News
News
వీడియోలు ఆటలు
X

మిల్కీ బ్యూటీతో చిరు రొమాన్స్, వివాదంలో ‘ఖిలాడీ’ లేడీ, మార్క్‌గా సాయి తేజ్ - ఇవీ నేటి టాప్ 5 సినీ విశేషాలు

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

FOLLOW US: 
Share:

మిల్కీ బ్యూటీతో మెగాస్టార్ రొమాంటిక్ డ్యూయెట్ - లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'భోళా శంకర్'. ఇందులో మెగాస్టార్ జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్నారు. స్విట్జర్లాండ్ మంచు కొండల్లో హీరో హీరోయిన్లపై రొమాంటిక్ డ్యూయెట్ ఒకటి తెరకెక్కించారు. ఆ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. స్విట్జర్లాండ్‌లో 'భోళా శంకర్' సాంగ్ షూటింగ్ కంప్లీట్ కావడంతో తమ యూనిట్ ఇండియా రిటర్న్ అయ్యిందని మెహర్ రమేష్ పేర్కొన్నారు. పాట చాలా అందంగా వచ్చిందని ఆయన తెలిపారు. అదే సమయంలో అక్కడ చిత్రీకరణ చేయడం చాలా కష్టమని ఆయన చెప్పుకొచ్చారు. యువ సంగీత దర్శకుడు సాగర్ మహతి అందించిన బాణీకి శేఖర్ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ చేయగా... సినిమాటోగ్రాఫర్ డడ్లీ అందంగా తెరకెక్కించారని మెహర్ రమేష్ ట్వీట్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఐపీఎస్ అధికారితో గొడవ - 'ఖిలాడీ' హీరోయిన్ డింపుల్ హయతిపై కేసు 

తెలుగమ్మాయి, యువ కథానాయిక డింపుల్ హయతిపై జూబ్లీ హిల్స్ (హైదరాబాద్) పోలీస్ స్టేషనులో కేసు నమోదు అయ్యింది. ఆమెతో పాటు విక్టర్ డేవిడ్ అనే మరో వ్యక్తిని కూడా స్టేషనుకు పిలిపించి నోటీసులు ఇచ్చారు. జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్‌లో డింపుల్ హయతి ఉంటున్నారు. ఆమెతో పాటు డేవిడ్ కూడా బస చేస్తున్నారు. ఆ బహుళ అంతస్థుల భవనంలో ట్రాఫిక్ డీసీపీ ఐపీఎస్ రాహుల్ హెగ్డే సైతం నివాసం ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయంలో డింపుల్ ప్రవర్తన వివాదానికి కారణమైంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

హాలీవుడ్ అరంగేట్రంపై రామ్ చరణ్ హింట్ - జీ20 సదస్సులో ఏం చెప్పారంటే?

ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' (RRR) తో అంతర్జాతీయ స్థాయిలో పేరు, ప్రఖ్యాతలు, ప్రశంసలు అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. మరో సారి భారతదేశానికి గర్వ కారణంగా నిలిచారు. కాశ్మీర్ లో జరిగిన జీ 20 సమ్మిట్ లో పాల్గొన్న ఆయన..  తన హాలీవుడ్ అరంగేట్రంపై హింట్ ఇచ్చారు. భారతీయ సినిమా గురించి, దర్శకులు చెప్పే పాతుకుపోయిన కథల గురించి గొప్పగా మాట్లాడిన రామ్ చరణ్.. కొన్ని నెలల క్రితం నుంచి హాలీవుడ్ దర్శకులు, నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించాడు. అయితే, అతని తొలి హాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి మాత్రం ఎలాంటి వివరాలు ఇంకా బయటకు రాలేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

హీరోల స్టార్‌డమ్, హీరోయిన్ రోల్స్‌పై శ్రీలీల ఓపెన్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రీ లీల. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమాలో హీరోయిన్ ఎవరు? పూజా హెగ్డేతో పాటు శ్రీలీలదీ సమానమైన పాత్ర అని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఈ రెండూ మాత్రమే కాదు... బాలకృష్ణ 108వ సినిమాలో కీలక పాత్రతో పాటు రామ్ - బోయపాటి శ్రీను సినిమా, విజయ్ దేవరకొండ కొత్త సినిమా, పంజా వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ', నితిన్ కొత్త సినిమాలు చేస్తున్నారు శ్రీ లీల. ఈ నేపథ్యంలో శ్రీలీలా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మార్కండేయులుగా సాయి ధరమ్ తేజ్ - BRO లుక్ అదిరిందిగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ మెగా మల్టీస్టార్ మూవీ 'బ్రో'. తమిళంలో సూపర్ హిట్ అయిన 'వినోదయ సీతం' అనే మూవీకి ఇది తెలుగు రీమేగా తెరకెక్కుతోంది. ఒరిజినల్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన నటుడు దర్శకుడు పి. సముద్రఖని ఈ రీమేక్ ను తెరకెక్కిస్తున్నారు. జి స్టూడియోస్ సమర్పణలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై వివేక్ కూచిబోట్ల, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్, సాయి తేజ సరసన ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా.. సీనియర్ నటులు తనికెళ్ల భరణి, బ్రహ్మానందం తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ మోషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ సాయి ధరమ్ తేజ్ లుక్ కూడా రిలీజ్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Published at : 23 May 2023 04:59 PM (IST) Tags: Tollywood News Movie News entertainment news TV News CINEMA NEWS

సంబంధిత కథనాలు

థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!

థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత

Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత

Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!

Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!

టాప్ స్టోరీస్

ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట

ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

WTC Final 2023: అదిరిందయ్యా రోహిత్‌! కొత్త జెర్సీల్లో టీమ్‌ఇండియా ఫొటోషూట్‌!

WTC Final 2023: అదిరిందయ్యా రోహిత్‌! కొత్త జెర్సీల్లో టీమ్‌ఇండియా ఫొటోషూట్‌!