Krishnam Raju: మంచితనానికి మారుపేరు కృష్ణంరాజు - సినీ ప్రముఖుల నివాళి
రెబల్ స్టార్ కృష్ణంరాజు(83) మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన లేరనే వార్త విని సినీలోకం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసింది- బాలకృష్ణ
‘‘మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసిందని నటుడు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. “సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు చెరగని ముద్ర వేశారన్నారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు కృష్ణంరాజు. కృష్ణంరాజుతో కలసి రెండు చిత్రాలలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. కృష్ణంరాజుతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. కృష్ణరాజు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశాను. ఆయన ఆరోగ్యం గురించి తరచూ తెలుసుకునేవాడిని. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని బాలకృష్ణ తెలిపారు.
Actor, MLA #NandamuriBalakrishna garu expressed his grief on the sudden passing away of Legendary Artist,Rebel star Shri #KrishnamRaju.
— BA Raju's Team (@baraju_SuperHit) September 11, 2022
He further extended his condolences to the Family members. pic.twitter.com/664LnGPTzz
కృష్ణంరాజు మరణ వార్త విని మాటలు రావడం లేదు: మోహన్ బాబు
కృష్ణంరాజు మృతిపట్ల నటుడు మోహన్‌బాబు విచారం వ్యక్తం చేశారు. సోదర సమానుడైన కృష్ణంరాజు మరణవార్త విన్న తర్వాత మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు, నటుడు మంచు మనోజ్ సైతం కృష్ణం రాజు మృతి పట్ల సంతాపం తెలిపారు.
I am at loss of words! #KrishnamRaju my brother.
— Mohan Babu M (@themohanbabu) September 11, 2022
Heartbroken 😔. #KrishnamRaju 😢 Our family has lost our elder. A Legend.
— Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2022
కృష్ణంరాజు మృతి పట్ల ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ విచారం
కృష్ణంరాజు మృతిపట్ల ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ విచారం వ్యక్తం చేశారు. “కృష్ణంరాజుగారి మృతి నిజంగా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. “ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓ లెజెండరీ యాక్టర్ ను కోల్పోయింది” అని కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
Deeply saddened by Krishnam Raju Garu's passing away. I extend my heartfelt condolences to his family. May his soul rest in peace…
— Jr NTR (@tarak9999) September 11, 2022
Extremely saddened to know about the demise of Krishnam Raju garu. Today we have lost a legend of Indian cinema.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) September 11, 2022
My condolences to his family.
చాలా బాధాకరం - మహేశ్బాబు
కృష్ణంరాజు ఇకలేరన్న వార్త తనను షాక్‌కు గురిచేసిందని మహేష్ బాబు అన్నారు. “నిజంగా ఈ రోజు నాకు, చిత్ర పరిశ్రమకు బాధకరమైన రోజు. ఆయన జీవితం, పని చేసిన విధానం, సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని మహేష్ బాబు తెలిపారు.
Shocked to learn that Krishnam Raju garu is no more... A very sad day for me and the entire industry. His life, his work and his immense contribution to cinema will always be remembered. My deepest condolences to Prabhas and the entire family during this difficult time 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) September 11, 2022
మీరు మా హృదయాల్లో జీవించి ఉంటారు- అనుష్క
కృష్ణం రాజు మరణం పట్ల అనుష్క శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన గొప్ప మనసు కలిగిన వ్యక్తి. ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో జీవించే ఉంటారు’’ అని ట్వీట్ చేశారు.
Rest in peace our very own Krishnam raju garu … a legend a soul with the biggest heart ..U will live on in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/hjUs7kyk4d
— Anushka Shetty (@MsAnushkaShetty) September 11, 2022
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు.
అల్లు అర్జున్ సంతాపం
https://twitter.com/alluarjun/status/1568878464220172288?t=V9IhsNX7eUDtYP6S9SsfkA&s=08
Also Read: వాసన చూసి రుచి చెప్పేయొచ్చు, కృష్ణం రాజు చేపల పులుసు తయారీ వీడియో వైరల్!
Also Read : కృష్ణం రాజు ఫంక్షన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన సీనియర్ ఎన్టీఆర్