అన్వేషించండి

chinni serial today may 1st: చిన్ని సీరియల్: కావేరి కేసు రీ ఓపెన్ చేయిస్తున్న మ్యాడీ! చెమటలు పట్టేసిన దేవా! సీసాలో ఆత్మ!

chinni serial today episode may 1st మ్యాడీ కావేరి నిర్దోషి ఏమో అని అనుకొని కేసు మళ్లీ రీ ఓపెన్ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode బూత వైద్యుడు చిన్నిలో దెయ్యాన్ని పొగొట్టడానికి హాల్‌లో పెద్ద ముగ్గు వేస్తాడు. ఆ ముగ్గులో చిన్నిని కూర్చొపెట్టమని చెప్తాడు. మ్యాడీ చిన్నిని తీసుకొచ్చి అక్కడ కూర్చొపెడతాడు. బూత వైద్యుడు మంత్రాలు చెప్తూ పొగరు బోతు దెయ్యం, వగలమారి దెయ్యం రావే అని పిలుస్తాడు. చిన్ని చాలా భయపడుతుంటుంది. ఇంతలో లోహిత మీదకు ఆత్మ వచ్చి వచ్చాను అని అరుస్తుంది. 

బూత వైద్యుడు మంత్రాలు చెప్పి లోహితను పట్టుకోవాలని చూస్తే ఆత్మ లోహితను పరుగులు పెట్టిస్తుంది. దాంతో బూత వైద్యుడు లోహితను మంత్ర దండంతో కొడతాడు. దాంతో లోహిత కింద పడిపోతుంది. లోహితకు దెయ్యం వదిలిన తర్వాత మంట మంట అని లోహిత అరుస్తుంది. తర్వాత దెయ్యం శ్రేయ మీదకు వస్తుంది. తర్వాత బూత వైద్యుడు శ్రేయని కొడతాడు. శ్రేయ లేచి మంట మంట అని అరుస్తుంది. తర్వాత ఆత్మ చిన్నిలోకి వస్తుంది. చిన్ని పెద్ద పెద్దగా నువ్వుతుంది. అందరూ చూసి భయపడతారు. రేయ్ నన్నేం చేయలేవురా.. నీలాంటి వాళ్లు వంద మంది వచ్చినా ఏం చేయలేరురా అని చిన్ని నవ్వుతుంది. బూత వైద్యుడు చిన్నిలో ఉన్న దెయ్యాన్ని సీసాలో పట్టి మూత పెడతాడు. అందరూ అది చూసి చాలా భయపడతాడు. మీ ఇంటికి పట్టిన దెయ్యం వదిలిపోయింది అని చెప్పడంతో అందరూ సంతోషపడతారు. 

చిన్నిని మీదకు తీసుకెళ్లమని చెప్పడంతో మ్యాడీ తీసుకెళ్తాడు. దెయ్యాన్ని మీ స్థానంలోనే పూడ్చాలి అని బూత వైద్యుడు అంటే ఆ పని మీరే చేయండి అని నాగవల్లి అంటుంది. ఇక చిన్ని మ్యాడీతో మ్యాడీ కళ్లు మూత పడుతున్నాయి.. ఒళ్లంతా భారంగా ఉంది.. నేను బతికే ఉన్నానా మ్యాడీ అని అడుగుతుంది. చిన్ని అలా అడగడంలో మ్యాడీ చాలా ఫీలై చిన్నిని గుండెలకు హత్తుకుంటాడు. నువ్వు ఇక్కడే నా దగ్గరే ఉన్నావ్ నీకు ఏం కాలేదు చిన్ని నీకు ఏం కాదు కూడా.. నీకు ఏం కానివ్వను అని మ్యాడీ అంటాడు. చిన్నికి పడుకోపెడతాడు. మ్యాడీ మా అమ్మ తప్పు చేయలేదు.. మా అమ్మ మీ అమ్మని చంపలేదు.. అమ్మ తప్పు చేయదు.. చేస్తే అది తప్పు కాదు.. మా అమ్మ నిర్దోషి.. ఏ తప్పు చేయకుండానే శిక్ష అనుభవించి అని నిద్రలో కలవరిస్తుంది. మ్యాడీ చిన్నితో తెలుసుకుంటా చిన్ని మీ అమ్మ నిజంగా నిర్దోషి అయితే అసలు దోషి ఎవరో తెలుసుకుంటా అని అంటాడు. 

నాగవల్లి దేవా దగ్గరకు వెళ్లి దెయ్యం పని అయిపోయింది అని చెప్పి చెట్టుకి వేలాడ దీసిన గాజు సీసాలోని ఆత్మని చూపిస్తుంది. దేవా చాలా సంతోషపడతాడు. ఇంటికి పట్టిన దెయ్యం వదిలిందన్నమాట అని దేవా చాలా హ్యాపీ అయిపోతాడు. వీలైనంత త్వరగా చిన్ని చాప్టర్ క్లోజ్ చేయాలని అంటాడు. ఉదయం చిన్ని స్నానం చేసి తల తుడుచుకుంటూ ఉంటే మ్యాడీ చూస్తూ ఉంటాడు. ఏంటి శ్రీవారు అలా చూస్తున్నారు అని అడిగితే నిన్నటి వరకు భయపడిన చిన్నిని చూశా ఇప్పుడు రిలాక్స్ అయిపోయావ్ అని అంటాడు. ఇంతలో ఎస్‌ఐ కాల్ చేస్తాడు. నీకు ఎస్‌ఐ కాల్ చేయడం ఏంటి అని చిన్ని అడిగితే మా మమ్మీ కేసు రీ ఓపెన్ చేయిస్తున్నా అని మ్యాడీ అంటాడు.

ఎస్‌ఐతో మాట్లాడి కేసు రీ ఓపెన్ చేయమని అంటాడు. చిన్ని మ్యాడీని హగ్ చేసుకొని థ్యాంక్స్ మ్యాడీ.. నిన్నటి వరకు నేను మాత్రమే మా అమ్మ నిర్దోషి అని నిరూపించాలని ప్రయత్నించాను ఇప్పుడు నువ్వు కూడా సాయం చేస్తున్నావ్ అంటుంది. నిజంగా మీ అమ్మ నిర్దోషి అయితే నేను సాయం చేయాలి కదా చిన్ని అని మ్యాడీ అంటాడు. పోలీస్ దేవాకి కాల్ చేసి విషయం చెప్తాడు. కేసు రీ ఓపెన్ చేస్తున్నామని చెప్పు.. ఎప్పుడెప్పుడు ఏం చేయాలో ఏం చెప్పాలో నేను చెప్తా అని దేవా అంటాడు. 

నాగవల్లి దేవా దగ్గరకు వచ్చి ఏంటి బావ కేసు రీ ఓపెన్ చేయిస్తున్నారా.. మనకే మంచిది కదా.. కావేరినే అక్కని చంపిందని మరోసారి రుజువు అవుతుంది అని అంటుంది. దేవా మనసులో అప్పుడు బయట పడేది నేను అని అనుకుంటాడు. ఇంతలో చిన్ని మ్యాడీ దేవా దగ్గరకు వస్తారు. మమ్మీ కేసు రీ ఓపెన్ చేయిస్తున్నా డాడీ అని మ్యాడీ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget