అన్వేషించండి

Tiger Shroff : దిశా లేదు, దీషా లేదు - టైగర్ సింగిలే, డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ

డేటింగ్ రూమర్స్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్. దీషా ధనుకతో రిలేషన్ షిప్ లో ఉన్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటిపై యువ నటుడు తాజాగా స్పందించాడు.

బాలీవుడ్ యూత్ స్టార్ టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు తెలుగు సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేసి హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అతను... సినిమాలతోనే కాకుండా డేటింగ్ రూమర్స్ తో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు టైగర్ మరోసారి తన వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలిచింది. యువ హీరో ముంబైలోని ఒక ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేసే దీషా ధనుక (Deesha Dhanuka) అనే అమ్మాయితో ఏడాదిన్నర కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై నటుడు తాజాగా స్పందించారు. 

టైగర్ ష్రాఫ్ చాలా కాలంగా హీరోయిన్ దిశా పటానీ (Disha Patani)తో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. 'బాఘీ 2' సినిమాలో కలిసి నటించిన ఈ జంట, రిలేషన్ షిప్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఈ మధ్యనే వీరు బ్రేకప్ చెప్పుకున్నారని, ఆ తర్వాత యాక్టర్ కమ్ మోడల్ ఆకాంక్ష శర్మతో టైగర్ డేటింగ్ చేయడం స్టార్ట్ చేసాడని పుకార్లు వినిపించాయి. అయితే ఇప్పుడు అతని లైఫ్ లోకి మరో దిశా వచ్చిందని.. ఆ అమ్మాయి పేరు దిశా ధనుక అని అంటున్నారు. 

Also Read: అర్థరాత్రి అప్డేట్ - ఇప్పుడిదే ఇండస్ట్రీలో నయా ట్రెండ్, ఎందుకలా?

దిశా పటాని నుండి విడిపోయిన తర్వాత దిశా ధనుకతో టైగర్ డేటింగ్ ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. దీషా ఒక ప్రొడక్షన్ హౌస్‌లో మంచి పొజిషన్‌లో ఉందని.. టైగర్ కుటుంబానికి కూడా ఆమెంటే చాలా ఇష్టమని అంటున్నారు. అతనికి స్క్రిప్ట్ విషయాల్లో సహాయంగా ఉంటోందని, అలాగే అతని ఫిట్‌నెస్‌ విషయాలను కూడా చూసుకుంటోందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన యువ నటుడు, డేటింగ్ రూమర్స్ ను కొట్టిపారేశాడు. తాను గత రెండేళ్లుగా సింగిల్ గానే ఉన్నానని చెప్పాడు. 

పుకార్లపై టైగర్ ష్రాఫ్ స్పందిస్తూ, "కొన్ని నెలల క్రితంగా నాకు వేరొకరితో సంబంధం ఉందని అంటున్నారు. కానీ అది నిజం కాదు, నేను గత రెండు సంవత్సరాలుగా ఒంటరిగా ఉన్నాను'' అని చెప్పినట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు ఈ విషయంపై దీషా ఇప్పటి వరకూ స్పందించలేదు. మరి ఇప్పుడు టైగర్ తన రిలేషన్‌ షిప్ స్టేటస్ ఏంటనేది చెప్పాడు కాబట్టి, దీషాతో డేటింగ్ రూమర్స్ కు బ్రేక్ పడుతుందేమో చూడాలి. 

ఇక సినిమాల విషయానికొస్తే, సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ కొడుకైన టైగర్ ష్రాఫ్.. 'పరుగు' రీమేక్ గా తెరకెక్కిన 'హీరోపంతి' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. పర్ఫెక్ట్ ఫిజిక్ తో, రియల్ స్టంట్స్, అదిరిపోయే డ్యాన్సులతో పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 'వర్షం' రీమేక్ గా 'బాఘీ'.. 'క్షణం' రీమేక్ గా 'బాఘీ 2'.. 'తడాకా' రీమేక్ గా 'బాఘీ 3' సినిమాలు చేసాడు. ఎ ఫ్లయింగ్ జాట్, మున్నా మైఖైల్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, వార్, హీరోపంతి 2 వంటి సినిమాలు అతని ఫిలోగ్రఫీలో ఉన్నాయి. కృతి సనన్‌తో కలిసి టైగర్ నటించిన 'గణపత్' చిత్రం విడుదలకు సిద్ధమైంది. అలానే 'బడే మియాన్ చోటే మియాన్' మూవీలో అక్షయ్ కుమార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. 

Also Read: మన హీరోలు ఏజ్ కు తగ్గ వేషాలు వేయాల్సిన టైమొచ్చిందా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Siddharth Galla Wife: ఎవరీ కిమ్ హెయిన్? మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ పెళ్ళి చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
ఎవరీ కిమ్ హెయిన్? మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ పెళ్ళి చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
Lokesh Kanagaraj DC : హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Poonam Pandey : హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Embed widget