అన్వేషించండి

Brahmamudi Serial Today December 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  తాతయ్య విషయంలో డాక్టర్లు చేతులెత్తేశారన్న కళ్యాణ్‌ – అప్పు గురించి ఆరా తీసిన కావ్య

Brahmamudi Today Episode:  తాతయ్య గారికి ఎలా ఉందని కావ్య, కళ్యాణ్‌ను అడగడంతో డాక్లర్లు కూడా చేతులెత్తేశారని కళ్యాణ్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  ఆస్థులు పంచమన్న ధాన్యలక్ష్మీ, రుద్రాణిలను ఇందిరాదేవి తిడుతుంది. అసలు ఆస్తులు పంచమనడానికి మీరెవరు అంటూ ప్రశ్నిస్తుంది. ఎలాంటి కుటుంబంలో ఎలాంటి వాళ్లు తయారయ్యారు. ఇంటి పెద్దకు ఆపదొస్తే ఎలా బతికించుకోవాలా అని ఆరాటపడతారు.  ఉమ్మడి కుటుంబంలో ఉండాల్ని వారేనా మీరు...? ఇవాళ నాకు ఇంత కష్టం వస్తే ఓదార్చడం పోయి కనీసం భోజనం కూడా చేయకుండా చేస్తున్నారా..? అంటూ తినకుండా వెళ్లిపోతుంది ఇందిరాదేవి. తర్వాత కావ్య భోజనం రెడీ చేస్తుంది. అపర్ణ వస్తుంది.

అపర్ణ: ఈ భోజనం ఎవరి కోసం కావ్య

కావ్య: అమ్మమ్మగారికి గారికి అత్తయ్య.. ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడు కూడా తినకుండా టాబ్లెట్స్ వేసుకోకుండా ఉంటే అమ్మమ్మ కు బీపీ డౌన్‌ అవుతుంది.

అపర్ణ: సరే అయితే పద నేను వస్తాను.

 ఇద్దరూ కలిసి ఇందిరాదేవి రూంలోకి వెళ్తారు. అక్కడ ఇందిరాదేవి కనిపించదు. అమ్మమ్మగారు ఎక్కడికి వెళ్లారో నాకు అర్థం అయింది అత్తయ్య అంటుంది కావ్య. ఇందిరాదేవి హాస్పిటల్‌ లో సీతారామయ్య పక్కన కూర్చుని బాధపడుతుంది.

ఇందిర:  ఏంటి బావ ఇది ఇలా ఉలుకు పలుకూ లేకుండా ఇలా పడుకున్నావు. లేవు బావ కళ్లు తెరువు నీ చిట్టితో మాట్లాడు.. నువ్వు బాగున్నావు అని చెప్పు..

కళ్యాణ్‌: తాతయ్యకు ఏం కాదు నాన్నమ్మ.. తొందరలోనే కళ్లు తెరచి మనందరిని చిరునవ్వుతో పలకరిస్తాడు. మన ఇంట్లో హుషారుగా తిరుగుతారు. అందరితో కలిసి భోజనం చేస్తారు

ఇందిర: ఆ ఆశలు చచ్చిపోయాయి కళ్యాణ్‌. ఆ ఇంట్లో ఆనందపు ఆనవాళ్లు లేకుండా పోయాయి. మనవాళ్లు అనుకున్న వాళ్లంతా కాకుండా పోయారు. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇన్నేళ్లు ఆ ఇంటి పరువు ప్రతిష్టలను గుప్పిట్లో పెట్టుకుని కాపాడుకుంటూ వచ్చారు. కానీ పచ్చగా పెరిగే చెట్టుకు చెదలు పట్టినట్టు కుళ్లు కుతంత్రం అనే చెదలు ఆ ఇంటికి పట్టింది.

కళ్యాణ్‌:  అలా అనకు నాన్నమ్మ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా..? మనకు మంచి రోజులు వస్తాయి.

ఇందిర:  అది కలలో కూడా జరిగే అవకాశం లేదురా..

కావ్య: అందుకని  ఇలా ఎవ్వరికీ చెప్పకుండా వచ్చేస్తే ఎలా అమ్మమ్మ. ఇంట్లో వాల్లు గొడవ పడ్డారు. ఏదో మాట మాట అనుకున్నారు. కానీ మీరు ఇలా వచ్చేస్తే ఎలా..? మీరు కనిపించకపోయే సరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా..?

అంటుంది కావ్య. కావ్యను చూసిన ఇందిరాదేవి ఎమోషనల్‌ అవుతుంది. నాకు అక్కడ ఎవరున్నారని అందుకే ఇక్కడకు వచ్చాను అంటుంది. నేను లేనా అమ్మమ్మ గారు అంటూ భోజనం తనే కలిపి తినిపిస్తుంది. ఇందిరాదేవి ఎమోషనల్ అవుతుంది. తర్వాత బయటకు వచ్చిన కళ్యాణ్‌తో కావ్య మాట్లాడుతుంది.

కావ్య: తాతయ్య గారి గురించి డాక్టర్లు ఏమన్నారు కళ్యాణ్‌..

కళ్యాణ్‌: డాక్టర్లు తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పారు వదిన. రోజులు, నెలలు, సంవత్సరాలు అంటూ ఒక్కో పేషెంట్‌ ఒక్కో టైంలో స్పృహలోకి వస్తారంట

కావ్య: నిస్సహాయ స్థితిలో అమ్మమ్మ గారిని.. నిశ్చల స్థితిలో తాతయ్యగారిని చూస్తుంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇంతకీ అప్పు ఎక్కడ..

కళ్యాణ్‌: తను ఎస్సై రిటన్‌ టెస్ట్‌ లో సెలెక్ట్‌ అయింది. ట్రైనింగ్‌ కు రమ్మని లెటర్‌ వచ్చింది అందుకే ట్రైనింగ్‌కు వెళ్లింది వదిన.

కావ్య: అప్పుకు తాతయ్యకు ఇలా జరిగిందని చెప్పావా..?

కళ్యాణ్‌: చెప్పలేదు. వదిన తెలిస్తే తను టెన్షన్‌ పడుతుందని ట్రైనింగ్‌ కూడా వెళ్లనని అంటుందని చెప్పలేదు.

అని కళ్యాణ్‌ చెప్పగానే మంచి పని చేశారు కవిగారు అంటుంది కావ్య. రూంలో ఆస్థుల పంపకం గురించి ఆలోచిస్తున్న ధాన్యలక్ష్మీని ప్రకాష్‌ తిడతాడు. నీకు డబ్బు పిచ్చి పట్టిందని తగ్గించుకోకపోతే నీకే మంచిది కాదని హెచ్చరించి వెళ్లిపోతాడు. ధాన్యలక్ష్మీ మాత్రం నేను చేయాలనుకున్నది చేసే తీరతాను అని మనసులో అనుకుంటుంది. కిచెన్‌లో పడుకున్న కావ్యను చూసిన అపర్ణ, రాజ్‌ను పిలిచి తిడుతుంది. నీ భార్య ఎక్కడికి వెళ్లింది ఏం చేస్తుంది అని కనీసం ఆరా తీయవా అంటూ ప్రశ్నిస్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today November 7th: నిండు మనసులు: ఆ ఇద్దరికీ నా మీద అంత నమ్మకం ఏంటి.. సిద్ధూలో మొదలైన అనుమానం!
నిండు మనసులు: ఆ ఇద్దరికీ నా మీద అంత నమ్మకం ఏంటి.. సిద్ధూలో మొదలైన అనుమానం!
Godavari Serial Today November 7th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద జాను, సూర్యల హగ్.. చూసేసిన సంజయ్! క్యారెక్టర్ లేదూ అంటూ గొడవ!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద జాను, సూర్యల హగ్.. చూసేసిన సంజయ్! క్యారెక్టర్ లేదూ అంటూ గొడవ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఫైల్‌లో క్రిష్ జ్ఞాపకం! బంటీ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన క్రిష్! అక్క సాయం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఫైల్‌లో క్రిష్ జ్ఞాపకం! బంటీ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన క్రిష్! అక్క సాయం!
Illu Illalu Pillalu Serial Today November 7th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతికి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ ఇచ్చిన రామరాజు, ప్రేమ! పాలేరు ఛాన్స్ మిస్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతికి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ ఇచ్చిన రామరాజు, ప్రేమ! పాలేరు ఛాన్స్ మిస్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget