర్‌, రుద్రాణి మరింత షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Embed widget