అన్వేషించండి

Ammayi garu Serial Today April 21st: అమ్మాయి గారు సీరియల్: తల్లి కోసం రూప అడిగిన ప్రశ్నలకు సూర్య‌ మనసు మారుతుందా.. విరూపాక్షి గురించి ఆలోచిస్తారా!

Ammayi garu Today Episode రూప తల్లిని తప్పుగా అర్థం చేసుకున్నావని తండ్రిని సూటి ప్రశ్నలు అడిగి నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు, రూపల వల్ల సూర్యప్రతాప్‌ ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పు ఇస్తుంది. ఇక సూర్యప్రతాప్‌ కూతురు, అల్లుడిని సంతోషంగా అంగీకరిస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత రూప తండ్రితో తల్లి గురించి మాట్లాడుతుంది. 

రూప: నాన్న ఇప్పుడు మీ విషయంలో జరిగినట్లే అప్పుడు మా అమ్మ విషయంతో జరుగొచ్చు కదా నాన్న. 
విజయాంబిక: రూప ఏం మాట్లాడుతున్నావ్.
రూప: అత్తయ్య ఇందాకే చెప్పాను మా విషయంలో మాట్లాడొద్దని ఇంకోసారి మాట్లాడితే నోటితో చెప్పను నోటి పళ్లు రాలగొడతా. నాన్న మొన్న మీరు ఉన్న పరిస్థితిలో మా అమ్మ ఉండి రాఘవ రాధిక పరిస్థితిలో ఉండొచ్చు కదా నాన్న. మీ బాగు చూడని వాళ్లు రాధికను పంపినట్లు ఆ రోజు అమ్మ ఉన్న గదిలోకి రాఘవని కూడా పంపుండొచ్చు కదా నాన్న. ఆ రోజు చూసింది రైటో రాంగో నిర్ధారించుకోలేని పరిస్థితి మీది అయిండొచ్చు కానీ తర్వాత అయినా ఒక్కసారి ఆలోచించాల్సింది కదా నాన్న. నన్ను నా కుటుంబం నమ్మితే చాలు అని మీరు అనుకున్నట్లు ఆ రోజు మీరు నమ్మితే చాలు అని అమ్మ అనుకొని ఉండొచ్చు కదా నాన్న. ఈ రెండు రోజులకే మీరు చనిపోవాలి అనుకున్నారు కానీ అమ్మకి ఈ 20 ఏళ్లలో ఎన్ని సార్లు చనిపోవాలి అనిపించిందో కదా నాన్న.

విజయాంబిక అడ్డుకోవాలని మధ్యలో దూరి మీ అమ్మ మంచిది కాదు అంటుంది. దాంతో రూప మధ్యలో దూరితే నిన్ను నిలువునా నరికేస్తా అని అంటుంది. మీరు తప్పు చేయలేదు అని కుటుంబం నమ్మి మిమల్ని బయటకు తీసుకొచ్చాం. మీరు నమ్మలేదు కాబట్టి అమ్మ ఇంకా శిక్ష అనుభవిస్తుంది నాన్న అని రూప చెప్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మీరే మీ భార్యని నమ్మకపోతే ఎలా నాన్న. ఆ రోజు మీరు అమ్మని తప్పుగా అనుకున్నట్లే ఈ రోజు మేం తప్పుగా మిమల్ని అనుకొని ఉంటే మీ పరిస్థితి ఏంటి నాన్న. ఏం పరిస్థితిలో మీరు అమ్మని చూసి తప్పుగా అనుకున్నారో అలాంటి పరిస్థితిలో మిమల్ని అమ్మ చూసినా కూడా నమ్మలేదు నాన్న. చిన్న పొరపాటు వల్ల మీరు విడిపోయినా అమ్మ మిమల్ని నమ్మింది అని విరూపాక్షి విషయంలో సూర్యప్రతాప్‌ చేసిన తప్పు గురించి చెప్తుంది. మా అమ్మని ఎవరు నమ్మకపోయినా పర్లేదు నాన్న నేను నమ్ముతా అని రూప చెప్తుంది. అసలు ఏం జరిగింది అని ఒక్క సారి అయినా మా అమ్మని అడగాలి అనిపించలేదా నాన్న కనీసం మా అమ్మ ఈ తప్పు చేసుంటుందా లేదా అని ఒక్క సారి అయినా ఈ విషయం గురించి ఆలోచించారా నాన్న అంటుంది. దాంతో సూర్యప్రతాప్‌ ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు.  

విజయాంబిక కొడుకుతో సూర్యప్రతాప్‌ ఆలోచించినా సూర్యప్రతాప్‌ మనసు మార్చేయాలి అనుకుంటారు. సూర్యప్రతాప్‌ కూతురి చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తాడు. రూప చెప్పిన మాటలు కరెక్ట్ అని అనిపిస్తుందని అనుకుంటాడు. విరూపాక్షి తప్పు చేసినట్లు కనిపించిందని అనుకుంటాడు కానీ అతని అంతరాత్మ వచ్చి ఈ రోజు నువ్వు అర్థనగ్నంగా వచ్చావ్ రాధిక చీర కొంగు పట్టుకొని వచ్చింది అది మరి ఏంటి ఆ రోజు గదిలో ఏం జరిగిందో నీకు రాధికకు మాత్రమే తెలుసు అని అంటారు. ఇప్పటికైనా కళ్లు తెరువు సూర్యప్రతాప్‌ అని అంతరాత్మ చెప్తుంది.  సూర్యప్రతాప్‌ మనసు మారిపోకూడదని తల్లీకొడుకులు వచ్చి విరూపాక్షి గురించి తప్పుగా చెప్పాలి అనుకుంటారు.

విరూపాక్షి, రాఘవలు గదిలో ఉండగా చూశానని చెప్తుంది. విరూపాక్షిని స్వీకరించొద్దని సూర్యప్రతాప్‌తో చెప్తుంది. దాంతో సూర్యప్రతాప్‌ ఎప్పుడూ విరూపాక్షి గురించి చెడుగా చెప్పడమే తప్పు మంచిగా మాట్లాడావా నన్ను అలా ఆలోచించేలా చేశావా అని అడుగుతాడు. ఆ పాపిష్టిదాని కోసం రూప మాట్లాడుతుంటే పళ్లు  రాలగొట్టాలని అనిపించిందని విజయాంబిక అంటే నా కూతురి పళ్లు రాలగొడతా అనడానికి నువ్వు ఎవరు. నా కూతురు నన్ను ఏమైనా అడుగుతుంది మీకేంటి బాధ అని కూతురిని సపోర్టు చేసి తల్లీకొడుకుల్ని తిడతాడు. నా దృష్టిలో మీరు ఎప్పుడో చనిపోయారు కానీ మీరు ఇంటికి రావడానికి రూపే కారణం అని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా తెచ్చిన బట్టలు వేసుకొన్నసత్యమూర్తి.. తండ్రి సంతోషం దేవాలో మార్పు తీసుకొస్తుందా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Crime News: విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Pawan Kalyan Gift To Sujeeth : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Pawan Kalyan Gift To Sujeeth : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
Embed widget