Ammayi garu Serial Today April 23rd: అమ్మాయి గారు సీరియల్: రూప కోసం విరూపాక్షితో కలిసి పూజ చేయడానికి ఓకే చెప్పిన సూర్యప్రతాప్!
Ammayi garu Today Episode తల్లిదండ్రుల్ని కలపడానికి రూప రాజుతో కలిసి పంతులుని మ్యానేజ్ చేసి ఇద్దరూ కలిసి పూజ చేసేలా ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు, రూపలు దీపక్, విజయాంబికలను ఫాలో అవుతారు. దీపక్ రాజు వాళ్ల కారు బ్రేక్‌లు తీసేసి వాళ్లకి యాక్సిడెంట్ అయ్యేలా చేశానని తల్లితో చెప్తాడు. రాజుకి రాఘవ గుర్తొచ్చి రాజు లేస్తాడు. కారు నుంచి పొగలు రావడం రూప పక్కనే కళ్లు తిరిగి పడిపోవడంతో షాక్ అవుతాడు. రూపని లేపుతాడు. రూపతో హాస్పిటల్‌కి వెళ్దామని అంటాడు.
రూప వద్దని దీపక్ వాళ్లు రాఘవని చంపేస్తారని భయంగా ఉందని అంటుంది. రాజు రూపని బయటకు తీసుకొస్తాడు. అత్తయ్య వాళ్లు ఎటు వెళ్లారో ఎలా తెలుస్తుందని రాజుని రూప అడుగుతుంది. దాంతో రాజు కారు వెళ్లిన చోట పిండి పడి ఉండటం చూపిస్తాడు. కారు డిక్కీలో సున్నం బస్తా పెట్టానని చెప్తాడు. ఆ సున్నమే దారి చూపిస్తుంది అలా వెళ్తే సరిపోతుందని అంటాడు.
దీపక్ వాళ్లు రాఘవని దాచిన చోటుకి వెళ్తారు. జీవన్ మనుషులు రాఘవని దాచేస్తారు. దీపక్ వాళ్లని నాలుగు తగిలించి రాఘవ కోసం అడుగుతాడు. ఇక రాజు, రూపలు చాటుగా చూస్తుంటారు. ఇక రౌడీలు దీపక్ వాళ్లతో జీవన్ అన్నకి మీరు మోసం చేయడంతో రాఘవని తీసుకెళ్లిపోయారు అని చెప్తారు. ఇక ఎలా అయినా రాఘవని కనిపెట్టాలని విజయాంబిక వాళ్లు వెళ్లిపోతారు. రూప రాజుతో రాఘవ ఇక్కడ లేడంట ఇంకెక్కడ ఉంటాడు రాజు అని అంటుంది. వీళ్లకి రాఘవ దొరకలేదు కాబట్టి జీవన్ బయటకు వచ్చే వరకు ఏం ప్రాబ్లమ్ లేదని అంటాడు.
విజయాంబిక వాళ్లు ఇంటికి వచ్చేస్తారు. తల్లీ కొడుకులు రాఘవ గురించి మాట్లాడుతారు. ఇక రూప వాళ్లు ఇంటికి వస్తారు. రూప, రాజులకు గాయాలు చూసి సూర్యప్రతాప్ కంగారు పడతారు. ఏమైందని అడిగితే చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్తారు. కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని రాజు చెప్తాడు. అందరూ కంగారు పడతారు. మందారం మాత్రం భర్తఅత్తల్ని కోపంగా చూస్తుంది. ఇక సూర్యప్రతాప్ రూప, రాజులకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. సుమ సూర్యప్రతాప్‌తో మన ఇంటికి నర దిష్టి తగిలినట్లుంది పంతుల్ని పిలిపిద్దామని అంటుంది. శాంతి పూజతో పాటు సీతారాముల కల్యాణం కూడా జరిపిద్దామని అనుకుంటారు.
పంతులు ఇంటికి వస్తాడు. ఇక సూర్యప్రతాప్ పంతులతో రాజు, రూపలకు యాక్సిడెంట్ జరిగిందని అంటారు. పంతులు రూప జాతకం చూస్తారు. రూపకి దోషం ఉందని అమ్మాయికి అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయని అమ్మాయి అమ్మానాన్నలు ఇద్దరూ కలిసి దోష నివారణ చేయాలని అంటారు. విజయాంబిక పంతులుతో మా తమ్ముడి భార్య లేదు అంటాడు. దానికి మందారం అమ్మగారు లేరు అనకూడదు ఇక్కడ లేరు అని చెప్పాలి అంటారు. అందరూ సూర్యప్రతాప్ విరూపాక్షితో కలిసి పూజ చేయడు అనుకొని మరో మార్గం ఉంటే చెప్పండి అంటే సూర్యప్రతాప్ వద్దని రేపే పూజకి ఏర్పాట్లు చేయమని చెప్తాడు. అందరూ చాలా సంతోషపడతారు. రూపతో పూజకి మీ అమ్మ కూడా వస్తుందని సూర్యప్రతాప్ చెప్తారు. నా బిడ్డ ప్రాణం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు అని అంటారు. పూజకి ఏర్పాట్లు చేయమని అంటారు. ఇక రాజు పంతులుకి సైగ చేస్తారు. అది చూసిన తల్లీకొడుకులు ఇదంతా రాజు, రూపల పని అనుకుంటారు. చంద్రతో సూర్యప్రతాప్ విరూపాక్షికి విషయం చెప్పమని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఇక నుంచి నువ్వు దేవా భార్యవి.. ఈ ఇంటి చిన్న కోడలివి.. ఓర్నీ ఇదంతా కలా!





















