అన్వేషించండి

Brahmamudi Serial Today August 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కనకం ప్లాన్‌ సక్సెస్‌ - కావ్యను ఆశీర్వదించిన రాజ్

Brahmamudi serial today episode August 18th: కనకం ప్లాన్‌ ప్రకారం రాజ్‌ చేత కావ్యకు ఆశీర్వాదాలు ఇప్పించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కావ్య కడుపుతో ఉందన్న విషయం స్వరాజ్‌ ద్వారా ఇంట్లో వాళ్లకు ముఖ్యంగా రాజ్‌కు తెలిసేలా చేయాలనుకుంటుంది రుద్రాణి. అందుకోసం గార్డెన్‌ లో చాక్లెట్‌ తింటున్న స్వరాజ్‌ దగ్గరకు వెళ్తుంది.

రుద్రాణి: హాయ్‌ స్వరాజ్‌.. చాక్లెట్‌ తింటున్నావా..?

స్వరాజ్‌: లేదు ఆంటీ బిస్కెట్‌ తింటున్నాను..

రుద్రాణి: అదేంటి అది చాక్లెట్‌ కదా.. బిస్కెట్‌ అంటున్నావేంటి..?

స్వరాజ్: మరి చాక్లెట్‌ అని మీకు తెలుసు కదా… మళ్లీ స్పెషల్ గా అడగడం దేనికి

రుద్రాణి: అది సరే నీకు చాక్లెట్‌ ఇచ్చిన కావ్యకు కంగ్రాట్స్‌ చెప్పవా మరి..

స్వరాజ్‌: చాక్లెట్‌ ఇస్తే ఎవరైనా థాంక్స్‌ చెప్తారు కానీ కంగ్రాట్స్‌ ఎందుకు చెప్తారు..?

రుద్రాణి: చాక్లెట్‌ ఇస్తే థాంక్స్‌ చెప్పాలి స్వరాజ్‌ కానీ నీకు చాక్లెట్‌ ఇచ్చిన ఆంటీ నీతో ఆడుకోవడానికి ఒక బుల్లి స్వరాజ్‌ను ఇస్తుంది కదా..? అందుకని కంగ్రాట్స్‌ చెప్పమంటున్నాను.

స్వరాజ్: ఏంటి ఆంటీ నాకు ఫ్రెండ్‌ను ఇవ్వబోతుందా..? అయితే ఇప్పుడే కగ్రాట్స్‌ చెప్పి వస్తాను ఇప్పుడు తను ఎక్కడ ఉంది

రుద్రాణి: లోపల హాల్లో ఉంది వెళ్లు వెళ్లి కంగ్రాట్స్‌ చెప్పు

స్వరాజ్: అలాగే

రుద్రాణి: కావ్య ఇక నువ్వు ప్రెగ్నెంట్‌ అనే విషయాన్ని బయట పడకుండా ఎలా ఆపుతావో నేను చూస్తాను.

అనుకుంటుంది రుద్రాణి. ఇక స్వరాజ్‌ లోపలికి వెళ్తాడు.

స్వరాజ్: కంగ్రాట్స్‌ ఆంటీ

కావ్య: నాకెందుకు చెప్తున్నావురా..?

స్వరాజ్‌: నువ్వు కడుపుతో ఉన్నావు కదా..? త్వరలోనే నువ్వు నాకు ఒక ఫ్రెండ్‌ను ఇస్తున్నావు కదా… అందుకే చెప్తున్నాను ఆంటీ. (అందరూ షాక్‌ అవుతారు.) ఏంటి ఆంటీ అలా చూస్తున్నావు.. నేను తెలుసుకుని వచ్చి కంగ్రాట్స్‌ చెబితే కనీసం థాంక్స్‌ కూడా చెప్పవా..?

రుద్రాణి:  ఇప్పుడు ఆ కావ్య ఏం చెప్తుందో నేను చూస్తాను..

రాహుల్: నేను కూడా చూస్తాను.

కనకం:  ఒరేయ్‌ నా కూతురు కడుపుతో ఉందని నీకెలా తెలుసు..?

స్వరాజ్‌: తెలుసుకున్నాను..

కనకం: అదేరా ఎలా తెలుసుకున్నావు..?

స్వరాజ్‌: అదిగో ఆ ఆంటీ చెప్పింది

అంటూ రుద్రాణిని చూపిస్తాడు.

ఇందిరాదేవి: నీకు అసలు బుద్ది ఉందా..? చిన్న పిల్లలకు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియదా..?

రాజ్‌: ఇప్పుడు చిన్న పిల్లాడికి ఏ విషయం చెప్పాలా చెప్పకూడదా అనేది ఇంపార్టెంట్‌ కాదు నాన్నమ్మ. కళావతి కడుపుతో ఉందని ఎందుకు చెప్పింది..?

రుద్రాణి: (మనసులో) కావ్య నోరు తెరచి నిజం చెప్తుంది అనుకుంటే ఇది అటూ తిరిగి ఇటు తిరిగి నా మీదకు వచ్చిందే..? ఇప్పుడు ఎలా అని

రాజ్‌: ఏంటి రుద్రాణి గారు కళావతి కడుపుతో ఉందని చెప్పారా.?

రుద్రాణి: అవును కడుపుతో ఉందని చెప్పాను.. కానీ నేను వాడికి చూపించింది అప్పును వాడు వెళ్లి కళావతిని అడిగాడు దానికి నేనేం చేయను..

కనకం: విన్నారా..? బాబు రుద్రాణి గారు మా అప్పును చూపిస్తే.. వాడు కళావతిని అడిగాడంటా

రాజ్: ఒక్క నిమిషం నా గుండె ఆగినంత పనైంది తెలుసా..?

కనకం:  నాకు కూడా..

రాజ్‌:  మీకు ఎందుకు టెన్షన్‌

కనకం: ముందు మీరు ఎందుకు టెన్షన్‌ పడ్డారు చెప్పండి.

రాజ్‌: పెళ్లి కాకుండానే కళావతి గారికి కడుపు వచ్చిందంటే టెన్షన్‌ పడరా..?

కనకం: నేను కూడా అందుకే పడ్డాను బాబు

రుద్రాణి: అసలు ఇదంతా ఆ బాబు వల్లే వచ్చింది.

ఇందిరాదేవి: కాదు నీ వల్ల వచ్చింది. ఆ దేవుడు నీకు నోరు ఇచ్చారు కదా..? అప్పు కడుపుతో ఉందని చెప్పాలా..? వేలు పెట్టి చూపించాలా..?

రుద్రాణి:  ఇది మరీ బాగుంది అమ్మా నాకేం తెలుసు ఇలా జరుగుతుందని

రాజ్‌: అయినా మీరేంటి కళావతి గారు అలా షాక్‌లో ఉండిపోయారు. వాడు అడగ్గానే నిజం చెప్పొచ్చు కదా..?

కనకం: అంటే బాబు మనం అందరం ఎలా షాక్‌ అయ్యామో తను కూడా షాక్‌ అయ్యుండొచ్చు కదా..?

అంటూ కనకం చెప్పగానే అందరూ అవును అయ్యుండొచ్చు కదా అంటారు. ఇంతలో పంతులు వ్రతానికి టైం అవుతుందన పిలుస్తాడు. అందరూ వెళ్లి పూజలో కూర్చుంటారు. పూజ అయిపోయాక కనకం ప్లాన్ ప్రకార రాజ్‌ చేత కావ్య మీద అక్షింతలు వేయిస్తుంది. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. రుద్రాణి, రాహుల్ షాక్‌ అవుతారు. తర్వాత రాజ్‌, కావ్యతో ఎమోషనల్ అవుతాడు. కావ్యను తప్పా తన మనసు వేరొకరిని యాక్సెప్ట్‌ చేయడం లేదని బాధపడతాడు. కావ్య కూడా బాధపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu illalu pillalu Serial Today August 27th: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్: నిజం తెలిసి ఎమోషనల్‌ అయిన సుమిత్ర – షాక్ లో పారిజాతం
‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్: నిజం తెలిసి ఎమోషనల్‌ అయిన సుమిత్ర – షాక్ లో పారిజాతం
Gundeninda Gudigantalu August 27th:డెకరేషన్ ఆర్డర్‌ వేలంలో పాల్గొన్న మీనాకు ఎదురైన సవాల్‌ ఏంటి..?దాన్ని మీనా ఎలా అధిగమించింది..?
గుండెనిండా గుడిగంటలు:డెకరేషన్ ఆర్డర్‌ వేలంలో పాల్గొన్న మీనాకు ఎదురైన సవాల్‌ ఏంటి..?దాన్ని మీనా ఎలా అధిగమించింది..?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 27th:నాటకంతో సుందరిని బోల్తా కొట్టించిన రాధ, విక్కీ...బావ తనవాడు కాబోతున్నాడని చిట్టి ఆనందం
నువ్వులేక నేను లేను: నాటకంతో సుందరిని బోల్తా కొట్టించిన రాధ, విక్కీ...బావ తనవాడు కాబోతున్నాడని చిట్టి ఆనందం
Karthika Deepam 2 Serial Today August 27th: ‘కార్తీక దీపం 2’ సీరియల్: నిజం తెలిసి ఎమోషనల్‌ అయిన సుమిత్ర – షాక్ లో పారిజాతం
‘కార్తీక దీపం 2’ సీరియల్: నిజం తెలిసి ఎమోషనల్‌ అయిన సుమిత్ర – షాక్ లో పారిజాతం

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
GV Narayanarao : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
YSRCP North Andhra Leaders: వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లో టాలీవుడ్ హీరో రొమాంటిక్ మూవీ - ముగ్గురమ్మాయిలతో రిలేషన్... స్టోరీలో బిగ్ ట్విస్ట్
రెండు ఓటీటీల్లో టాలీవుడ్ హీరో రొమాంటిక్ మూవీ - ముగ్గురమ్మాయిలతో రిలేషన్... స్టోరీలో బిగ్ ట్విస్ట్
Toxic First Day Collection : టాక్సిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ - నెగిటివ్ టాక్ వచ్చినా హౌస్ ఫుల్
టాక్సిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ - నెగిటివ్ టాక్ వచ్చినా హౌస్ ఫుల్
YS Jagan Unanimous Elections Stand: అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు - ఇప్పుడు మాత్రం నో - జగన్ స్ట్రాటజీ వెనుక లెక్కలేంటి?
అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు - ఇప్పుడు మాత్రం నో - జగన్ స్ట్రాటజీ వెనుక లెక్కలేంటి?
Vijay TVK Parandur Airport:తమిళనాడులో పరంధూర్ ఎయిర్‌పోర్ట్ రద్దు - విజయ్ పాపులిస్ట్ మార్క్.. జగన్ పాలనతో ఎందుకు పోలుస్తున్నారు?
తమిళనాడులో పరంధూర్ ఎయిర్‌పోర్ట్ రద్దు - విజయ్ పాపులిస్ట్ మార్క్.. జగన్ పాలనతో ఎందుకు పోలుస్తున్నారు?
Embed widget