అన్వేషించండి

Brahmamudi Serial Today Fabruary 3rd:  ‘బ్రహ్మముడి’ సీరియల్ : బ్లాక్‌ మనీ దందాలోకి రాజ్‌ – రాజ్‌ను దొంగను చేసిన రుద్రాణి

Brahmamudi Today Episode: వేలంపాటలో నెక్లెస్‌ తీసుకున్న శిరీష్‌ వచ్చి రాజ్‌కు బ్లాక్‌ మనీ ఇవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది  

Brahmamudi Serial Today Episode: రుద్రాణి మాటలు పట్టుకుని నువ్వు చెడిపోతున్నావంటూ అపర్ణ తిడుతుంది. అందరూ అదే మాట అనగానే.. నాకు అన్యాయం జరుగుతుందని తెలిసింది కాబట్టే రుద్రాణి మాటలు వింటున్నాను అంటుంది ధాన్యలక్ష్మీ.

అపర్ణ: ధాన్యలక్ష్మీ నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు. ఒక కొడుక్కి తల్లివి..

ధాన్యలక్ష్మీ: నా కొడుక్కి అన్యాయం జరుగుతుందనే పోరాడుతున్నాను. అందుకే మీకు నేను చెడ్డదాన్ని అయిపోయాను

సుభాష్‌: నువ్వు చెడ్డదానివి అని ఎవరూ అనడం లేదు.. ఎవరి మాటలో నమ్మి చెడిపోతున్నావని అంటున్నాము.

ధాన్యలక్ష్మీ: ఒకవేళ రుద్రాణి చెప్పింది నిజమైతే మాత్రం నేను అసలు ఊరుకోను..

అంటూ ధాన్యలక్ష్మీ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు ఆఫీసులో ఉన్న రాజ్‌ దగ్గరకు వేలంపాటలో నెక్లెస్‌ కొన్న శిరీష్‌ వస్తాడు. నెక్లెస్‌ డబ్బులు మొత్తం క్యాష్ ఇస్తాను అని చెప్తాడు. అది ఆఫీసు లెక్కల్లో చూపించలేను అంటాడు. అందుకే క్యాష్‌ ఇస్తున్నాను అనగానే రాజ్‌ వద్దని చెప్తాడు. శిరీష్‌ కన్వీన్స్‌ చేయగానే సరే అంటాడు. క్యాష్‌ ఇచ్చి వెళ్లిపోతాడు శిరీష్‌. గుమ్మం దగ్గర రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఎదురుచూస్తుంటారు.

రుద్రాణి: వాళ్లు ఇంకా రాలేదేంటి.. అటు నుంచి అటే వెళ్లిపోయారా ఏంటి..?

ధాన్యలక్ష్మీ: ఇవాళే వీసాకు అప్లయ్‌ చేశారు. అప్పుడే ఎలా వెళ్లిపోతారు.

స్వప్న: ఏంటి ఇక్కడ నిల్చుని గుమ్మం వంకే గుంటనక్కలా చూస్తున్నారు.

ధాన్యలక్ష్మీ: ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావు.. చిన్నా పెద్దా అనే తేడా లేదా..?

స్వప్న: మీరు పెద్దవారు. మిమ్మల్ని అంటానా ఆంటీ..?  పీక్కు తినడానికి రెడీగా ఉన్న మా అత్తను అడుగుతున్నాను

రుద్రాణి: ఏయ్‌ నేను కూడా నీకన్నా పెద్దదాన్ని.. నాక్కూడా రెస్పెక్ట్‌ కావాలి.

స్వప్న: నాకు కూడా చాలా కావాలని ఆశపడ్డాను అత్తయ్యా.. కానీ దొరికిన దాంట్లో అర్జెస్ట్‌ అవడం లేదా..? అలాగే నేను ఇచ్చినంత రెస్పెక్ట్‌ లోనే మీరు అడ్జస్ట్‌ అవ్వండి.. అయినా మీరు ఇక్కడ ఎందుకు నిలబడ్డారో నాకు తెలుసు కావ్య, రాజ్‌ రాగానే అమెరికా విషయం అడగడానికే కదా

రుద్రాణి: అడగడమే కాదు.. కడిగిపారేస్తాను

స్వప్న: మీకు అంతలా కడగాలని ఇంట్రెస్ట్‌ ఉంటే కిచెన్‌లో పాత్రలు కడుగు.. ఎందుకంటే వాళ్లు రావడానికి చాలా టై పడుతుందని ఇప్పుడే చెప్పారు

అంటూ వెటకారంగా నవ్వుతూ వెళ్లిపోతుంది స్వప్న. మరోవైపు కళ్యాణ్‌ తనకు వచ్చిన సినిమా చాన్స్‌ గురించి అప్పుకు ఫోన్‌ చేసి చెప్తాడు. అప్పు హ్యాపీగా ఫీలవుతుంది. త్వరలోనే నీ పేరు స్ర్కీన్‌ మీద చూడబోతున్నాం అన్నమాట అంటుంది. తన ట్రైనింగ్‌ కూడా త్వరలోనే అయిపోతుందని ఇక మనం ఎప్పటికీ కలిసే ఉండొచ్చని చెప్తుంది.  ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటారు. రుద్రాణి మాత్రం రాజ్‌, కావ్య ఇంకా భోజనానికి రాలేదని చూస్తుంది.

స్వప్న: దిక్కులు చూస్తూ తినకుండా కూర్చుంటే ఆరోగ్యం బాగుంటుందని ఏ డాక్టరైనా చెప్పారా అత్తయ్యా

రుద్రాణి: పొద్దున్నే లేచిన దగ్గర నుంచి అత్తను అవమానించమని నీకు ఎవరైనా చెప్పారా..?

ఇంతలో రాజ్‌, కావ్య వచ్చి భోజనం చేస్తుంటే..

అపర్ణ: రాజ్‌ ఎవరికీ తెలియకుండా ఆస్తిని మొత్తం డాలర్లుగా మార్చేసి అమెరికా ఎందుకు పారిపోవాలనుకుంటున్నారు

రాజ్‌: పారిపోవడం ఏంటి మమ్మీ

అపర్ణ: ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లితే పారిపోవడమే అంటారు. వెనక నుంచి రుద్రాణి, ధాన్యలక్ష్మీని మోసం చేస్తే ఎవ్వరికీ తెలియదు అనుకుంటున్నావా..? ఏం రుద్రాణి నీ ఆస్థినే కదా వాడు డాలర్లుగా మార్చేస్తుంది.

రుద్రాణి: అంత వెటకారం ఎందుకులే వదిన ఇంతకుముందు నేను మాట్లాడిన దానికి రివేంజ్‌లా ఉంది

అపర్ణ: నువ్వు చెప్పరా రాజ్‌ ఎందుకు అమెరికా పారిపోవాలనుకుంటున్నావు.

కావ్య: నేను చెప్తాను అత్తయ్యా

రాజ్‌:  మేం నిజంగానే దొంగచాటుగా అమెరికా పారిపోవాలనుకుంటే.. వీసా డాక్యుమెంట్స్‌ ఇంట్లో అందరికీ తెలిసేలా ఎలా ఇస్తాము.. మూడో కంటికి తెలియకుండా వెళ్లిపోతాం కదా అత్తా..

కావ్య: రోజంతా ఆఫీసులో కష్టపడి వచ్చిన మనిషిని మీ అనుమానాలతో కనీసం తిండి కూడా తిననివ్వకుండా  చేస్తున్నారు.

రుద్రాణి: సెంటిమెంట్‌ డైలాగ్స్‌ చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారా

రాజ్‌: అత్తా ఎందుకంతా పెద్దమాటలు.. మన డిజైన్స్‌  అమెరికా కస్టమర్లకు నచ్చాయి. వాళ్లు వచ్చి డెమో ఇవ్వమన్నారు. డీల్‌ ఓకే అయితే మన కంపెనీకి 40 కోట్లు వస్తాయి. అందుకే అమెరికా వెళ్తున్నాము

రుద్రాణి: నువ్వు చెప్పేది నిజమేనా..?

కావ్య: మాకు కష్టపడటం.. పైసా పైసా కూడబెట్టడం.. కంపెనీని పై స్థాయికి తీసుకురావడమే తెలుసు.. ఆస్తుల మీద కన్నేయడం.. ఇంటిని ముక్కలు చేయడం మాకు తెలియదు.

ధాన్యలక్ష్మీ: నిజమైతే సంతోషమే అబద్దమైతేనే ఆలోచించాలి.

అని ధాన్యలక్ష్మీ వెటకారంగా అనడంతో రాజ్‌ బాధగా భోజనం చేయకుండా వెళ్లిపోతాడు. అందరూ రుద్రాణి, ధాన్యలక్ష్మీని తిడతారు. తర్వాత రాజ్‌ ఇంట్లో అందరికీ అనుమానం పెరిగిపోతుంది. మనం ఏదైనా చేయాలని ఆలోచిస్తుంటాడు. ఇంతటితో  ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today October 11th: ‘మేఘసందేశం’ సీరియల్‌: సంగీత్‌కు రెడీ అయిన భూమి, సూర్య – స్వామిజీని కొట్టిన అపూర్వ  
‘మేఘసందేశం’ సీరియల్‌: సంగీత్‌కు రెడీ అయిన భూమి, సూర్య – స్వామిజీని కొట్టిన అపూర్వ  
Nindu Noorella Saavasam Serial Today October 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కోమాలోకి వెళ్లిన సీతారాం – అయోమయంలో వైజయంతి   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కోమాలోకి వెళ్లిన సీతారాం – అయోమయంలో వైజయంతి   
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
Nindu Manasulu Serial Today October 10th: నిండు మనసులు: ప్రేరణకి విడాకుల నోట్! సిద్ధూ నిజంగానే విడిపోవాలని అనుకుంటున్నాడా! విజయ్‌ కుట్రేనా!
నిండు మనసులు: ప్రేరణకి విడాకుల నోట్! సిద్ధూ నిజంగానే విడిపోవాలని అనుకుంటున్నాడా! విజయ్‌ కుట్రేనా!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget