News
News
X

Monica Barbaro: ‘RRR’ తెలుగులోనే చూస్తా - ‘నెట్‌ఫ్లిక్స్’కు ప్రముఖ హాలీవుడ్ నటి రిక్వెస్ట్, ‘ఎత్తర జెండా’కు ఫిదా!

రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు ఇప్పటికే ప్రపంచ స్థాయిలో అభిమానులు ఉన్నారు. అంతే కాదు పాటలకు ఫిదా అయ్యేవారు కోకొల్లాలు. తాజా ఓ హాలీవుడ్ బ్యూటీకి ‘ఎత్తరజెండా’ సాంగ్ కూడా నచ్చేసిందట.

FOLLOW US: 
Share:

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శక ధీడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘RRR’. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా స్థాయిని చాటిచెప్పింది ఈ చిత్రం. ఏదో ఒక వార్తతో ట్రెండింగ్ లో నిలుస్తున్న సినిమా ఇది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ తాజాగా ప్రతిష్టాత్మక ఆస్కార్ నామినేషన్స్ లో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘‘నాటు నాటు’’ సాంగ్ కూడా చోటు దక్కించుకుంది. ఇలా మన తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకోవడం గమనార్హం. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ప్రశంసల వర్షం కురిపించారు. అంతా నాటు నాటు పాటకు ఫిదా అవుతుంటే.. ఓ ప్రముఖ హాలీవుడ్‌ నటికి మాత్రం ‘‘ఎత్తర జెండా’’ పాట తెగ నచ్చేసిందట. అంతేకాదు, ఆ పాటకు డ్యాన్స్ చేస్తూ.. పొగడ్తలతో ముంచెత్తింది. RRR సినిమాను తనకు తెలుగులోనే చూడాలని ఉందని, దీనిపై ‘నెట్‌ఫ్లిక్స్’ పిటిషన్ పెట్టడం ఎలా అంటూ వీడియోను పోస్ట్ చేసింది.

ఆ హాలీవుడ్ నటి మరెవ్వరో కాదు.. మోనికా బార్బరో. యాక్షన్ హీరో టామ్‌క్రూజ్ నటించిన ‘టాప్ గన్: మావెరిక్’ మూవీలో పైలట్ నటషా పాత్రలో మోనికా బార్బరో నటించింది. . ఈమె మన RRR సినిమాకు పెద్ద ఫ్యాన్ అయింది. ఈ చిత్రంలోని పాటలు ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘‘నాటు నాటు’’ పాటకు అర్థం తెలియని వారు కూడా కాలు కదిపి పాట ఖ్యాతిని పెంచారు. ఇప్పుడు ఇదే సినిమాలోని ‘‘ఎత్తర జెండ’’ పాటకు మోనికా డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో కొన్ని క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇలా సోషల్ మీడియాలో మరోసారి RRR సాంగ్ వైరల్ గా మారడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. 

ఇక మెగాపవర్ స్టార్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారి కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం RRR. మన తెలుగు చిత్రం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొడుతుంది. జపాన్ లో కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకొని అత్యధిక లాభాలు గడించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నలిచింది RRR. ఇప్పటికే ఈ చిత్రం రూ.1200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. దాదాపు 700 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక షేర్ ప్రాఫిట్ అందించిన సినిమాల్లో కూడా ఇప్పుడు ఈ చిత్రం సరికొత్త రికార్డును అందుకోబోతోంది.

Read Also: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?

అంతర్జాతీయ స్థాయిలో రికార్డుల మోత మోగిస్తున్న ఈ సినిమా మరో సారి అంతర్జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. రోటెన్ టొమాటోస్ వారి గోల్డెన్ టమాటో అవార్డును ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఫ్యాన్ ఫేవరేట్ సినిమాగా ఈ అవార్డు దక్కింది సినిమాకు. ఈ అవార్డును బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపిన అవతార్ -2 సినిమా ఐదవ స్థానంలో దక్కించుకుంది. రెండో స్థానంలో ‘టాప్ గన్: మావెరిక్’ చిత్రం నిలిచింది. అందులో నటే RRR సినిమాకు డాన్స్ చేయడం విశేషం.

Published at : 02 Feb 2023 01:38 PM (IST) Tags: ram charan RRR Songs NTR RRR cinima hollywood actor dance Monica Barbaro

సంబంధిత కథనాలు

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !