Ammayi garu Serial Today December 15th: రాజు,రూప అశోక్‌కు ఎందుకు బెయిల్ ఇప్పిస్తారు..? కోమలి గురించి నిజం అశోక్‌కు తెలిసిపోయిందా..!
Ammayi garu Serial Today Episode December 15th: చిట్‌ఫండ్ సంస్థ మేనేజర్‌ను దీపక్ చంపాడని తెలుసుకున్న రాజు,రూప...అశోక్‌ను బెయిల్‌పై బయటకు తీసుకొస్తారు. ఆ తర్వాత కోమలి గురించి అశోక్‌కు ఏం తెలిసింది..?

Ammayi garu Serial Today Episode: ఆస్పత్రిలో కోమలి అత్తయ్యను ఓదార్చిన రాజు,రూప...అసలు ఆయనకు ఏం జరిగిందని అడుగుతారు. కోమలి బెదిరింపులు గుర్తుకు వచ్చిన ఆమె నిజం దాచిపెడుతుంది. ఇంతలో రూప...మీరు పిండప్రధానం చేస్తున్న అమ్మాయి మీ కోడలు కోమలి కదా అని అడుగుతుంది. ఆ అమ్మాయి చనిపోయిందనుకుని మీరు అలాచేస్తున్నారు కదా అని అంటుంది.ఈవిషయం మీకు ఎలా తెలుసని అనగా...ఆ కోమలి ఇప్పుడు మా ఇంట్లోనే తిష్టవేసి ఉందని రాజు చెబుతాడు. ఇదంతా అక్కడే ఉండి కోమలి,విజయాంబిక, దీపక్ వింటారు. సీఎం సూర్యప్రతాప్ గారి అసలు కూతురిని నేనేనని రూప చెబుతుంది. అసలు ఏం జరిగిందో చెప్పాలని వారు అడుగుతుండగానే....డాక్టర్ వచ్చి మీతో మాట్లాడాలని చెప్పి రాజు,రూపను తీసుకెళ్లిపోతాడు.అప్పుడు వాళ్ల అత్త దగ్గరకు వచ్చిన కోమలి విజయాంబిక ఆమెను బెదిరిస్తారు.నీ కొడుకుని జైలుకు పంపించింది కూడా మేమేనని...వాడిని జైలులోనే చంపించగలమని, నీ మొగుడిని కూడా ఆస్పత్రిలో చంపించగలిగే సత్తా మాకుందని విజయాంబిక బెదిరిస్తుంది. నీ అడ్డు కూడా తొలగించగలమని హెచ్చరిస్తుంది. కోమలి గురించి ఒక్క నిజం బయటకు వచ్చినా...మీ ముగ్గురిలో ఒక్కరు కూడా మిగిలి ఉండరని బెదిరిస్తుంది. నువ్వు నోరు తెరవకుండా ఉన్నంత కాలమే నీబిడ్డ బతికి ఉంటాడని చెప్పి వెళ్లిపోతారు.
డాక్టర్‌తో మాట్లాడి మళ్లీ బయటకు వచ్చిన రాజు,రూప మళ్లీ ఏం జరిగిందో అడుగుతారు. విజయాంబిక బెదిరింపులు గుర్తుకు వచ్చి ఆమె భయపడిపోయి నోరు విప్పదు. మీ కోడలు కోమలియే ఇదంతా చేసిందా అని రూప అడుగుతుంది. దీంతో ఆమె ఏడుస్తూ నన్నేమీ అడగొద్దని వేడుకుంటుంది. ఆమె నోరు విప్పదని నిర్థారించుకుని కోమలి, విజయాంబిక అక్కడి నుంచి వెళ్లిపోతారు. రూప,రాజు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు.
కోమలి గురించి తెలిసిన అనాథశరణాలయంలో ఉన్న వాళ్లందరినీ చంపి ఆధారాలు లేకుండా చెరిపివేశామని...మిగిలింది కోమలి అత్తమామలేనని, మామ పరిస్థితి విషమంగా ఉందని, భయంతో అత్త నోరు విప్పదని ఇక మనకు అడ్డులేదంటూ దీపక్ వాళ్ల అమ్మతో చెబుతాడు. కోమలి గురించి నిజం చెప్పగలిగే వాళ్లందిరనీ దాదాపు క్లోజ్ చేశామని...చిట్‌ఫండ్ కంపెనీ మేనేజర్‌ను నేను చంపి అశోక్‌ను ఇరికించానని నవ్వుతాడు. ఆ అశోక్‌గాడు బయటకు వచ్చే అవకాశమే లేదని అంటాడు. ఇదంతా చాటుగా ఉండి రూప, రాజు విని విరూపాక్షికి చెబుతారు. ఎలాగైనా అశోక్‌ను బయటకు తీసుకురావాలని అంటారు. కోమలి గురించి నిజం చెప్పగలిగేది అశోక్ ఒక్కడేనని...మనం వాడిని బయటకు తీసుకొచ్చి నిజం చెప్పించాలని రాజు చెబుతాడు.
కోమలి విజయాంబిక వద్దకు వచ్చి కోప్పడుతుంది.మీరు మా అత్తయ్యను అలా బెదిరించి ఉండాల్సిందికాదని అంటుంది. నాకు వదిలేసి ఉంటే కాళ్లుపట్టుకుని బ్రతిమిలాడి ఉండేదాన్ని అని అంటుంది. అక్కడి మీ అత్తయ్య ఒక్కరే లేరని...రాజు,రూప కూడా ఉన్నారని విజయాంబిక అంటుంది. నేను బెదిరించకపోయి ఉంటే ఈపాటికి మీఅత్తయ్య నీ విషయం మొత్తం వాళ్లకు చెప్పేసి ఉండేదంంటుంది. నీకు అశోక్ ముఖ్యం గానీ...వాళ్ల అమ్మానాన్న కాదు కదా అంటారు.అయితే అశోక్‌ను నేనే ముందు ఈ విషయం చెబుతానని..ఎలాంటి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో చెబుతానంటుంది. అలాగే చెప్పు అంటారు. అశోక్‌ను విడిపించిన తర్వాత అన్ని విషయాలు చెప్పొచ్చని కోమలిని బుజ్జగిస్తారు.
ఇంతలో రాజు,రూప కలిసి అశోక్‌కు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొస్తారు. నాకు ఎందుకు బెయిల్ ఇప్పించారని అతను అడగ్గా...ఇప్పుడు మీ నాన్న ఆస్పత్రిలో ఉన్నారని వెంటనే అక్కడికి వెళ్దామని ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చని చెప్పి అతన్ని అక్కడికి తీసుకెళ్తారు. అలాగే చిట్‌ఫండ్ మేనేజర్‌ను చంపింది కూడా నువ్వుకాదని, ఆ దీపక్ చాటు నుంచి కాల్చాడని చెబుతారు. సీసీ కెమెరా విజువల్స్‌లో నువ్వు ఉండేలా ప్లాన్ చేశారని చెబుతారు. అందుకే నీకు బెయిల్ ఇప్పించామని చెబుతారు. ఆస్పత్రికి వచ్చిన కొడుక్కి వాళ్ల అమ్మ నిజం చెబుతుంది. కోమలి వల్లే నాన్న కోమాలోకి వెళ్లారని చెబుతుంది.





















