అన్వేషించండి

Ammayi garu Serial Today September 25th: అమ్మాయిగారు సీరియల్: కోమలి, అశోక్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని ఈడ్చుకొచ్చిన రాజు, రూపలు!

Ammayi garu Serial Today Episode September 25th రూప, రాజులు కోమలి, అశోక్‌లను పట్టుకొని సూర్యప్రతాప్‌ దగ్గరకు తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ విరూపాక్షిని తనలో పాటు కారులో అసెంబ్లీకి తీసుకెళ్తాడు. రాజు, రూప, చంద్ర, సుమలు చాలా సంతోషపడతారు. విజయాంబిక కుళ్లుకుంటుంది. ఫొటో పగిలితే ఏం అనలేదు.. ఇప్పుడు కారులో తీసుకెళ్తున్నాడు నా తమ్ముడితో మార్పు వస్తుందా అని విజయాంబిక అనుకుంటుంది. 

కారులో విరూపాక్షి వెనక సీట్‌లో కూర్చొని ముందు ఉన్న సూర్యప్రతాప్‌ని అద్దంలో చూసి నవ్వుతూ ఉంటుంది. సూర్యప్రతాప్‌ చూస్తాడు. గతం గుర్తు చేసుకుంటాడు. విరూపాక్షి కన్ను ఆర్పకుండా చూస్తుంటుంది. మరోవైపు అశోక్‌ సూర్యప్రతాప్‌ ఇంటికి పోస్ట్‌ మెన్‌లా గెటప్ వేసుకొని మాస్క్ పెట్టుకొని రూపకి పోస్ట్ వచ్చిందని చెప్పి వాచ్‌మెన్‌కి ఇస్తాడు. వాచెమెన్ అది తీసుకెళ్లి చంద్రకి ఇచ్చి రూప మేడంకి పోస్ట్ వచ్చిందని చెప్తాడు. నేను ఇస్తానని చంద్ర తీసుకుంటాడు. రాజు, రూపలు మేడ మీద నుంచి చూసి నాకు లెటర్ రాసే వారు ఎవరు ఉంటారు రాజు అని రూప అంటుంది. ఆ లెటర్ మీకు కాదు అమ్మాయిగారు కోమలికి అని రాజు అంటాడు. 

చంద్ర కోమలి దగ్గరకు వెళ్లి రూప నీకు లెటర్ వచ్చిందని చెప్పి ఇస్తాడు. రాజు, రూపలు చాటుగా చూస్తారు. ఆ లెటర్‌తో అశోక్ కోమలి గురించి రాసుంటాడు. ప్రియమైన కోమలికి ప్రేమగా నీ ప్రియుడు రాయు లేటర్.. నేను నిన్ను కలవకుండా.. నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను.. అందుకే ఇంటికి వచ్చి లోపలికి రాకుండా ఈ లెటర్ ఇచ్చి పోతున్నాను.. మనం ఎప్పుడూ కలుసుకునే చోటుకి రా నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.. త్వరగా రా నీతో చాలా మాట్లాడాలి అని రాసుంటాడు. అది చదివి కోమలి షాక్ అయిపోతుంది. ఇంటికి వచ్చి లెటర్ ఇచ్చి వెళ్తాడా.. ఎందుకు అశోక్ నన్ను అర్థం చేసుకోవడం.. ఎప్పుడు పడితే అప్పుడు కలవడం నాకు కుదరదు అని ఈ సారి అశోక్‌కి గట్టిగా చెప్పాలి అని లెటర్ అక్కడే పడేసి వెళ్తుంది. 

రాజు, రూపలు కోమలి వెళ్లిపోయిన తర్వాత గదిలోకి వెళ్లి ఆ లెటర్ తీసి చూస్తారు. మొత్తం చదివి కోమలిని ఫాలో అవుతారు. అశోక్ ఓ గుడి దగ్గర ఉంటే కోమలి వెళ్తుంది.  మనం ఇలా కలుసుకోవడం వల్ల చాలా ప్రమాదం అని రాజు మామూలోడు కాదు.. ఈ సారి రాజు చేతికి దొరికితే నిన్ను ఏదో ఒకటి చేయకుమానడు అని అంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అశోక్ తనని జీవన్‌ కలవమని అన్నాడని నువ్వు వెళ్లిన పనికి ఇంకెంత కాలం పడుతుందని సీరియస్ అయ్యాడు. త్వరగా పని పూర్తి చేయమని చెప్పాడని అంటాడు. నువ్వు రూప కాదు అని రాజు వాళ్లకి తెలుసు కాబట్టి నిన్ను ఇరికిస్తారని అంటాడు. త్వరలోనే మన పని పూర్తి చేస్తానని కోమలి అంటుంది. 

కోమలి, ఆశోక్ మాట్లాడుతుంటే రాజు, రూపలు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. ఇద్దరూ రూప, రాజులని చూసి షాక్ అయిపోతారు. ఎవరి కోసం వచ్చావ్‌రా అని అశోక్‌ని రాజు చితక్కొడతాడు. రాజు అశోక్ జోలికి వెళ్లొద్దని కోమలి అరిస్తే వాడిని కొడితే నీకు నొప్పి పుడుతుందేంటే అని రూప కోమలిని కొడుతుంది. రూప కోమలిని కొడితే బాగోదు చెప్తున్నా అని అశోక్ అంటాడు. అమ్మాయి గారు మళ్లీ కొట్టండి అని రాజు అంటాడు. ఈరోజుతో ఈ కోమలి డబుల్ యాక్షన్‌కి వీడి దొంగ యాక్షన్‌కి స్వస్తి పలుకుదాం అని రాజు అంటాడు.

సూర్యప్రతాప్‌, విరూపాక్షి ఇంటికి వస్తారు. రాజు కాల్ చేసి సూర్యప్రతాప్తో ఎక్కడున్నారని అంటాడు. ఇంటికి వచ్చాన్ అని సూర్యప్రతాప్‌ అంటే మీకు ఒక విషయం చెప్పాలని అంటాడు. రూప, రాజులు కోమలి, అశోక్‌లను ఈడ్చుకొని వస్తుంటారు. సూర్యప్రతాప్‌, విరూపాక్షి ఇంటి లోపలికి వెళ్తూ గుమ్మం దగ్గర ఒకరికి ఒకరు ఢీ కొని ఆగుతారు. ఇంతలో గుమ్మానికి ఉన్న దండ ఇద్దరి మెడలో స్వాగతం పలికినట్లు పడుతుంది. ఇద్దరూ ఒకరు చూసుకుంటారు. సూర్యప్రతాప్‌ దండ తీస్తుంటే బంటి ఆపి ఇద్దరికీ ఫొటోలు తీస్తాడు. విజయాంబిక, దీపక్ షాక్ అయిపోతారు. ఏదో ఒకటి చేయాలని విజయాంబిక అనుకుంటుంది. సూర్యప్రతాప్‌ దండ తీసుకొని పక్కన పెట్టి లోపలికి వస్తాడు. సూర్యప్రతాప్‌లో ఈ మార్పునకు విరూపాక్షి చాలా షాక్ అయిపోతుంది. సూర్యలో మార్పు మొదలైనట్లు అనిపిస్తుందని అనుకుంటుంది. సూర్యప్రతాప్‌ రూప గురించి అడుగుతాడు. ఇంతలో రాజు అశోక్‌ని కోమలిని రూప తీసుకొని వస్తారు. విజయాంబిక, దీపక్ చూసి షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 16th: నిండు మనసులు: గుడిలో ఇందిర కుట్ర! ఢీ అంటే ఢీ అనుకున్న రెండు ఫ్యామిలీలు!
నిండు మనసులు: గుడిలో ఇందిర కుట్ర! ఢీ అంటే ఢీ అనుకున్న రెండు ఫ్యామిలీలు!
Karthika Deepam 2 Serial Today July 16th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌తో బేరాలాడిన మాలిని! సూరజ్‌ మాటలకు ఫిదా అయిపోయిన పెద్దాయన!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌తో బేరాలాడిన మాలిని! సూరజ్‌ మాటలకు ఫిదా అయిపోయిన పెద్దాయన!
Nuvvu leka Neanu Lenu Serial Today July 16th:గుడిలో రాధను చంపేందుకు దమయంతి ప్రయత్నాలు... విక్కీతో కలిసి అమ్మవారికి ముడుపు చెల్లించిన రాధ
నువ్వులేక నేను లేను: గుడిలో రాధను చంపేందుకు దమయంతి ప్రయత్నాలు... విక్కీతో కలిసి అమ్మవారికి ముడుపు చెల్లించిన రాధ
Podarillu Serial Today July 16th:మహా ఫోన్‌ చేసి విడాకులు తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చిన కానిస్టేబుల్‌...అతనికి ఎవరో చెప్పారో తెలుసుకునేందుకు మహా ప్రయత్నాలు
పొదరిల్లు: మహా ఫోన్‌ చేసి విడాకులు తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చిన కానిస్టేబుల్‌...అతనికి ఎవరో చెప్పారో తెలుసుకునేందుకు మహా ప్రయత్నాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Embed widget