అన్వేషించండి

Brahmamudi Serial Today December 11th:  ‘బ్రహ్మముడి’ సీరియల్:   తండ్రి చావు కోసం ఎదురుచూస్తున్న రుద్రాణి -  రుద్రాణి చెంప పగులగొట్టిన ఇందిరాదేవి

Brahmamudi Today Episode:  నాన్న వచ్చాక ఆస్తుల గురించి మాట్లాడదామన్న సుభాష్‌తో ఆయన ఎప్పటికీ తిరిగిరాకపోతే అని రుద్రాణి అనడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  రుద్రాణి, రాహుల్‌ చెక్‌ గురించి చెప్పగానే ధాన్యలక్ష్మీ ఆలోచనలో పడిపోతుంది. ఈ పరిస్థితుల్లో డబ్బులు అడిగితే బాగుంటుందా..? అంటూ ప్రశ్నించడంతో  రాహుల్‌, రుద్రాణి తమ మాటలతో ధాన్యలక్ష్మీని రెచ్చగొడతారు. నువ్వు ఈ రెండు కోట్లు ఇప్పిస్తేనే ఆస్థిని ముక్కలు చేసి నీ కొడుకుకు న్యాయం చేస్తావని అనుకుంటాను అంటుంది రుద్రాణి. దీంతో నేను అనుకుంటే ఏం చేస్తానో ఇవాళ నీకే కాదు ఇంట్లో వాళ్లకు కూడా తెలుస్తుంది అంటూ చెక్‌ తీసుకుని వెళ్తుంది. హాల్లో రాజ్‌, సుభాష్‌, ప్రకాష్‌ ఏదో ఆఫీసు పని చూసుకుంటుంటే.. ధాన్యలక్ష్మీ వెళ్లి చెక్‌ చూపిస్తుంది.

ప్రకాష్‌ : ఏంటది..

ధాన్యలక్ష్మీ:  మీకు తెలియదా..? ఇది చెక్‌ రాజ్‌ సంతకం కావాలని ఇక్కడ పెట్టాను.

ప్రకాష్‌: అవునా అయితే ఇప్పుడు డబ్బులతో నీకేం పని.

ధాన్యలక్ష్మీ: నాకు కాదు రాహుల్‌కు కావాలంట బిజినెస్‌ చేసుకుంటాడట

ప్రకాష్‌: ఆ తల్లీకొడుకులకు గడ్డి పెట్టి పంపించాం కదా..? నిన్ను మేసి రమ్మని పంపారా..?

సుభాష్‌: అసమర్థులను మేపి పోషించాల్సిన అవసరం మాకు లేదమ్మా.. వాళ్లను ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టడమే ఎక్కువ పైగా రెండు కోట్లు అడుగుతున్నాడు. ఆ నోట్లు తీసి తల్లి లెక్కపెట్టేలోగానే కొడుకు మాయం చేస్తాడు.

ప్రకాష్‌: చాలా మంచి మాట చెప్పావు అన్నయ్యా

రుద్రాణి: ఒకసారి అవకాశం ఇస్తేనే కదా..? తెలుస్తుంది. చూశావా ధాన్యలక్ష్మీ నీ మాటకు నా మాటకు పెద్దగా తేడా లేదు.. నువ్వు ఉరి వేసుకుంటానన్నా ఎవ్వరికీ పట్టదు.

ధాన్యలక్ష్మీ: రాజ్‌ నువ్వు అనామిక వాళ్ల నాన్నకు రెండు కోట్లు ఇచ్చావు. ఇప్పుడు నేను చెప్తున్నాను  రెండు కోట్లు ఇవ్వు

రాజ్‌: అవి కళ్యాణ్‌ పెళ్లి ఆగిపోకూడదని ఇచ్చాను. ఇప్పుడు కూడా నువ్వు నీ కోసమో లేక కళ్యాణ్‌ కోసమో అడిగి ఉంటే ఎవ్వరూ కాదనరు. కానీ నువ్వు అపాత్ర దానం చేస్తానంటున్నావు అందుకే ఇవ్వడం లేదు పిన్ని

ధాన్యలక్ష్మీ: అయితే నా వాటా ఆస్తి నాకు పంచండి

సుభాష్‌: తిరిగి తిరిగి అక్కడికే వస్తావేంటమ్మా… ఆ గొడవ వల్లే కదా మా నాన్న హాస్పిటల్‌  పాలయింది. ఆయన తిరిగి రాని వచ్చాక ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం.

రుద్రాణి: బాగానే చెప్పావు అన్నయ్య కానీ నాన్న తిరిగి రాకపోతే

అని రుద్రాణి మాట్లాడగానే లోపలి నుంచి కోపంగా వచ్చిన ఇందిరాదేవి, రుద్రాణి చెంప పగులగొడుతుంది. నేను తలుచుకుంటే నిన్ను కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెడతాను అంటుంది. అందరూ రుద్రాణిని తిడుతారు. నీకు మా కుటుంబానికి ఏ సంబంధం లేదు. నువ్వు దిక్కున్న చోట చెప్పుకో అంటారు. దిక్కున్న చోట చెప్పుకోవడానికి నేనేం పిరికి దాన్ని కాదు. ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను ఆస్థి పంచాల్సిందే..అని రుద్రాణి చెప్పగానే

ధాన్యలక్ష్మీ: రాజ్‌కు పట్టం కట్టి నా కొడుకుకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. నా మొగుడిని అమాయకుడిని చేసి ఆడుకుంటున్నారు. నేను కూడా ఆస్థి కోసం ఎంతదాకా అయినా వెళ్తాను. కోర్టుకు వెళ్తాను. మీడియాకు ఎక్కుతాను

రుద్రాణి: శభాష్‌ ధాన్యలక్ష్మీ నీకు నేనున్నాను. నువ్వు ఆస్థి కోసం ఏదైనా చేయాలనుకుంటే చేయ్‌ నీకు నేనున్నాను

ప్రకాష్‌:  మీరు ఎంత దూరం అయినా వెళితే ముందు పచ్చని కాపురంలో చిచ్చు పెట్టినందుకు నిన్ను నా మాట విననందుకు నా పెళ్లాన్ని జైలుకు పంపిస్తాను.

అనడంతో ధాన్యలక్ష్మీ కోపంగా ప్రకాష్‌ను తిడుతుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అంతా ఓపిగ్గా గమనిస్తున్న సుభాష్‌ కోపంగా ఆపండి అంటూ గట్టిగా అరుస్తాడు.  మీకు కావాల్సింది ఆస్థులే కదా..? రేపే లాయరును పిలిపించి మొత్తం వాటాలు పంచేస్తాను అని వెళ్లిపోతాడు. రుద్రాణి, ధాన్యలక్ష్మీ హ్యాపీగా ఫీలవుతారు. తర్వాత సుభాష్‌ దగ్గరకు వెళ్లిన కావ్య మీ నిర్ణయం మార్చుకోండి మామయ్య అని చెప్తుంది. సుభాష్‌ మాత్రం నా నిర్ణయం మారదు అని చెప్తాడు. తర్వాత రాజ్‌ను కూడా ఇల్లు ముక్కలవుతుంటే మీరు పట్టించుకోరా అని నిలదీస్తుంది కావ్య. అవేమీ నాకు అవసరం లేదని చెప్తాడు రాజ్‌. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 15: చనిపోయినట్లు నటించి తప్పించుకున్న మురళి...కౌషికి వీడియో పంపి రూ.5కోట్లు డిమాండ్ చేసిన దివ్యాంక
జగద్ధాత్రి సీరియల్: చనిపోయినట్లు నటించి తప్పించుకున్న మురళి...కౌషికి వీడియో పంపి రూ.5కోట్లు డిమాండ్ చేసిన దివ్యాంక
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కిడ్నాప్‌లో లీడ్ కనిపెట్టిన మహా! జల్లెడ పడుతున్న విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కిడ్నాప్‌లో లీడ్ కనిపెట్టిన మహా! జల్లెడ పడుతున్న విహారి!
Godavari Serial Today October 15th: 'గోదావరి' సీరియల్: జాను, సూర్యల లవ్ మేటర్ శేషుకి చెప్పేసిన సింహాద్రి! నందుకి డబ్బు ఇచ్చిన మురళీ!
'గోదావరి' సీరియల్: జాను, సూర్యల లవ్ మేటర్ శేషుకి చెప్పేసిన సింహాద్రి! నందుకి డబ్బు ఇచ్చిన మురళీ!
Nindu Manasulu Serial Today October 15th: నిండు మనసులు: ప్రేరణ ఇంటికి లగేజ్‌తో వచ్చేసిన సిద్ధూ! టాస్ గెలిచిన ప్రేరణ! సంతోషంలో రాజశేఖరం!
నిండు మనసులు: ప్రేరణ ఇంటికి లగేజ్‌తో వచ్చేసిన సిద్ధూ! టాస్ గెలిచిన ప్రేరణ! సంతోషంలో రాజశేఖరం!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget