అన్వేషించండి

తెలుగులోకి వచ్చేస్తున్న రీసెంట్ కన్నడ బ్లాక్ బస్టర్ - రిలీజ్ ఎప్పుడంటే?

కన్నడ ఇండస్ట్రీలో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన 'హాస్టల్ హుడుగురు బేకా గిద్దరే' సినిమా తెలుగులో విడుదల అవుతోంది. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి.

కన్నడ ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన ఓ చిన్న సినిమా అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఆ సినిమానే 'హాస్టల్ హుడుగురు బేకా గిద్దరే'. డార్క్ కామెడీతో కన్నడ ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. నితిన్ కృష్ణమూర్తి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా చాలా తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించి కేవలం కన్నడ ఇండ్రస్ట్రీ లోనే కాకుండా అన్ని భాషల ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించడంతోపాటు నేషనల్ మీడియా దృష్టిని సైతం తమ సినిమా వైపు చూసేలా చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా రీమేక్ రైట్స్ ఇప్పుడు అన్ని భాషల్లోనూ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో ఈ సినిమాని రిమేక్ చేయాలని కొంతమంది దర్శక నిర్మాతలు తెగ హడావిడి చేశారు.

కానీ ఈ మధ్యకాలంలో రీమేక్ల విషయంలో వస్తున్న విమర్శల నేపథ్యంలో రీమేక్ చేయడం కంటే డబ్ చేసి రిలీజ్ చేయడమే మంచిదని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో 'కేజిఎఫ్', 'కాంతారా' వంటి కన్నడ సినిమాలను ఎలా అయితే డబ్ చేసి రిలీజ్ చేశారో ఇప్పుడు 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' సినిమాని కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పటికే డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు తెలుగులో 'బాయ్స్ హాస్టల్'  అనే టైటిల్ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు కలిసి తెలుగులో ఈ సినిమాని విడుదల చేస్తున్నాయి. ఆగస్టు 26న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది.

కానీ అదే సమయంలో తెలుగులో కొన్ని పెద్ద సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయినా కూడా మేకర్స్ రిస్క్ చేసి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ యూత్ కి మరియు ముఖ్యంగా స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక కన్నడలో జూలై 21న విడుదలై భారీ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమాలో తల్లిదండ్రులకు దూరంగా ఉండే హాస్టల్ కుర్రాళ్ళ ఎమోషన్స్ ను ఎంతో చక్కగా దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి.

పరుమమా పిక్చర్స్ బ్యానర్ పై రక్షిత్ శెట్టి సమర్పణలో వచ్చిన ఈ సినిమాలో కాంతారా హీరో రిషబ్ శెట్టి, రమ్య గెస్ట్ రోల్స్ లో నటించారు. 'కాంతారా', 'విరూపాక్ష' వంటి సినిమాలకు సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. గుల్ మోహర్ ఫిలిమ్స్ మరియు వరుణ్ స్టూడియోస్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు. కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి తెలుగు ట్రైలర్ ని విడుదల చేసి ప్రమోషన్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆగస్టు 26న తెలుగులో విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కన్నడ ఒరిజినల్ వెర్షన్ ను హైదరాబాద్ లో నిలిపివేశారు. మరి కన్నడలో  భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.

Also Read : 'భోళాశంకర్' లో చిరు ఆ సీన్ ని ఎలా యాక్సెప్ట్ చేశారబ్బా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget