అన్వేషించండి

'సలార్ 2' కి ముందే 'కేజీఎఫ్ 3' - ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదేనట!

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే 'సలార్' తర్వాత 'కే జీ ఎఫ్ 3' పనులను మొదలుపెట్టే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

'కే జి ఎఫ్' సిరీస్ తో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'సలార్' అనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ ని అందుకుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ పార్ట్-1 విడుదల కానుంది. అయితే సలార్ పార్ట్- 2 షూటింగ్ కూడా పూర్తి చేశాక ఇతర హీరోలతో ప్రశాంత్ నీల్ వర్క్ చేస్తాడని ఇటీవల ప్రచారం జరిగింది. నిజానికి 'సలార్' తర్వాత ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సి ఉంది.

కానీ ఇంతలోనే ఇప్పుడు 'కే జి ఎఫ్' చాప్టర్ 3 ఎప్పుడు అంటూ? అభిమానులు ఆసక్తికర చర్చ మొదలైంది. ఇటీవల 'కేజీఎఫ్ 2' మొదటి వార్షికోత్సవం సందర్భంగా హోంబలే ఫిలిమ్స్ అధినేతలతో ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' చాప్టర్ 3 ని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే తాజాగా 'కే జి ఎఫ్' 3 కి సంబంధించి సాలిడ్ అప్డేట్ అందింది. 'సలార్ 2' షూటింగ్ కి ముందే ప్రశాంత్ నిల్ 'కే జి ఎఫ్' చాప్టర్ 3 పనులను ప్రారంభిస్తాడని, త్వరలోనే స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెడతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సలార్ పార్ట్-1 చిత్రీకరణను ముగించి తర్వాత 'కేజిఎఫ్' 3 పై దృష్టి సారించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. ప్రశాంత్ నీల్ 'కే జి ఎఫ్' యూనివర్స్ గురించి తెలిసిందే కదా.

ఇండియన్ సినీ ప్రపంచంలో అతిపెద్ద ఫ్రాంచైజీలలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు 'సలార్' ఫ్రాంచైజీ కూడా ఆసక్తి పెంచేసింది. 'కేజిఎఫ్' - 'సలార్' క్రాస్ ఓవర్ కంటెంట్ తో భారీ యూనివర్ ప్రశాంత్ నీల్ క్రియేట్ చేయబోతున్నాడని తెలియడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక తాజాగా ప్రశాంత్ నీల్ సన్నిహిత వర్గాల వివరాల ప్రకారం.. త్వరలోనే ఆయన 'కేజీఎఫ్' చాప్టర్ 3 పనులను ప్రారంభిస్తారట. 'సలార్ 2' షూటింగ్ ప్రారంభించే ముందే 'కే జి ఎఫ్ 3' ని సెట్స్ పైకి తీసుకెళ్తారని తెలిసింది. 'కే జి ఎఫ్' యూనివర్స్ తర్వాత 'సలార్' యూనివర్స్ ఎలా ఉండబోతుందో చూడాలని ప్రేక్షకులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

ఇక 'కే జి ఎఫ్-1', 'కేజీఎఫ్-2' చిత్రాల్లో నటించిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ 'కే జీ ఎఫ్' చాప్టర్ 3 లోను నటించనున్నారు. అలాగే యశ్ తో పాటు ఇందులో ప్రభాస్ కూడా కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 'సలార్' సినిమా విషయానికొస్తే.. మైనింగ్ మాఫియా, ఆర్మీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్ గా కనిపించనున్నారు. రావు రమేష్, శ్రీయా రెడ్డి, టీను ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తుస్తున్నారు.

Also Read : తెలుగులోకి వచ్చేస్తున్న రీసెంట్ కన్నడ బ్లాక్ బస్టర్ - రిలీజ్ ఎప్పుడంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Golden Bhagyam Title Glimpse: 'గోల్డెన్ భాగ్యం' తెలుగు టైటిల్ గ్లింప్స్‌... 'KH X RK Reunion' స్పూఫ్, పవన్ & మహేష్‌ను వాడేశారుగా
'గోల్డెన్ భాగ్యం' తెలుగు టైటిల్ గ్లింప్స్‌... 'KH X RK Reunion' స్పూఫ్, పవన్ & మహేష్‌ను వాడేశారుగా
Puri Jagannadh: పూరి ఛార్మీని ఏకిపారేసిన లేడీ ప్రొడ్యూసర్... పరువు పోయేలా ఉంది - రియాక్ట్ అవుతారా?
పూరి ఛార్మీని ఏకిపారేసిన లేడీ ప్రొడ్యూసర్... పరువు పోయేలా ఉంది - రియాక్ట్ అవుతారా?
Chiranjeevi: ఓటీటీలోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... చిరు టాక్ షోకి 200 కోట్ల డీల్?
ఓటీటీలోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... చిరు టాక్ షోకి 200 కోట్ల డీల్?
Meenakshi Chaudhary: నానితో మీనాక్షి చౌదరి రొమాన్స్... 'ప్యారడైజ్' తర్వాత సినిమాలో?
నానితో మీనాక్షి చౌదరి రొమాన్స్... 'ప్యారడైజ్' తర్వాత సినిమాలో?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget