అన్వేషించండి

Brahmamudi Serial Today April 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కావ్య వెనకాలే కిచెన్‌లోకి వెళ్లిన రాజ్‌ - క్యారమ్‌ పౌడర్‌ కోసం వచ్చిన ప్రకాష్‌  

Brahmamudi Today Episode: ఎవరి కంటా పడకుండా రాజ్‌ను కిచెన్‌లోకి, తన బెడ్‌రూంలోకి కావ్య తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఫన్నీగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode:  ఇంటికి వచ్చిన రాజ్‌ను చూసి కావ్య కంగారు పడుతుంది. మా ఇంటికే కరెక్టుగా ఎలా రాగలిగారు అని అడుగుతుంది. ఏమోనండి నాకు తెలియకుండానే నేను ఈ ఇంటికి వచ్చాను తీరా ఇక్కడ చూస్తే మీరున్నారు అని చెప్తాడు.

కావ్య: అదెలా సాధ్యం..

రాజ్‌: నేను మిమ్మల్ని ఇంతకముందు చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పాను కదా ఈ ఇంటిని చూస్తే కూడా సేమ్‌ ఫీలింగ్‌ వస్తుందండి. ఇంతకముందు ఈ ఇంటికి  నాకు ఏదో బంధం ఉన్నట్టు అనిపించింది. బహుశా అందుకేనేమో నా సిక్త్‌ సెన్స్‌ నన్నుఇక్కడకు తీసుకొచ్చింది. అయినా మీరేంటండి ఇంటికి వచ్చిన గెస్ట్ ను ఇలా గుమ్మం దగ్గరే నిలబెట్టి మాట్లాడుతున్నారు.

కావ్య రాజ్‌ను లోపలికి తీసుకెళ్తుంది. రాజ్‌.. కావ్య కోసం గిఫ్ట్‌ ఇస్తాడు.

కావ్య: ఓ ఇది ఇవ్వడానికే వచ్చారా..? ఇచ్చి వెళ్లిపోతారా..?

రాజ్‌: ఏంటండి ఇంటికి వచ్చిన గెస్ట్‌ కు కనీసం కాఫీ అయినా ఇవ్వరా..?

కావ్య: పాలు లేవండి..

రాజ్‌: అయితే జ్యూస్‌ అయినా ఇస్తారా..? కనీసం మంచినీళ్లైనా ఇవ్వండి

కావ్య:  జ్యూస్‌ కావాలంట (గట్టిగా అరుస్తుంది.)

అపర్ణ:  అయ్యో జ్యూస్‌ అడుగుతున్నాడంటే భోజనం కూడా ఇక్కడే చేస్తాడేమో ( మనసులో అనుకుంటుంది)

రుద్రాణి: అదేంటి కావ్య మళ్లీ జ్యూస్‌ అని అడుగుతుందేంటి

అప్పు:  అదేం లేదు మనకు ఏమైనా జ్యూస్ కావాలా..? అని అడుగుతుంది. ఇందాకా మీకు ఎంత వరకు చెప్పాను

రాహుల్‌:  మాకు తెలిసిందే చెప్తూ మమ్మల్ని ఇరిటేట్‌ చేస్తున్నావా..?

స్వప్న: ఏంటి అప్పు అంతా ఏదేదో మాట్లాడుతున్నావు. నేను పాప దగ్గరకు వెళ్తాను.

అప్పు: అయ్యో ఉండు అక్కా మొత్తం వినకుండా వెళ్తావా..?

ఇందిరాదేవి: అయ్యో అపర్ణ నాకు ఇక్కడ ఉక్కపోస్తుంది. హాల్లోకి వెళ్దాం పద

కావ్య: మీరు ఒక్కరే హాల్లో ఉంటే బోరు వస్తుంది కదా నాతో కిచెన్‌ లోకి రండి

అంటూ రాజ్‌ను తీసుకుని కిచెన్‌ లోకి వెళ్లి జ్యూస్‌ చేస్తుంది.

రాజ్‌: మీరు అర్జెంట్‌ గా ఎక్కడికైనా వెళ్లాలా కళావతి గారు.

కావ్య: అబ్బే అదేం లేదే.. ఎందుకు అలా అడిగారు.

రాజ్‌: ఏం లేదు మీరు కంగారు పడుతున్నారు కదా అందుకే అడిగాను

కావ్య: మీరు వచ్చారు కదా అందుకే ఇంత కంగారు (మనసులో అనుకుంటుంది.)

రాజ్‌:  అవును ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదు

కావ్య: ఉన్నారంటే అందరినీ పరిచయం చేయమంటాడేమో.. (మనసులో అనుకుంటుంది) గుడికి వెళ్లారు వాళ్లు రావడానికి గంట పడుతుంది

రాజ్‌:  అయితే మనం గంట సేపు మాట్లాడుకోవచ్చు

అనగానే కావ్య జ్యూస్‌ ఇస్తుంది. రాజ్‌ జ్యూస్ తాగిన తర్వాత ఇక వెళ్తారా అని అడుగుతుంది కావ్య. తనకు వాష్‌ రూంకు వెళ్లాలని చెప్తాడు. దీంతో కావ్య రాజ్‌ను తన బెడ్‌రూంకి తీసుకెళ్తుంది. రాజ్‌ వాష్‌ రూం వెళ్లాక బయటకు తొంగి చూస్తుంటుంది కావ్య. రాజ్‌ వచ్చి తాను తీసుకొచ్చిన గిఫ్ట్ ఎలా ఉందని అడుగుతాడు. గిఫ్ట్‌ ఓపెన్ చేసి శారీ చూసి చాలా బాగుంది అంటుంది.

రాజ్‌:  నేను చెప్తే మీరు నమ్మడం లేదు కానీ మనిద్దరి ఆలోచనలు ఒకేలాగా ఉన్నాయి. ఒక విషయం అడుగుతాను నిజం చెప్తారా మనిద్దరికీ ఇంతకుముందు పరిచయం ఉందా..?  నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నా సొంత ఇంట్లోకి వచ్చినంతగా అనిపిస్తుంది. మీరేదో దాస్తున్నారు చెప్పండి.

కావ్య : మా ఇంట్లో వాళ్లు వచ్చే టైం అయింది. మీరు ఇక వెళ్లండి

అంటూ రాజ్‌ను కిందకు తీసుకెళ్తుంది కావ్య. రాజ్‌ మెయిన్‌ డోర్‌ దాటగానే అందరూ ఒక్కసారిగా హాల్లోకి వస్తారు. వాళ్లు చూస్తారేమోనని కావ్య డోర్‌ క్లోజ్‌ చేస్తుంది. అపర్ణ, అప్పు ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
Tejaswini Prakash: కార్తీక దీపం 2 విలన్ 'మాలిని'.. తేజస్విని ప్రకాష్ రియల్ లైఫ్‌, కెరీర్ విశేషాలు
కార్తీక దీపం 2 విలన్ 'మాలిని'.. తేజస్విని ప్రకాష్ రియల్ లైఫ్‌, కెరీర్ విశేషాలు
Nindu Manasulu Serial Today July 22nd: నిండు మనసులు: ఈశ్వరి శవం దగ్గర రచ్చ రచ్చ! తండ్రి ఫొటోకి దండ వేసేసిన గణ!
నిండు మనసులు: ఈశ్వరి శవం దగ్గర రచ్చ రచ్చ! తండ్రి ఫొటోకి దండ వేసేసిన గణ!
Nuvvu leka Neanu Lenu Serial Today July 22nd: దత్తతు ఒప్పుకున్న రాధ...దొంగచిట్టిని తెప్పించేందుకు దమయంతి కుట్రలు
నువ్వులేక నేను లేను: దత్తతు ఒప్పుకున్న రాధ...దొంగచిట్టిని తెప్పించేందుకు దమయంతి కుట్రలు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
TDP YSRCP Political Row: అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
Rahul Gandhi Protest: ప్రధానమంత్రి నివాసానికి రాహుల్, ప్రియాంక ఎలా దూసుకొచ్చారు? వారిని మార్గమధ్యలోనే ఎందుకు అడ్డుకోలేదు?
ప్రధానమంత్రి నివాసానికి రాహుల్, ప్రియాంక ఎలా దూసుకొచ్చారు? వారిని మార్గమధ్యలోనే ఎందుకు అడ్డుకోలేదు?
AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Embed widget