అన్వేషించండి

'ప్రేమమ్' డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం - ఆ సమస్యతో సినిమాలకు గుడ్ బై అంటూ సంచలన పోస్ట్!

మలయాళం మూవీ ప్రేమమ్ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అనారోగ్య సమస్యలతో సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.

'ప్రేమమ్' సినిమాతో క్లాసిక్ హిట్ అందుకుని దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని తెలిపారు. తాను సినిమాలకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దాంతో ఆ పోస్ట్ చూసి నెటిజన్స్ అంతా షాక్ కి గురయ్యారు. ఉన్నట్టుండి ‘ప్రేమమ్’ డైరెక్టర్ అల్ఫోన్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటంటూ? పలువురు నెటిజన్స్ దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో తను సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన అల్ఫోన్స్ ఆ పోస్ట్ ను కొంత సమయం తర్వాత డిలీట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

వివరాల్లోకి వెళ్తే.. మలయాళ చిత్ర పరిశ్రమలో బెస్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ లో 'ప్రేమమ్' మూవీ ముందు వరుసలో ఉంటుంది. నివీన్ పౌలి, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన ఈ చిత్రం మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. 2015లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద క్లాసిక్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీ యూత్ కు ఎంతగానో కనెక్ట్ అయింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ ఫీల్ గుడ్ మూవీ గా అద్భుతంగా తెరకెక్కించారు  ప్రతి ఒక్కరూ అల్ఫోన్స్ వర్క్ కి ఫిదా అయిపోయారు. ఇక ఇదే సినిమాని మన తెలుగులో నాగచైతన్య, శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్ తో చందు మొండేటి రీమేక్ చేయగా ఇక్కడ కూడా 'ప్రేమమ్' సూపర్ హిట్ అందుకుంది.

ఇదిలా ఉంటే ప్రేమన్ డైరెక్టర్ అల్ఫోన్స్ ఆ మధ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పూర్తిగా బక్క చికిపోయి నెరిసిన గడ్డంతో ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం గురించి మళ్ళీ ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. ఇలాంటి తరుణంలో ఆయన సోషల్ మీడియాలో స్వయంగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. సినిమా కెరియర్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలిపారు. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టత ఇచ్చారు.

" నేను నా సినిమా థియేటర్ కెరీర్ ను ఆపేస్తున్నాను. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాను. నేను ఎవరికీ భారంగా ఉండాలనుకోవడం లేదు. సాంగ్, వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ వరకు మాత్రం చేస్తాను. ఓటీటీ కంటెంట్ చేస్తాను. నిజానికి సినిమాలను ఆపేయాలని అనుకోవడం లేదు. కానీ వేరే అవకాశం లేదు. నేను చేయలేని పని గురించి ప్రామిస్ లు చేయలేను. ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పుడు జీవితంలో ఇంటర్వెల్ పంచ్ లాంటి ట్విస్ట్ ఇలా ఎదురవుతుంది" అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. కానీ ఆ తర్వాత ఈ పోస్టును డైరెక్టర్ అల్ఫోన్స్ వెంటనే డిలీట్ చేశారు. కానీ అప్పటికే అందరూ దాన్ని చూసేసారు. అల్ఫోన్స్ ముందు పోస్ట్ పెట్టి ఆ తర్వాత ఎందుకు తీసేసారో ఎవరికి అర్థం కాలేదు. పోస్ట్ డిలీట్ చేయడం వెనుక రీజన్ ఇంకా తెలియాల్సి ఉంది. కాగా 'నేరమ్' అనే చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు అల్ఫోన్స్. ఆ తర్వాత చేసిన 'ప్రేమమ్' చిత్రం దర్శకుడిగా ఆయనకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

Also Read : ‘బిగ్ బాస్’ బ్యూటీ హీరోయిన్‌గా ‘బేబీ’ మేకర్స్ కొత్త సినిమా - క్లాప్ కొట్టిన నాగచైతన్య

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Ramba Oorvasi Menaka First Look: ఫాంటసీ కామెడీతో అల్లరోడు... 'రంభ ఊర్వశి మేనక' రిలీజ్ డేట్ ఫిక్స్, ఫస్ట్ లుక్ చూశారా?
ఫాంటసీ కామెడీతో అల్లరోడు... 'రంభ ఊర్వశి మేనక' రిలీజ్ డేట్ ఫిక్స్, ఫస్ట్ లుక్ చూశారా?
NTR x Trivikram: తెలుగు వర్సెస్ తమిళ్... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాపై కాంట్రవర్సీ... ఏమైందో తెల్సా?
తెలుగు వర్సెస్ తమిళ్... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాపై కాంట్రవర్సీ... ఏమైందో తెల్సా?
Maa Inti Bangaram Collections Day 11: సెకండ్ వీకెండ్ తర్వాత సడన్‌గా పడిన బంగారం... సోమవారం సమంత సినిమాకు షాక్
సెకండ్ వీకెండ్ తర్వాత సడన్‌గా పడిన బంగారం... సోమవారం సమంత సినిమాకు షాక్
Akhil Raj: ఫుడ్ డెలివరీ బాయ్‌పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో దాడి... అఖిల్ రాజ్ వీడియో వైరల్
ఫుడ్ డెలివరీ బాయ్‌పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో దాడి... అఖిల్ రాజ్ వీడియో వైరల్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget