Ammayi garu Serial Today April 22nd: అమ్మాయి గారు సీరియల్: రూప, రాజులకు యాక్సిడెంట్.. రాఘవని తల్లీకొడుకులు చంపేస్తారా!
Ammayi garu Today Episode దీపక్ రాజు, రూపల కారుకి బ్రేక్‌లు తీసేసి ఇద్దరికీ యాక్సిడెంట్ చేయడం వల్ల ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి తప్పు చేసినా కూడా రూప అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని విజయాంబిక సూర్యప్రతాప్‌తో చెప్తుంది. నీ బాధలో నువ్వుంటే నిన్ను రూప ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదని అంటుంది. అవకాశం దొరికితే చాలు నన్ను పాతి పెట్టాలని చూసిన మీరు నా గురించి ఆలోచిస్తున్నా అంటే అసహ్యంగా ఉందని సూర్యప్రతాప్ ఫైర్ అవుతారు.
సూర్యప్రతాప్: కళ్లతో చూసేది నిజం కాకపోవచ్చు. పరాయి వాళ్లు చెప్పేది నిజం కాకపోవచ్చు. రెండింటికీ మంచి ఇంకోదో నిజం ఉండొచ్చు అని విరూపాక్షి విషయంలో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అవసరం అయితే విరూపాక్షిని కూర్చొపెట్టి ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటా. ఇంకా అవసరం అయితే విరూపాక్షిని క్షమించి ఈ ఇంటికి తీసుకొస్తా అది నా ఇష్టం. ఇంకోసారి మీరు నా విషయంలో అయినా రూప విషయంలో అయినా కలుగజేసుకుంటే ఏం చేస్తానో నాకే తెలీదు. బయటకు పోండి.
రూప: నాన్న మాటలు విన్నాక అమ్మని అర్థం చేసుకొని నిజం తెలుసుకొని అమ్మని అంగీకరిస్తారని అర్థమవుతుంది రాజు.
రాజు: మీరు మీ మాటలతో పెద్దయ్యగారిని ఆలోచించేలా చేశారు అమ్మాయిగారు. అందరూ సంతోషం వ్యక్తం చేస్తారు.
విజయాంబిక దీపక్‌తో విరూపాక్షిని సూర్య నమ్మాలి అంటే రాఘవ వచ్చి నిజం చెప్పాలి రాఘవ రాకపోతే మీ మామయ్య నిజం చెప్పినా నమ్మడు కాబట్టి మనం రాఘవని చంపేయాలి అంటుంది. తల్లీకొడుకుల మాటలు మందారం చాటుగా వింటుంది. రాజు, రూపలు రాఘవని వెతికి పట్టుకోవాలి అనుకుంటారు. రేపే రాఘవని చంపేయాలి అనుకుంటారు. ఈ పాపిష్టివాళ్లు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారా అని మందారం అత్తభర్తలను తిట్టుకొని రాజు, రూపల దగ్గరకు వెళ్లి ఇద్దరూ రాఘవని చంపాలి అనుకుంటున్నారని చెప్తుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు. వీళ్లని చంపేయాలి అని రూప ఆవేశంగా వెళ్లబోతే రాజు ఆపుతాడు.
రాఘవని రేపే చంపాలి అనుకున్నారు అంటే వాళ్లని రాఘవ ఎక్కడున్నాడో తెలుసు ముందు మనం వాళ్లని ఫాలో అయి రాఘవని కాపాడుకుందామని అంటాడు. ఉదయం దీపక్, విజయాంబికలు బయటకు వెళ్తారు. రూప, రాజులు వాళ్లకి ఫాలో అవుతారు. రాఘవని చంపేసి జీవన్ మీదకు నెట్టేయాలి అనుకుంటారు. రాఘవ చావాలి సాక్ష్యం లేకుండా పోవాలి అనుకుంటారు. రూప, రాజులు వాళ్లుని స్పీడ్‌గా ఫాలో అవుతారు. రాఘవ ఈ రోజు మిస్ అయితే జీవితంలో అమ్మానాన్నల్ని కాపాడలేమని రూప రాజుతో చెప్తుంది. ఇక విజయాంబిక మిర్రర్‌లో చూసి రూప, రాజులు ఫాలో అవుతున్నారని దీపక్‌తో చెప్తుంది.
రాఘవిని ఎలా అయినా చంపేయాలి అంటుంది. దీపక్ చాలా స్పీడ్గా వెళ్తాడు. రాజు కూడా అంతే స్పీడ్‌గా వెళ్తాడు. ఇంతలో కారు బ్రేక్ పట్టడం లేదని రాజు కంగారు పడి రూపతో చెప్తాడు. రాజు కార్ ఎదురుగా వస్తున్న ఒక వ్యాన్‌ని ఢీకొడుతుంది. రాజు రూపలకు గాయాలవుతాయి. ఇద్దరూ కళ్లు తిరిగిపడిపోతారు. రాజు, రూపల కారుకి బ్రేక్‌లు తీసేసింది తానే అని దీపక్ తల్లితో చెప్తాడు. రాత్రి మందారం మాటలు విని రాజు, రూపలకు చెప్పిందని దీపక్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఇక నుంచి నువ్వు దేవా భార్యవి.. ఈ ఇంటి చిన్న కోడలివి.. ఓర్నీ ఇదంతా కలా!





















