Ammayi garu Serial Today February 25th Promo: అమ్మాయి గారు సీరియల్ ప్రోమో: మౌనిక, దీపక్‌ల విడాకుల రచ్చ.. ఒక్కొక్కరికి బొమ్మ కనపడినట్లే!
Ammayi garu Promo Today కోర్డుకి వెళ్లాల్సిన దీపక్ ఫిట్స్ వచ్చినట్లు నటించడం రాజు బాబాలా వచ్చి చితక్కొట్టడంతో ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Promo విజయాంబిక, దీపక్‌లు మందారానికి గతం గుర్తొచ్చే లోపు ఫారిన్ చెక్కేయాలి అనుకుంటారు. అందుకు ట్రావెల్ ఏజెన్సీ అతన్ని కలిస్తే ఇద్దరు పెళ్లాలు ఉండకూడదు ఒకరికి విడాకులు ఇవ్వాలని చెప్పడంతో మందారానికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఈ తరుణంలో నోటీసులు ఇంటికి వస్తాయి. సూర్య ప్రతాప్ నోటీసులు చూసి దీపక్‌ని తిట్టి రేపు కోర్టుకు వెళ్లి తేల్చుదామని అంటారు. దాంతో దీపక్ వాళ్ల భయపడి కోర్టుకు వెళ్లకుండా ఉండాలని ప్లాన్ చేస్తారు ఈ తరుణంలో తాజా ప్రోమో ఆసక్తికరంగా మారింది.
" దీపక్, మౌనిక, విజయాంబికలు గదిలో మాట్లాడుకుంటూ ఉంటే రూప అక్కడికి వస్తుంది. మందారం జోలికి రాకండి.. రేపు కోర్టుకి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి వెళ్లిపోతుంది. విజయాంబిక వాళ్లు షాక్ అయిపోతారు. ఇంతలో దీపక్ ఫిట్స్ వచ్చినట్లు గిలగిలా కొట్టుకొని మంచం మీద పడిపోతాడు. విజయాంబిక, మౌనికలు దీపక్ దీపక్ అంటూ పెద్దగా అరుస్తారు. విజయాంబిక తమ్ముడు సూర్య ప్రతాప్‌ని పిలుస్తుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. మందారం వచ్చి ఏవండీ ఏవండీ అని అరుస్తుంది. ఇక దీపక్ తండ్రి స్వామీజీ వస్తారు. ఇలాంటి వాటిని ఒకరు నయం చేస్తారు అని అంటారు. దాంతో రాజు స్వామీజీ గెటప్‌లో వస్తాడు. వీల్ చైర్ మీద ఉన్న దీపక్‌ని చూసి అటాక్ అనగానే అందరూ కర్రలతో దీపక్‌ని చితక్కొడతారు. దీంతో ప్రోమో పూర్తయిపోతుంది."
నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే..
దీపక్ మందారానికి విడాకులు ఇవ్వడానికి నోటీసు ఇస్తే అవి సూర్య చేతిలో పడుతుంది. సూర్యప్రతాప్ చూసి దీపక్‌ని తిడతాడు. నువ్వు మనిషివేనా అని తిడతాడు. మీ లాంటి వాళ్లకి భూమ్మీద బతికే అర్హత లేదు అని అంటాడు. దాంతో దీపక్ తుళ్లిపడతాడు. తీరా చూస్తే అదంతా దీపక్ భ్రమ. సూర్య ప్రతాప్ చేతిలో ఉన్న నోటీసు చూసి సూర్య దీపక్ భుజం తట్టి మంచి పని చేశావ్ అని అంటాడు. ఆ నోటీసు ఏంటి అని అందరూ అడుగుతారు. దాంతో సూర్యప్రతాప్ దీపక్, మౌనికలు విడాకులు తీసుకుంటున్నారని ఈ నిర్ణయం వల్ల మందారానికి న్యాయం జరుగుతుందని సంతోషిస్తారు. మౌనిక షాక్ అయిపోతుంది. అందరూ మౌనికని పొగిడేస్తారు. మౌనికకు మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తానని సూర్యప్రతాప్ అంటాడు.
మందారం మౌనికకి కూడా థ్యాంక్స్ చెప్తుంది. మౌనిక అత్తా భర్తల్ని చాటుగా తీసుకెళ్లి ప్రశ్నిస్తుంది. మీరే ఇలా చేశారని అరుస్తుంది. ఇంతలో రూప వచ్చి మందారాన్ని టచ్ చేయాలి అంటే నన్ను దాటుకొని వెళ్లాలి అంటుంది. మౌనిక దీపక్‌ల విడాకుల పిటిషన్ పెట్టింది నేనని రూప చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. రాత్రి దీపక్ చేసిన ప్లాన్ పసిగట్టిన రూప రాజుకి విషయం చెప్తుంది. దాంతో రాజు దీపక్‌ని ఫాలో అవుతాడు. లాయర్ దగ్గర విడాకులు గురించి తెలుసుకున్న రాజు మౌనిక పేరు మార్చేస్తాడు. దీంతో ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!





















