Jagapathi Babu Mother House: జగపతి బాబు తల్లి సింప్లిసిటీ, కొడుకు ఎంత పెద్ద స్టారైనా చిన్న ఇంట్లోనే నివాసం - ఇదిగో వీడియో
జగపతి పెద్ద స్టార్ అయినా, తన తల్లి మాత్రం చాలా సింపుల్ జీవితాన్ని గడిపేస్తోంది. అందమైన చెట్ల నడుమ పొదరిల్లు లాంటి ఇంట్లో ఆనందంగా ఉంటోంది. శ్రీరామ నవమి వేళ తన తల్లి ఇల్లు చూపించారు జగ్గూ భాయ్!
జగపతి బాబు.. తెలుగు సినిమా పరిశ్రమలోఫ్యామిలీ హీరోగా దశాబ్దానికి పైగా అలరించారు. ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన కెరీర్ లో ఎన్నో చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. కొన్ని సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి కూడా. ప్రస్తుతం విలన్, తండ్రి, వివిధ కీలక పాత్రల్లో నటిస్తూ మరింత మంది అభమానులను సంపాదించుకున్నారు. నిజం చెప్పాలంటే హీరోగా కంటే జగపతి బాబు విలన్ పాత్రల్లోనే జీవించేస్తున్నారు. బాలయ్య నటించిన ‘లెజెండ్’ సినిమాలో తొలిసారి విలన్ పాత్ర చేసి అదరగొట్టారు. ఈ సినిమాలో నటనకు విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తారు. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయడం జగపతి బాబు ప్రత్యేకత. అందుకే, ఇప్పటికీ ఆయనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
తల్లి ఇంటిని పరిచయం చేసిన జగపతి బాబు
ఇక తాజాగా తన తల్లి ఉంటున్న ఇల్లును చూపించి అందరినీ ఆశ్చర్య పరిచారు జగపతి బాబు. జగపతి బాబు ఎంత స్టార్ హీరో అయినా, ఆయన తల్లి మాత్రం చాలా సింపుల్ గా జీవిస్తున్నారు. పెద్ద ఖాళీ స్థలంలో, అందంగా పెరిగిన చెట్ల నడుమ పొదరిల్లు లాంటి ఇంట్లో ఆమె నివాసం ఉంటున్నారు. ఆమె ఇంట్లో దారికి ఇరువైపుల పూల మొక్కలతో ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోంది. మునులు తపస్సు చేసే తపో వనాన్ని తలపిస్తోంది. ఇంట్లో మునీశర్వుడు కూర్చుని తపస్సు చేస్తున్నట్లుగా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ‘నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా’ అని అక్కడ ఉన్న గోడకు రాసి ఉంచారు. ఈ ఇల్లు హైదరాబాద్ నడిబొడ్డులో ఉందని చెప్పిన జగపతి బాబు, ఏ ఏరియాలో ఉంటుందనేది మాత్రం చెప్పలేదు.
View this post on Instagram
తపోవనాన్ని తలపిస్తున్న జగపతి బాబు తల్లి ఇల్లు
శ్రీరామ నవమి సందర్భంగా తన తల్లిని కలవడానికి వచ్చారు జగపతి బాబు. “శ్రీరామ నవమి నాడు మా అమ్మ ఉంటున్న ప్లేస్ కు వచ్చాను. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈ ప్లేస్ అంతా ఒక అడవి లాగా ఉంటుంది. కానీ, హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది. అమ్మ పానకం ఇస్తాను రా అంటే వచ్చాను. పానకం ఒక్కటే సరిపోదు, నూకలతోప కావాలన్నా. ఈ పేరు మీరు విన్నారో లేదో తెలీదు. దాన్ని తిని ఓ పాతిక సంవత్సరాలు అయినట్లుంది. చాలా కాలం తర్వాత అమ్మ చేతితో మంచి భోజనం చేయబోతున్నాను. అమ్మ ఉండే ప్రదేశం ఒకే ఒక్క రూమ్. హ్యాపీగా ఉంటుంది. ఒక యోగి, యోగిని అంటారే, ఆ టైపులో తను సెటిల్ అయిపోయింది. ఓకే బై బై” అంటూ జగపతి బాబు తన తల్లి ఇంటి గురించి పరిచయం చేశారు.
అమ్మని కూడా చూపిస్తే బావుండేది కదా!
అయితే, ఇంటి వరకు తీసుకెళ్లి, తన తల్లిని కూడా చూపిస్తే బాగుండేది అని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తాము కూడా వారి అమ్మగారిని చూసే వాళ్లం కదా అంటున్నారు.
Read Also: రజినీకాంత్ సినిమా వల్లే అక్కడ మూవీ ఛాన్సులు పోయాయి - మనీషా కోయిరాల సంచలన వ్యాఖ్యలు