TV broadcasters: రేటింగ్ రానప్పుడు కొనడం ఎందుకు? ఓటీటీల హవాతో సినిమాల కొనుగోలుకు టీవీ ఛానెళ్ల వెనుకడుగు!
గత కొంత కాలంగా ఓటీటీల హవా పెరిగిపోవడంతో టీవీల్లో సినిమాలు చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో సినిమాల శాటిలైట్ రైట్స్ కొనుగోలు విషయంలో టీవీ ఛానెల్స్ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ఓటీటీల హవా భారీగా పెరిగింది. సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ ఓటీటీల్లో ఆకట్టుకునే కంటెంట్ లభిస్తోంది. ప్రజలు ఎక్కువగా ఓటీటీలనే ఆదరిస్తున్నారు. చాలా సినిమాలు సైతం విడుదలైన మూడు, నాలుగు వారాల్లోనే ఓటీటీలలో దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాల శాటిలైట్స్ రైట్స్ కొనేందుకు ఆయా టీవీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
భారీగా తగ్గిన టీవీ వీక్షకుల సంఖ్య
ప్రేక్షకులు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వైపు మళ్లుతున్న నేపథ్యంలో సినిమాల శాటిలైట్స్ కొనుగోలు ధర బాగా పడిపోయింది. చిన్న, స్టార్ యేతర సినిమాలు బ్రాడ్‌కాస్టర్‌లకు చౌకగా అమ్ముడవుతున్నాయి. చాలా సినిమాలు అమ్ముడుపోకుండా మిగిలిపోతున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలే కాకుండా పలు సినిమాలు అడిగే ధరలో సగం ధరకు కూడా బయ్యర్లు దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా మలయాళం, తమిళంలో టీవీకి విక్రయించబడలేదని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, గత కొన్ని సంవత్సరాలుగా వీక్షకుల సంఖ్యతో పాటు సినిమా ఛానెల్‌ల ప్రకటనలలో 40% తగ్గుదల కనిపించినట్లు చెప్తున్నారు.
కరోనా ముందు నుంచే మొదలైన సంక్షోభం
"ప్రీ కోవిడ్ తో పోల్చితే సినిమాల రేట్లలో 50% తగ్గుదల కనిపించింది. 2023లో చాలా సినిమాలు అమ్ముడుపోకపోవచ్చు" అని గోల్డ్ మైన్ టెలిఫిల్మ్స్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మనీష్ షా అన్నారు. ఒకే కంటెంట్ పలు ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉండటంతో సినిమా ఛానెల్‌లకు వీక్షకుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. ఓటీటీ ప్లాట్ ఫారమ్ లలో ప్రజలు తమ సౌకర్యం ప్రకారం, యాడ్స్ లేకుండా సినిమాలు చూసే అవకాశం ఉంది. అందుకే ఎక్కువగా వీక్షకులు ఓటీటీలను ఇష్టపడుతున్నారని షా చెప్పారు.
“ఈ సంవత్సరం చాలా సినిమాలు థియేట్రికల్ బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడలేదు. అయితే, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘భూల్ భూలయ్యా 2’ లాంటి సినిమాలు సైతం తొలి రెండు ప్రసారాల తర్వాత టీవీలో ఎక్కువ మంది వీక్షకులు చూడలేదు" అని బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. దీనికి విరుద్ధంగా, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’, ‘KGF: చాప్టర్ 1’ లాంటి సినిమాలు మాత్రం మంచి రేటింగ్ నే సాధిస్తున్నాయన్నారు.
శాటిలైట్స్ రైట్స్ కు తగ్గిన డిమాండ్
డిస్నీ, జీ వంటి కంపెనీల కోసం శాటిలైట్, డిజిటల్ హక్కులను కొనుగోలు చేస్తున్నాయి. అయితే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోకి తమ స్ట్రీమింగ్ హక్కులను విక్రయించిన కొన్ని సినిమాల కొనుగోలుకు టీవీలు వెనుకడుగు వేశాయి. “ఒక పెద్ద సినిమా ఇంతకుముందు శాటిలైట్ హక్కులను దాదాపు ₹50 కోట్లకు విక్రయించగా, ఇప్పుడు అదే ధర ₹25-30 కోట్లు అవుతుంది. మరోవైపు, కొన్ని నెలల క్రితం వరకు దాని OTT హక్కులు ₹ 50 కోట్లు చెల్లించే పెద్ద సినిమా, ఇప్పుడు ₹ 60-65 కోట్లు పొదుతుంది” ఎలరా క్యాపిటల్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కరణ్ తౌరానీ తెలిపారు.