Ammayi Garu: దీప్తి అసలు రంగు బయటపడింది! విరూపాక్షిని కిడ్నాప్ చేసిన విజయాంబిక.. పెళ్లి ఆగుతుందా?
Ammayi garu Today Episode కీర్తి జీవన్ మనిషి అని తెలుసుకున్న విరూపాక్షి సూర్యప్రతాప్‌తో చెప్పడానికి వెళ్లడం విజయాంబిక వాళ్లు విరూపాక్షిని కొట్టి కిడ్నాప్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు- కీర్తి, రుక్మిణి - చైతన్యల పెళ్లి వేడుకలు మొదలవుతాయి. బంటీ సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్లి మందులు వేసుకోవాలని ఇస్తాడు. సూర్యప్రతాప్ మనసులో అందరికి ఏం కావాల్సింది ఇచ్చాను బంటీ ఒక్క నీకు మాత్రం నువ్వు అడిగిన రుక్మిణిని అమ్మగా ఇవ్వలేకపోతున్నాను అని సూర్యప్రతాప్ మనసులో బాధ పడతాడు.
కీర్తిని విజయాంబిక రెడీ చేస్తుంది. రూపని విరూపాక్షి, మందారం రెడీ చేస్తారు. రాజు దగ్గరకు విరూపాక్షి వెళ్తుంది. మరోవైపు జీవన్ పోలీస్ స్టేషన్ నుంచి ఓ కానిస్టేబుల్ సహకారంతో కీర్తికి కాల్ చేస్తాడు. దీప్తితో జీవన్ మాట్లాడుతాడు. విరూపాక్షి ఆ మాటలు వింటుంది. జీవన్‌తో కీర్తి మాట్లాడుతుంది ఏంటి అనుకుంటుంది. కీర్తి కాదు తను దీప్తి అని విరూపాక్షికి తెలుస్తుంది. ఈ దీప్తి జీవన్ మనిషా అని షాక్ అయిపోతుంది. విరూపాక్షి మనసులో ఈ ఒక్క విషయం చాలు ఈ పెళ్లి ఆపడానికి అని అనుకొని సూర్యప్రతాప్‌కి విషయం చెప్పాలి అంటే సాక్ష్యం ఉండాలి అనుకొని తన ఫోన్‌లో కీర్తి జీవన్‌తో మాట్లాడటం రికార్డు చేస్తుంది.
విజయాంబిక దీపక్‌తో వాతావరణం చూస్తే కాస్త తేడాగా ఉందిరా అని అంటుంది. దీపక్ తన మనుషుల్ని రెడీలా ఉంచానని అంటాడు. ఇక కీర్తి జీవన్‌తో మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఏం కంగారు పడకు జీవన్ మన ప్లాన్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది రాజుతో నా పెళ్లి అయిపోతుంది. పెళ్లి అవగానే కాల్ చేస్తా అని కీర్తి జీవన్‌తో మాట్లాడుతుంది. కీర్తి అలియాస్ దీప్తి విరూపాక్షిని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి ఆంటీ ఇలా వచ్చారు అని కీర్తి అంటే నీ బండారం బయట పెట్టాలని వచ్చాను కీర్తి అలియాస్ దీప్తి అని అంటుంది. నేను కీర్తిని దీప్తి ఎవరు ఆంటీ అని అడుగుతుంది. దాంతో విరూపాక్షి దీప్తిని వాయించి దీప్తి ఎవరు జీవన్ ఎవరో తేల్చుతా రా సూర్య దగ్గరకు అని లాక్కెళ్తుంది.
విరూపాక్షి దీప్తిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం చూసిన రౌడీలు విరూపాక్షిని అడ్డుకుంటారు. విజాయాంబిక విరూపాక్షి తల మీద కొట్టి రౌడీలకు అప్పగిస్తుంది. దీపక్ వాళ్లతో కలిసి బెడ్ షీట్లో విరూపాక్షిని చుట్టి తీసుకెళ్తాడు. ఇక రాజు రూప దగ్గరకు వచ్చి అమ్మాయి గారు మీరేం టెన్షన్ పడొద్దు ఏదో ఒకటి చేసి నేను పెళ్లి ఆపేస్తా మీరేం టెన్షన్ పడొద్దు అంటాడు. రాజు విరూపాక్షి గురించి అడుగుతాడు. నీ దగ్గరకే వచ్చిందని మందారం అంటుంది. రాజు, రూప, మందారం విరూపాక్షి కోసం టెన్షన్ పడతారు. రౌడీలు విరూపాక్షిని ఫాంహౌస్‌కి తీసుకెళ్తారు. మందారం అందరికీ అడుగుతుంది. ఎవరూ చూడలేదు అంటారు.
పంతులు పెళ్లి పిల్లల్ని తీసుకురమ్మని చెప్తారు. ఇక విరూపాక్షికి మెలకువ వచ్చి తనని వదిలేయమని ఎంత డబ్బు కావాలి అన్నా ఇస్తానని చెప్తుంది. అయినా రౌడీలు పట్టించుకోరు. సుమ రుక్మిణిని పెళ్లి పందిరి దగ్గరకు తీసుకెళ్తుంది. మా అమ్మ కనిపించడంలేదని రుక్మిణి చెప్తుంది. రెండు జంటలు సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్తారు. రెండు జంటలు చూడ ముచ్చటగా ఉన్నాయని పెళ్లి పీటల మీద కూర్చొమని చెప్తారు. మా అమ్మ కనిపించడం లేదని రుక్మిణి సూర్యప్రతాప్‌తో చెప్తుంది. విజయాంబిక బలవంతంగా రుక్మిణి వాళ్లని పెళ్లి పీటల మీద కూర్చొపెడుతుంది. అందరూ ఇంత వరకు ఉన్న విరూపాక్షి కనిపించడం లేదు ఏంటా అని ఆలోచిస్తుంటారు. విరూపాక్షి ఏడుస్తుంది. రౌడీలను బతిమాలుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి గ్రూప్ కంపెనీకి ఎదురుదెబ్బ! ఘోర అవమానం.. లక్ష్మీ రాజీనామా!





















