అన్వేషించండి

Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను కన్వన్స్‌ చేసిన అపర్ణ – నిజం చెప్పాలనుకున్న కావ్య

Brahmamudi serial today episode August 21st:  ఎవరు చెప్పినా రాజ్‌ వినకుండా అమెరికా బయలుదేరాడని కావ్య నిజం చెప్పాలనుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: రాజ్‌ అమెరికా బయలుదేరగానే వైదేహి వచ్చి వెళ్లొద్దని చెప్తుంది. అయినా రాజ్‌ వినడు. గతం గుర్తు లేని మీరు అక్కడికి వెళ్లి ఇబ్బంది పడతారని చెప్తుంది. అయినా రాజ్‌ వినడు.

యామిని: వెళ్లనివ్వు మామ్‌ అక్కడికి వెళ్లాకైనా బావకు మనఃశాంతిగా ఉంటుంది.

రాజ్‌: నువ్వొక్కదానివే నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు యామిని

ఇందిరాదేవి: మేము నిన్ను అర్థం చేసుకోలేదు

అపర్ణ, ఇందిరాదేవి ఎంట్రీ ఇస్తారు.

రాజ్‌: (మనసులో) ఇదేంటి కళావతి గారు వస్తారనుకుంటే ఈ ముసలి బ్యాచ్‌ వచ్చిందేంటి..?

అపర్ణ: చెప్పరా మేము నిన్ను అర్థం చేసుకోలేదా..? అమ్మా అమ్మా అంటూ తిరిగావే ఇదేనా కొడుకుగా నువ్వు చేసే పని

ఇందిరాదేవి: మీరు నన్ను దత్తత తీసుకోండి నేను మీ మనవడిగా తోడుగా ఉంటానన్నావు ఇదేనా తోడుగా ఉండటం అంటే

అపర్ణ: కళావతి ఏదో అందని కోపంతో ఊరు వదిలి వెళ్లాలని డిసైడ్‌ అయ్యావు.. మరి మా గురించి ఒక్కసారైనా ఆలోచించావా..?

ఇందిరాదేవి: అదంతా కాదురా మా కళావతిని పెళ్లి చేసుకుని తీరుతానన్నావు.. శపథం చేశావు. ఒప్పించే వరకు వదిలిపెట్టను అన్నావు.. ఇదేనా నువ్విచ్చిన మాటకు ఉన్న విలువ. ఇలా మధ్యలో వదిలేసి వెళ్లిపోతావా…

యామిని: వెళ్లకుండా ఎలా ఉంటాడు అమ్మమ్మ తనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానిస్తుంది. మా బావ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన వెంట తిరగాలా..? మీ మనవరాలికి అవసరం అన్నప్పుడు మా బావ వెంట ఎంత తిరిగింది. ఆఫీసులో అవసరం ఉందన్నప్పుడు బాస్‌లా నటించడానికి మా బావ ఎంత రిస్క్‌ తీసుకున్నాడు. అవన్నీ గుర్తు లేవా మీ కళావతి గారికి

రాజ్‌: ( మనసులో)  ఇందేంటి ఇలా మాట్లాడుతుంది. నేనేదో కళావతి గారి మనసులో మాట బయటపెట్టడానికి నాటకం ఆడుతుంటే.. ఇది మొత్తం చెడగొట్టేలా ఉందేంటి

అపర్ణ: ఎవరికి ఎవరి మీద ప్రేమ ఉందో నువ్వు చెప్పాలా మాకు..

రాజ్‌: నిజంగానే నా మీద ప్రేమ ఉండి ఉంటే.. ఇవాళ తను వచ్చేది మీరు వచ్చే వాళ్లు కాదు

అంటూ రాజ్‌ ఎయిర్‌ఫోర్టుకు వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్‌ ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతుంది. కావ్య. యామిని, రుద్రాణికి ఫోన్‌ చేసి రాజ్‌ వెళ్లిపోయాడని చెప్తుంది. ఎలాగైనా రాజ్‌ను కలిసి కావ్య ప్రెగ్నెంట్‌ అనే విషయం చెప్పాలని రుద్రాణి ఎయిర్‌ఫోర్ట్‌కు బయలుదేరుతుంది. ఇక యామిని సాంగ్స్‌ వింటూ హమ్‌ చేస్తుంటే వైదేహి వెళ్తుంది.

వైదేహి: నువ్వేంటి ఇంత ఆనందంగా ఉన్నావు.. రాజ్‌ అమెరికాకు వెళ్లిపోతున్నాడని బాధపడుతూ ఉంటావనుకున్నాను.. రాజ్‌ వెళ్లిపోతున్నందుకు నీకు బాధగా లేదా..?

యామిని: బాధ ఎందుకు మామ్‌ బావ ఏమైనా నాకు దూరం అవ్వడానికి వెళ్తున్నాడా..? నాకు ఇంకా దగ్గరవుతున్నాడు. కాదు ఆ కావ్యే నాకు దగ్గర అయ్యేలా చేస్తుంది. మామ్‌ అందుకే ఈ హ్యాపీ.. ఒక్క నిమిషం ఆ కావ్యకు ఫోన్ చేస్తాను

వైదేహి: ఇప్పుడు దానికి ఎందుకే..

యామిని: ఎందుకు అంటావేంటి మామ్‌ .. నాకు ఇంత ఫేవర్‌ చేస్తున్న కావ్యకు కనీసం థాంక్స్‌ కూడా చెప్పకపోతే   పాపం ఫీల్ అవుతుంది కదా..?

అంటూ కావ్యకు కాల్ చేసి వెటకారంగా మాట్లాడుతుంది. రాజ్‌ వెళ్లిపోయాక తాను అమెరికా వెళ్లి రాజ్‌కు దగ్గరవుతాను అని చెప్తుంది. దీంతో కావ్య ఏడుస్తూ దేవుడి దగ్గరకు వెళ్లి మొక్కి రాజ్‌కు నిజం చెప్పేస్తానని ఏం జరిగినా నువ్వే చూసుకోవాలని మొక్కి ఎయిర్‌ఫోర్ట్‌కు బయలుదేరుతుంది. ఎయిర్‌ఫోర్ట్కువెళ్తున్న రాజ్‌ కారు పక్కన ఆపి కాల్ మాట్లాడుతుంటే రుద్రాణి వెళ్లి నిజం చెప్పబోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 14th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
Podarillu Serial Today Oct 14: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం
పొదరిల్లు: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget