అన్వేషించండి

Trivikram: ఫేడవుట్ అయిపోయిన స్టార్ - త్రివిక్రమ్ స్పెషల్ కేర్ ఎందుకంటే?

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమాలో తరుణ్ ని ఓ రోల్ కోసం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి.

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ తన సినిమాల్లో కొందరు ఆర్టిస్ట్ లను రిపీట్ చేస్తూ ఉంటారు. వారిపై ఉన్న అభిమానంతో అలా చేస్తుంటారు. అయితే ఒక ఫేడవుట్ అయిపోయిన హీరోపై త్రివిక్రమ్ స్పెషల్ కేర్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.. హీరో తరుణ్. త్రివిక్రమ్ దర్శకుడిగా తెరకెక్కించిన తొలి సినిమా 'నువ్వే నువ్వే'లో హీరోగా నటించారు తరుణ్. 
 
ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా తరుణ్ రేంజ్ ని పెంచింది. కానీ ఆ సక్సెస్ ను తరుణ్ నిలబెట్టుకోలేకపోయారు. ఆ తరువాత కొన్నాళ్లకు ఫేడవుట్ అయిపోయారు. సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు. మధ్యలో రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించారు కానీ హిట్టు మాత్రం రాలేదు. దీంతో ఇప్పుడు తరుణ్ బాధ్యత త్రివిక్రమ్ తీసుకున్నట్లు సమాచారం. 
 
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమాలో తరుణ్ ని ఓ రోల్ కోసం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. తన సినిమాలో ఛాన్స్ ఇవ్వనప్పటికీ.. తరుణ్ కోసం త్రివిక్రమ్ కథలు వింటున్నారట. కొందరు యంగ్ రైటర్స్, దర్శకులు చెబుతోన్న స్టోరీలు వింటోన్న త్రివిక్రమ్ అందులో తరుణ్ కోసం ఓ కథను ఎంపిక చేయబోతున్నారట. అంతేకాదు.. ఈ సినిమాను త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. తన ఫస్ట్ హీరోకి త్రివిక్రమ్ చూపించే గ్రాటిట్యూడ్ ఇది అని ఫిల్మ్ నగర్ లో మాట్లాడుకుంటున్నారు. 
 
ఇక మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా గురించి చెప్పాలంటే.. సెప్టెంబర్ రెండో వారంలో ఈ సినిమా స్టార్ట్ కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారట. యాక్షన్ సీక్వెన్సుతో షూట్ స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. తొలిసారి ఈ సినిమా కోసం తనకు అచొచ్చిన ఫ్యామిలీ డ్రామాను పక్కన పెడుతున్నారు త్రివిక్రమ్. పూర్తిగా యాక్షన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సీన్ ఈ సినిమాలో కనిపించవట.
 
నిజానికి త్రివిక్రమ్ ఫ్యామిలీ సబ్జెక్టు రాసుకున్నప్పటికీ.. మహేష్ మాత్రం యాక్షన్ పై దృష్టి పెట్టమని అడిగారట. దీంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో కీలకమార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఆలస్యమైందని తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ కి 'A' అనే అక్షరం చాలా సెంటిమెంట్. 
 
అందుకే ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అదే లెటర్ తో మొదలయ్యే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. కథకు కూడా 'అర్జునుడు' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kara OTT : ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Nindu Manasulu Serial Today May 21st: నిండు మనసులు: తండ్రిని గుర్తు చేసుకొని ఏడ్చేసిన సిద్ధూ! బెడ్ మీద సిద్ధూ ప్రేరణని కొట్టడానికి కారణమేంటి?
నిండు మనసులు: తండ్రిని గుర్తు చేసుకొని ఏడ్చేసిన సిద్ధూ! బెడ్ మీద సిద్ధూ ప్రేరణని కొట్టడానికి కారణమేంటి?
Illu Illalu Pillalu Serial Today may 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఆస్తి కోసం తండ్రి మీద చేయి చేసుకున్న సాగర్! చిల్లిగవ్వ కూడా ఇవ్వనని తేల్చేసిన రామరాజు! ఇంటి గుట్టు కోర్టుకి వెళ్తుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఆస్తి కోసం తండ్రి మీద చేయి చేసుకున్న సాగర్! చిల్లిగవ్వ కూడా ఇవ్వనని తేల్చేసిన రామరాజు!
Drishyam 3 : దృశ్యం 3 తెలుగు రైట్స్‌పై వివాదం - రిలీజ్ ఆపాలంటూ కోర్టులో పిటిషన్
దృశ్యం 3 తెలుగు రైట్స్‌పై వివాదం - రిలీజ్ ఆపాలంటూ కోర్టులో పిటిషన్

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TMC Political Crisis: చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్‌! మమత, అభిషేక్‌ వర్గాలుగా విడిపోయిన నేతలు! 
చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్‌! మమత, అభిషేక్‌ వర్గాలుగా విడిపోయిన నేతలు! 
Tamil Nadu Chief Minister Vijay Cabinet Expansion: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్‌లో చేరిన 23 మంది!  కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల జాబితా ఇదే!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్‌లో చేరిన 23 మంది!  కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల జాబితా ఇదే!
Andhra Pradesh and Telangana Weather Updates: ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
New Ethanol Blending Standards: ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
Mega 158 Movie : చిరు మెగా 158 మూవీ లాంచ్ - అన్నయ్యకు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
చిరు మెగా 158 మూవీ లాంచ్ - అన్నయ్యకు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
Tea Benefits in Summer : వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?
వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?
Cockroach Janta Party: బీజేపీని క్రాస్ చేసిన కాక్రోచ్‌ జనతా పార్టీ! అసలు ఏంటీ సెటైరిక్ పొలిటికల్ మోమెంట్‌?
బీజేపీని క్రాస్ చేసిన కాక్రోచ్‌ జనతా పార్టీ! అసలు ఏంటీ సెటైరిక్ పొలిటికల్ మోమెంట్‌?
Dragon Glimpse Reaction : ఎన్టీఆర్ డ్రాగన్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ - 24 గంటల్లోనే న్యూ హిస్టరీ
ఎన్టీఆర్ డ్రాగన్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ - 24 గంటల్లోనే న్యూ హిస్టరీ
Embed widget