విశ్వక్ ట్వీట్‌పై వంశీ రియాక్షన్, ‘ఈగిల్’ రిలీజ్ ఎప్పుడు? - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
విశ్వక్ సేన్ కాంట్రవర్షియల్ ట్వీట్‌పై ప్రొడ్యూసర్ రియాక్షన్ - నాగవంశీ ఏమంటున్నారో చూశారా?
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను డిసెంబర్ 8న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వాయిదా వేసినట్లు ఆ సినిమా దర్శక, నిర్మాతలు చెప్పలేదు. కానీ, వాయిదా పడుతుందేమో అని హీరో విశ్వక్ సేన్ మదిలో సందేహం కలిగింది. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదల తేదీ డిసెంబర్ 8 అని అనౌన్స్ చేసినప్పుడు... ఆ తేదీకి మూడు నాలుగు సినిమాలు లేవు. వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వేలంటైన్' ఒక్కటే ఉంది. అప్పటికి సలార్ విడుదల తేదీ 'సలార్' సెప్టెంబర్ 28. నాని 'హాయ్ నాన్నా', నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలు క్రిస్మస్ సీజన్ టార్గెట్ చేశాయి. ఎప్పుడు అయితే 'సలార్' డిసెంబర్ 22కి వెళ్ళిందో... ఆ తర్వాత పరిస్థితులలో మార్పు వచ్చింది. డిసెంబర్ 7కు 'హాయ్ నాన్నా', 8కి 'ఎక్ట్రా' వచ్చాయి. దాంతో విశ్వక్ సేన్ చేసిన ట్వీట్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా విడుదల వాయిదా పడొచ్చనే డౌట్ కలిగించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రవితేజ పుట్టినరోజుకా? సంక్రాంతికా? - 'ఈగల్' విడుదల ఎప్పుడు?
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఈగల్'. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత. యంగ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ చేస్తున్నారు. తెలుగు చిత్రసీమలో వరుస సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రమిది. రవితేజది ఆ సంస్థకు మంచి అనుబంధం ఉంది. ఆల్రెడీ ఈ కాంబినేషన్ 'ధమాకా' చేసింది. బ్లాక్ బస్టర్ 'ధమాకా' తర్వాత రవితేజ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన సినిమా కావడంతో 'ఈగల్' మీద మంచి అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి బరిలో జనవరి 13న ఈ సినిమాను విడుదల చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నవంబర్ నెలాఖరున 'కోటబొమ్మాళి' - మెగా మేనల్లుడితో పోటీ
శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రత్యేక పాత్రలు పోషించిన సినిమా 'కోట బొమ్మాళి పీఎస్'. ఇందులో రాహుల్ విజయ్ హీరో. యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని హీరోయిన్. 'కోట బొమ్మాళి పీఎస్'ను జీఏ2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. 'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'ప్రతి రోజు పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాలను నిర్మించింది ఈ సంస్థే. ఇప్పుడీ 'కోట బొమ్మాళి పీఎస్' సినిమాను నవంబర్ 24న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. ఆ రోజు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఆదికేశవ' కూడా విడుదల కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మహేష్ సినిమాకు ప్రయారిటీ... నేనెందుకు వేరే నిర్మాతలను అడగాలి?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న 'గుంటూరు కారం' సినిమా సంక్రాంతి బరిలో విడుదల అవుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరోసారి స్పష్టం చేశారు. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా నటించిన 'ఆదికేశవ' సినిమాను నవంబర్ 10 నుంచి 24కు వాయిదా వేసిన విషయం చెప్పడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంక్రాంతి బరిలో సినిమాల పోటీ గురించి నాగవంశీ మాట్లాడారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మాటల్లేవ్ - విక్రమ్ 'తంగలాన్' టీజర్, ఆ యాక్షన్ చూశారా?
విలక్షణ కథానాయకుడు, క్యారెక్టర్ కోసం తనను తాను ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆవిష్కరించుకునే నటుడు చియాన్ విక్రమ్. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'తంగలాన్'. దీనికి పా రంజిత్ దర్శకుడు. 'అట్టకత్తి', 'మద్రాస్', సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాల', 'కబాలి', 'సార్ పట్ట' చిత్రాలతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న దర్శకుడు పా రంజిత్. ఆయనకు చెందిన నీలమ్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)