అన్వేషించండి

‘సైంధవ్’ అప్‌డేట్, ‘భోళా శంకర్’ వివాదం - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

చిరంజీవికి డబ్బే ముఖ్యమైతే 'ఆచార్య'కు తిరిగి ఇస్తారా? 'ఏజెంట్'కు అనిల్ సుంకర ఇచ్చారా?
'భోళా శంకర్' రిజల్ట్ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' సినిమాతో భారీ విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవికి 'భోళా శంకర్' ఫ్లాప్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చిరంజీవి దర్శక - నిర్మాతల ఎంపిక, భోళా పాత్ర చిత్రణపై పలు విమర్శలు వస్తున్నాయి. అయితే... నిర్మాత అనిల్ సుంకర ముక్కుపిండి డబ్బులు వసూలు చేశారని కొందరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో పనిగట్టుకుని మరీ చిరంజీవి ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నాలు కొంత మంది చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలే చెబుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

దిశా లేదు, దీషా లేదు - టైగర్ సింగిలే, డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ
బాలీవుడ్ యూత్ స్టార్ టైగర్ ష్రాఫ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు తెలుగు సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేసి హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అతను... సినిమాలతోనే కాకుండా డేటింగ్ రూమర్స్ తో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు టైగర్ మరోసారి తన వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలిచింది. యువ హీరో ముంబైలోని ఒక ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేసే దీషా ధనుక అనే అమ్మాయితో ఏడాదిన్నర కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై నటుడు తాజాగా స్పందించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇక్కడ బాలకృష్ణ 'అఖండ', హిందీలో సన్నీ డియోల్ 'గదర్ 2' - థియేటర్లకు ట్రాక్టర్లలో వస్తున్న జనాలు
పాత రోజుల్లో సినిమాలు చూడటానికి గ్రామాల నుంచి జనాలు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు కట్టుకొని పట్నంలోని థియేటర్లకు తరలి వచ్చేవారు. కాలంతో పాటుగా అవన్నీ మారిపోయాయి. ప్రస్తుత ఓటీటీల జమానాలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే ఫిలిం మేకర్స్ కు పెద్ద సవాలుగా మారిపోయింది. అయితే దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నాటి సీన్ మళ్లీ రిపీట్ అయింది. ‘గదర్ 2’ సినిమాని థియేటర్లలో చూసేందుకు అభిమానులు ట్రాక్టర్లు, ట్రక్కుల్లో రావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా తర్వాత ఈ తరహా పరిస్థితిని బాలకృష్ణ 'అఖండ' థియేటర్ల దగ్గర తెలుగు జనాలు చూశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'సలార్ 2' కి ముందే 'కేజీఎఫ్ 3' - ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదేనట!
'కే జి ఎఫ్' సిరీస్ తో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'సలార్' అనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ ని అందుకుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ పార్ట్-1 విడుదల కానుంది. అయితే సలార్ పార్ట్- 2 షూటింగ్ కూడా పూర్తి చేశాక ఇతర హీరోలతో ప్రశాంత్ నీల్ వర్క్ చేస్తాడని ఇటీవల ప్రచారం జరిగింది. నిజానికి 'సలార్' తర్వాత ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సి ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'సైంధవ్'లో ఎమోషనల్ క్లైమాక్స్ - వెంకటేష్ కెరీర్‌లో ఖర్చు ఎక్కువైంది దీనికే!
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా 'హిట్' దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'సైంధవ్'. క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబర్ 22న విడుదల కానుంది. వెంకటేష్ 75వ చిత్రమిది. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 'శ్యామ్ సింగ రాయ్' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget