అన్వేషించండి

సినిమాలకు ‘ప్రేమమ్’ డైరెక్టర్ గుడ్‌బై, ‘రానానాయుడు’పై బాబీ డియోల్ కామెంట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

నా దగ్గర 6 లవ్ స్టోరీస్ ఉన్నాయి - నిబ్బా నిబ్బి స్టోరీస్ అని మీరు చెప్పకముందే నేనే చెప్తున్నా!
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'బేబీ'(Baby) సినిమా రీసెంట్ టైమ్స్​లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు సాయి రాజేష్ నిర్మాత SKN పేర్లు ఇండస్ట్రీలో మార్మోగిపోయాయి. ముఖ్యంగా సాయి రాజేష్ కి దర్శకుడిగా ఈ చిత్రంతో భారీ గుర్తింపు వచ్చింది. బేబీకి ఈ రేంజ్ సక్సెస్ వస్తుందని సాయి రాజేష్ కూడా ఊహించి ఉండడేమో. అంతలా ఈ సినిమాని ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో దర్శకుడు సాయి రాజేష్ ప్రొడ్యూసర్ SKN కొత్త సినిమాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ హీరో సంతోష్ శోభన్​తో ఓ సినిమాను ప్రారంభించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘కీడా కోలా’ తీసినందుకు ప్రౌడ్​గా ఫీల్ అవుతున్నా: తరుణ్ భాస్కర్
'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం.. చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వం వహించిన చిత్రం ‘కీడా కోలా’. ఇందులో తరుణ్ భాస్కర్ తో సహా బ్రహ్మానందం, చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని విజి సైన్మా బ్యానర్‌పై కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ  క్రైమ్ కామెడీ మూవీని నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి యువ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'ప్రేమమ్' డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం - ఆ సమస్యతో సినిమాలకు గుడ్ బై అంటూ సంచలన పోస్ట్!
'ప్రేమమ్' సినిమాతో క్లాసిక్ హిట్ అందుకుని దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని తెలిపారు. తాను సినిమాలకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దాంతో ఆ పోస్ట్ చూసి నెటిజన్స్ అంతా షాక్ కి గురయ్యారు. ఉన్నట్టుండి ‘ప్రేమమ్’ డైరెక్టర్ అల్ఫోన్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటంటూ? పలువురు నెటిజన్స్ దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో తను సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన అల్ఫోన్స్ ఆ పోస్ట్ ను కొంత సమయం తర్వాత డిలీట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

చూస్తారుగా, మనోజ్ మంచు ఆడించే ఆట - వస్తూనే బాక్స్ బద్దలగొట్టిన రాకింగ్ స్టార్
దీపావళి సందర్భంగా ఈటీవీలో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' పేరుతో స్పెషల్ ఈవెంట్ ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంతో.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మంచు మనోజ్. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. "సింపుల్ తెలుగు బట్ నో కన్ఫ్యూజన్. వినాయక చవితి, సంక్రాంతి, ఉగాది.. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్. ఈ దివాళి ఈవెంట్ లో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్" ఉంటుందంటూ హైపర్ ఆది ఇంగ్లీష్ లో డైలాగ్ చెప్పి అదరగొట్టేశాడు. ఆ తర్వాత యాంకర్ సుమ, శ్రీముఖి, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల ఎంట్రీలను చూపించారు. అంతేకాకుండా ఈ ఈవెంట్లో సుమ కోసం ఓ స్పెషల్ పర్ఫామెన్స్ కూడా ప్లాన్ చేసినట్లు కనిపించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘రానా నాయుడు’ చూసి బాధపడ్డా, బాబీ డియోల్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ దిగ్గజన నటుడు బాబీ డియోల్ వరుస సినిమాలో దుమ్మురేపుతున్నారు. తాజాగా ఆయన ‘యానిమల్’  సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి  సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ ని ఊర మాస్ లెవెల్లో చూపిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మరింత క్యూరియాసిటీ పెంచాయి. తాజాగా 'యానిమల్'లో నెగెటివ్ రోల్ పోషిస్తున్న బాబీ డియోల్ పోస్టర్ ని విడుదల చేశారు. ‘యానిమల్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా  బాబీ డియోల్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలుగు స్టార్లు వెంకటేష్, రానా నటించిన ‘రానా నాయుడు’ సిరీస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో భారీ అంచనాల నడుమ విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకోని చిత్రం ఏంటిని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ‘రానా నాయుడు’ అని చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget