Parasuram Movie: తమిళ హీరో కార్తితో పరుశురామ్ సినిమా, టైటిల్ ఇదేనా?
విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న పరుశురామ్, తమిళ నటుడు కార్తితోనూ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ తాజాగా ఖరారు అయినట్లు తెలుస్తోంది.
గత ఏడాది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’ సినిమా చేశారు దర్శకుడు పరుశురామ్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించింది. ఈ చిత్రం తర్వాత పరుశురామ్ కొంత గ్యాప్ తీసుకున్నారు. విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. పరుశురామ్ ఓ కోలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు కార్తి. తాజాగా చెన్నైకి వెళ్లిన పరుశురామ్ కార్తిని కలిసి స్టోరీ లైన్ చెప్పారట. ఆయనకు కూడా ఈయన చెప్పిన కథ నచ్చిందట. వెంటనే పూర్తి స్క్రిప్ట్ తీసుకుని రావాలని చెప్పారట. ప్రస్తుతం పరుశురామ్ ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారట.
కార్తి-పరుశురామ్ మూవీ టైటిల్ ఫిక్స్!
తాజాగా కార్తి- పరుశురామ్ కాంబోలో వస్తున్న సినిమా పేరు కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘రెంచ్ రాజు’ అనే పేరును ఖరారు చేశారట. అంతేకాదు, ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. మే లేదా జూన్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అటు కార్తి మాత్రం ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ చెయ్యాలి అనే విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదట. అందుకు కారణం ఇప్పుడు ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారట. అవి పూర్తయ్యాకే కార్తి, పరశురాం కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. నిజానికి విజయ్ దేవరకొండతో కలిసి పరుశురామ్ ఓ సినిమాకు కమిట్ అయ్యారు. తాజాగా కార్తి సినిమా తెర మీదకు వచ్చింది. అయితే, విజయ్ దేవరకొండ సినిమా పూర్తయ్యాకే కార్తి సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించే అవకాశం!
వాస్తవానికి పరుశురామ్ ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాలని భావిస్తున్నారట. కార్తికి తమిళ నాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులోనూ ఆయన మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే తెలుగులో ‘ఊపిరి’ అనే సినిమా చేశారు. ఇందులో నాగార్జునతో కలిసి నటించారు. అయితే, ఈ సినిమా పెద్దగా ఆదరణ దక్కించుకోలేదు. కానీ, కార్తి నటనకు మంచి మార్కులే పడ్డాయి. అప్పటి నుంచి కార్తి తెలుగులో మరో స్ట్రెయిట్ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే చాలా కథలు కూడా విన్నారట. తాజాగా పరుశురామ్ చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చిదట. కార్తీ 25వ సినిమాగా ఈ ప్రాజెక్టు ఓకే అయ్యే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్ గా వెల్లడయ్యే అవకాశం ఉంది.
View this post on Instagram
Read Also: నాగార్జున సినిమాలో అల్లరి నరేష్ కాకుండా మరో యంగ్ హీరో?