ప్రభాస్ సినిమాపై మారుతి కామెంట్స్, బోయపాటికి తమన్ పంచ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
ప్రాణం పెట్టి పని చేస్తున్నా- ప్రభాస్ మూవీపై మారుతి ఎమోషనల్ కామెంట్స్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘రాజు డీలక్స్‘ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఓ వైపు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్, మారుతి మూవీ షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. ఈ మూవీ సైతం పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా గురించి, ఈ సినిమా కోసం తాను పడుతున్న కష్టం గురించి మారుతి పలు కీలక విషయాలు వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
బోయపాటికి తమన్ భారీ పంచ్ - అంత మాట అనేశారేంటి?
ఐ డోంట్ కేర్... ఇప్పుడీ పదం తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతోంది. అలాగే, సోషల్ మీడియాలో కూడా! నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై మీ స్పందన ఏంటని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నట సింహం నందమూరి బాలకృష్ణను అడిగితే... 'ఐ డోంట్ కేర్' అని సమాధానం ఇచ్చారు. ఆయన కొత్త సినిమా 'భగవంత్ కేసరి' క్యాప్షన్ 'బ్రో... ఐ డోంట్ కేర్'! ఆ మాట చెప్పారు. ఆ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ కూడా ఆ మాట చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఆరు నెలలు షూటింగుకు, ఆ తర్వాత ఆరు సీజీకి - మెగా ప్లానింగ్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠ దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో మొదలు కానుందని సమాచారం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రజనీకాంత్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్డేట్ - ఐమ్యాక్స్ కెమెరాలో
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు 'జైలర్' మాంచి కిక్ అయితే ఇచ్చింది. ఆ సినిమాకు వచ్చిన వసూళ్లు చూసి అభిమానులు, ప్రేక్షకులతో పాటు పరిశ్రమ కూడా సంతోషించింది. 'జైలర్' తర్వాత సినిమాను రజనీకాంత్ పట్టాలు ఎక్కించారు. ఆ తర్వాత చేయబోయే సినిమాను కూడా ఓకే చేశారు. 'జై భీమ్'తో విమర్శకులతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న సినిమా షూటింగ్ కేరళలో మొదలైంది. దాని తర్వాత 'ఖైదీ', 'విక్రమ్' చిత్రాలతో స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేస్తున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా చేయనున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘నాటు నాటు’పై లోకేష్ కనగరాజ్ రియాక్షన్ - ‘లియో’లో సాంగ్స్ అందుకే అంటూ కామెంట్స్!
అక్టోబర్‌లో రానున్న సినిమాల్లో సూపర్ హైప్ ఉన్నవాటిలో విజయ్, లోకేష్ కనగరాజ్‌ల ‘లియో’ కూడా ఉంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 19వ తేదీన దసరా సందర్భంగా ‘లియో’ విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట గురించి మాట్లాడారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)