(Source: ECI/ABP News/ABP Majha)
Ammayi garu Serial Today November 13th: అమ్మాయి గారు సీరియల్: గుడిలో అనాథ పిల్లలతో ముత్యాలకు సర్‌ఫ్రైజ్ ఇచ్చిన రూప.. ఆనందంలో రాజు!
Ammayi garu Today Episode ముత్యాలు పుట్టిన రోజును రూప రాజు ఎదురుగా గుడిలో పిల్లలతో చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode మందారం రూపని పిలిచి రాజు తల్లిదండ్రులు గుడికి వస్తున్నారని చెప్తుంది. ముత్యాలు గుడికి రావడానికి ఇష్ట పడదు. దాంతో విరూపాక్షి ముత్యాలుతో పాటు అందర్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. రాజుకి మంచి జరగాలి అనే మీకు దూరం చేశాను మీరు ఇలా బాధ పడుతుంటే తప్పు చేసినట్లు నాకు భావన కలుగుతుందని విరూపాక్షి చెప్తుంది. దాంతో ముత్యాలుతో పాటు అప్పలనాయుడు కూడా గుడికి వెళ్లడానికి ఒప్పుకుంటారు.
రూప: రేపు నాగుల చవితి అంట అందరం గుడికి వెళ్దాం రాజు.
రాజు: నాకు ఇష్టం లేదు అమ్మాయి గారు మీరు వెళ్లండి.
రూప: నేను గుడికి వెళ్దాం అనేది నీ కోసం రాజు. అత్తయ్య పుట్టిన రోజు కదా వెళ్లి అత్తయ్య పేరు మీద అర్చన చేయించి నలుగురికి అన్నదానం చేద్దాం.
రాజు: అమ్మ కోసం అయితే సరే అమ్మాయి గారు.
రూప: మనసులో నీ కోసం నీ కళ్లెదురుగానే అత్తయ్య పుట్టిన రోజు జరిపిస్తా రాజు నా కోసం ఇంత చేసిన నీ కోసం కనీసం ఈ మాత్రం చేయలేనా.
రాజు: అమ్మాయి గారు మనతో పాటే పింకీ జీవన్‌ల ఫస్ట్ నైట్ పెట్టారు అది జరిగితే పింకీ జీవితం నాశనం అయిపోతుంది ఎలా అయినా దాన్ని ఆపాలి.
రూప: రాజు నాకు ప్రాబ్లమ్ వచ్చినా నా ఇంటికి ప్రాబ్లమ్ వచ్చినా నువ్వు చూసుకుంటావ్ పింకీ ప్రాబ్లమ్ గురించి నాకు బాధే లేదు. అవన్నీ ఎందుకు రాజు రేపు గుడికి వెళ్దాం.
ఉదయం ముత్యాలు వాళ్లు గుడికి వస్తారు. ముత్యాలు రాజు గురించే ఆలోచించుకుంటూ ఉంటుంది. దిగులుగా ఉంటుంది. మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఒక సారి రాజుని చూడాలని ఉందని ముత్యాలు అంటుంది. దానికి విరూపాక్షి వాళ్లు బాగుండాలి అనే కదా మనం ఇంతలా దూరంగా ఉంటున్నాం అంతగా చూడాలి అనిపిస్తే అమ్మవారే చూపిస్తుంది. ఇక రూప, రాజుతో పాటు ఇంటిళ్లపాది అదే గుడికి వస్తారు. రెండు కుటుంబాలు ఎదురు పడతారు. రాజు చాలా సంతోష పడతాడు. విరూపాక్షిని చూసి సూర్య ముఖం తిప్పుకుంటాడు. ముత్యాలు వాళ్లు చాలా సంతోష పడినప్పటికీ పైకి మాత్రం వాళ్లని చూడటం ఇష్టలేనట్లు ముఖం తిప్పుకుంటుంది.
రాజు తల్లికి విష్ చేయాలని దగ్గరకు వెళ్లి చేయి పట్టుకుంటే ముత్యాలు చేయి వదిలించుకొని మాకు ఎదురు పడొద్దని చెప్పినా సిగ్గు లేదా అని అంటుంది. దానికి సూర్య కన్న కొడుకు కనిపిస్తే ఎలా ఉన్నాడని అడగకూడదు అనే అంత తప్పు చేశాడా అని అడుగుతాడు. రాజు తప్పు చేయడని తెలిసిన మీరు రాజు తప్పు చేశాడని ఎలా అనుకుంటున్నారని అడుగుతాడు. ఇదంతా విరూపాక్షి వల్లే అని చెడు స్నేహాల వల్లే మీరు ఇలా మారారు అని మిమల్ని కూడా విరూపాక్షి నాశనం చేస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. విజయాంబిక ఇదంతా ప్లాన్ లా ఉందని కావాలనే మనం వచ్చిన గుడికి వచ్చారని అంటుంది. దానికి ముత్యాలు అప్పలనాయుడు ఇద్దరూ నాటకాలు తెలిసిన విజాయాంబిక గారు ఇలాగే మాట్లాడుతారు అని అంటుంది. ఇక వెళ్లిపోదాం అని ముత్యాలు అంటుంది. అందరూ ఆపి ముత్యాలుని గుడి దగ్గరకు తీసుకెళ్తారు.
అందరూ అమ్మవారిని దర్శించుకుంటారు. రూప కొందరు పిల్లలకు సైగ చేస్తుంది దాంతో ఆ పిల్లలు ముత్యాలు దగ్గరకు వెళ్తారు. పిల్లలు ముత్యాలు దగ్గరకు వెళ్లి హ్యాపీ భర్త్‌డే టూయూ అని అంటారు. అది చూసి రాజు చాలా సంతోష పడతాడు. ముత్యాలు చాలా సంతోషపడుతుంది.. నా పుట్టిన రోజు అని మీకు ఎలా తెలిసింది అడుగుతుంది. ఇక ఓ మహిళ ఆ పిల్లలు అంతా అనాధలని చెప్పి వాళ్లు మీ కోసం కేక్ తెచ్చారు కట్ చేయిండి అంటుంది. హ్యాపీ భర్త్ డే అమ్మ అని రాసుంటుంది. ముత్యాలు కేక్ కట్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్ కోసం హాస్పిటల్‌కి పరుగులు తీసిన సత్య.. కిడ్నాపర్ల డిమాండ్‌కి షాక్‌లో హర్ష!