Prema Entha Madhuram July 17th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ : కన్న కొడుకుతో కలిసి యాగం చేస్తున్న ఆర్య.. అను పూజకు అడ్డుపడుతున్న మాన్సీ?
ఆర్య తన కొడుకుతో కలిసి పూజ చేయటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram July 17th: అను పూజ ప్రారంభిస్తుంది. ఇక పిల్లలిద్దర్నీ ప్రీతి, రేష్మ చూసుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన మాన్సీ ఏం జరుగుతుందో చూడటానికి వస్తుంది. ఏదో ఒక పని చేయాలని. ఇక ఆర్య వాళ్ళు పూజ చేస్తున్న దగ్గరికి వెళ్ళగా అక్కడ పూజారి ఆర్య వాళ్లకు ఈ పూజ చేయడం వల్ల దోష నివారణ అవుతుంది అని చెబుతారు. అన్ని సక్రమంగానే ఉన్నాయి కానీ ఒకటి మాత్రం లోటు అని.. ఈ పూజలో మీ భార్య ఉంటే మంచి ప్రతిఫలం అందేది అని అంటాడు.
తను లేదని అందుకే తనకోసమే పూజ చేస్తున్నామని అంటుంది. తన భార్య ఉంది అని ఆర్య అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. కానీ ఆర్య అను చీర చూపించి తను మనసులో ఉంది అని ఆ చీరను తన పక్కన పీటల మీద పెట్టి పూజలో పాల్గొంటాడు. ఆ తర్వాత మాన్సీ అను దగ్గరికి వెళ్లి చూస్తుంది. ఇక అక్కడ పూజారి అనుతో 11 బిందెల నీటితో అమ్మవారికి అభిషేకం చేయాలని, 108 కమలాలతో పూజ చేయాలి అంటాడు.
అప్పుడే అక్కడికి అంజలి కలువ పువ్వులు తీసుకొని వస్తుంది. ఇక ఒక్క పువ్వు కూడా తగ్గదు అని పూజారి చెబుతాడు. అంతవరకు అమ్మవారికి నీటితో అభిషేకం చేయమని చెప్పి తన పూజ ఏర్పాట్లు చేయడానికి అక్కడి నుంచి మరో చోటికి వెళ్తారు. ఇక అక్కడే ఉన్న మాన్సీ ఎలాగైనా అను పూజ జరగకూడదు అని కమలాలు తీయడానికి ప్లాన్ చేయటంతో అక్కడ ప్రీతి, రేష్మ ఉండటంతో వీలు కాదు.
ఇక పిల్లలు ఏడవటంతో వారిద్దరూ చెరొకవైపు వెళ్ళటంతో వెంటనే మాన్సీ పువ్వులు తీస్తుంది. ఇక ఆర్యను పూజారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయమని అంటాడు. మరోవైపు అను బిందెలతో నీరు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తుంది. ఇక ఆర్య ప్రదక్షణం చేస్తున్న సమయంలో అంజలి బాబుని ఎత్తుకొని కనిపిస్తుంది.
వెంటనే ఆర్య మీరు ఏంటి ఇక్కడ అనడంతో తెలిసిన వాళ్ళు పూజ చేస్తున్నారు అని చెబుతుంది అంజలి. మేము కూడా ఇక్కడ యాగం చేయిస్తున్నాము మీ పూజ తర్వాత అక్కడికి రండి అని అంటాడు ఆర్య. ఇక అప్పుడే బాబు ఏడవటంతో ఆర్య బాబుని ఎత్తుకుంటాడు. ఇక బాబు ఊరుకోవటంతో తండ్రి దగ్గరికి వెళ్లాక ఊరుకున్నాడు అని అనుకుంటుంది అంజలి.
ఇక ఆర్య బాబుని ఎత్తుకొని యాగం చేయటానికి కూర్చుంటాడు. ఇక పూజారి కూడా బాబుకి కంకణం కడతారు. అది చూసి మాన్సీ ఆర్య భార్య పిల్లల కోసం పూజ చేస్తున్నాడని.. కానీ వాళ్ళు ఇక్కడే ఉన్నారన్న తెలియదు అని అనుకుంటుంది. అంతేకాకుండా కన్న కొడుకుతో యాగం చేయిస్తున్నాడు అని పొగరుగా అనుకుంటున్నాను. అభిషేకం తర్వాత అను కమలాలు 108 ఉన్నాయా లేదా చూసుకుంటుంది.
అందులో తక్కువ పడటంతో టెన్షన్ పడుతుంది. వెంటనే పూజారి పూజ మధ్యలో ఆగొద్దు అని అంటాడు. ఏదైనా మార్గం చెప్పమని అను అనడంతో పక్కనే కొలను ఉంది అని అక్కడికి వెళ్లి చూడమని అంటాడు పూజారి. అను కొలను దగ్గరికి వెళ్తున్న సమయంలో మాన్సీ అను కి అడ్డుపడి ఎలాగైనా పూజ ముహూర్తం దాటేలాగా చేయాలి అని అనుకుంటుంది. ఇక అను హడావుడిగా వస్తూ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది.
Also read it : Krishnamma kalipindi iddarini July 15th: పెళ్లి జరగకపోతే చచ్చిపోతానంటూ బెదిరించిన అఖిల.. కొడుకు కనిపించకపోయేసరికి కుప్పకూలిన సునంద?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial