అన్వేషించండి

‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
2024 సంక్రాంతికి విడుదల అయ్యే సినిమాల్లో అన్నిటి కంటే ఎక్కువ హైప్‌తో వస్తున్నది మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ‘గుంటూరు కారం’. 2024 జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు కేవలం నెల రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారంలో జోరు పెంచారు. ఇప్పటికే విడుదల అయిన మొదటి పాట ‘దమ్ మసాలా’ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రెండో పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ‘ఓ మై బేబీ’ అంటూ సాగే ఈ పాట డిసెంబర్ 13వ తేదీన విడుదల కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

బాబీడియోల్ ‘జ‌మల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్ నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నేషన్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ రణబీర్ తండ్రిగా కనిపించగా, మరో దిగ్గజ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా వసూళ్లు వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 500 కోట్ల మార్కును దాటింది. రణబీర్‌ నటన, సందీప్ రెడ్డి టేకింగ్ చూసి సినీ లవర్స్ ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో బాబీ డియోల్ ఎంట్రీ సందర్భంగా వచ్చే ‘జమల్ కుడు’ పాట అందరినీ ఆకట్టుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ పాట నిజానికి ఇండియాకు చెందినది కాదు. ఇదో ఇరానియన్ సాంగ్.  ప్రముఖ ఇరానియ‌న్ క‌వి బిజాన్ స‌మాంద‌ర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ పాట ఇరాన్ లో జరిగే పెళ్లి వేడుకలలో పెట్టడం విశేషం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోనర్స్ ఎంచుకుని బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఈ ఏడాది 'దసరా' మూవీతో భారీ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నాని తాజాగా 'హాయ్ నాన్న'తో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తండ్రీ, కూతురు మధ్య అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ అనే నూతన దర్శకుడు వెండితెరకు పరిచయమయ్యాడు. నాని సరసన మృణాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే నానికి కూతురిగా కియారా ఖన్నా తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా ఓవర్సీస్ లో వీకెండ్ పూర్తవక ముందే వన్ మిలియన్ మార్క్ దాటింది. దీంతో టైర్ 2 హీరోల్లో ఎక్కువ సార్లు ఓవర్సీస్ మార్కెట్ వద్ద 1 మిలియన్ మార్క్ అందుకున్న హీరోగా నాని సరికొత్త రికార్డ్ క్రేయేట్ చేశాడు. ఈ సినిమాతో కలిపి మొత్తం నాని నటించిన తొమ్మిది సినిమాలు ఈ ఘనతను అందుకోవడం విశేషం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘సలార్’ నుంచి మరో కీలక అప్ డేట్, మూవీ రన్ టైమ్ ఎంతో తెలుసా?
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’ రిలీజ్ డేట్ దగ్గర పడింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నఈ సినిమా త్వరలో థియేటర్లలో అలరించనుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న అభిమానుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్  సోషల్ మీడియాను షేక్ చేసింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ అన్ని భాషలు కలిపి 24 గంటల్లో ఏకంగా 116 మిలియన్ల వ్యూస్ అందుకుని కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ ట్రైలర్ విషయంలో తొలుత కాస్త మిశ్రమ స్పందన లభించినా, ఆ తర్వాత పాజిటివ్ గా మారింది. ‘సలార్’ రన్ టైమ్ కూడా ఫిక్స్ అయ్యింది. ఈ మూవీ 2 గంటల 55 నిమిషాల 22 సెకెన్లు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 3 గంటల సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అటు ఈ సినిమాకు సెన్సార్ షిప్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీకి A సర్టిఫికెట్ జారీ అయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘హాయ్ నాన్న’కు అల్లు అర్జున్ స్పెషల్ రివ్యూ - మృణాల్ అందానికి ఫిదా
ఒక సినిమాలోని కంటెంట్ బాగుందంటే.. మిగతా నటీనటులు, దర్శక నిర్మాతలు అంతా కలిసి దానిని ఎంకరేజ్ చేయడానికి ముందుకొస్తారు. ఇప్పటివరకు ‘యానిమల్’, ఇప్పుడు ‘హాయ్ నాన్న’ విషయంలో కూడా అదే జరుగుతోంది. ‘యానిమల్’ సినిమాను చూసి ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్.. తన ట్విటర్‌లో డీటెయిల్‌గా రివ్యూను అందించాడు. ఇక అదే రేంజ్‌లో ‘హాయ్ నాన్న’ కూడా తనను ఇంప్రెస్ చేసిందని.. తాజాగా ఆ మూవీపై కూడా రివ్యూ ఇచ్చాడు. ఇలా కంటెంట్ బాగున్న ప్రతీ సినిమాకు అల్లు అర్జున్ ఇస్తున్న రివ్యూలు చూసి ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Brahmamudi Maanas Nagulapalli: కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Embed widget