అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tollywood Updates: 'రాధేశ్యామ్' ట్రోల్స్ పై తమన్ రియాక్షన్, 'ఊ అంటావా' సాంగ్ పై సమంత కామెంట్స్
ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..
![Tollywood Updates: 'రాధేశ్యామ్' ట్రోల్స్ పై తమన్ రియాక్షన్, 'ఊ అంటావా' సాంగ్ పై సమంత కామెంట్స్ Today's Tollywood Latest Updates Tollywood Updates: 'రాధేశ్యామ్' ట్రోల్స్ పై తమన్ రియాక్షన్, 'ఊ అంటావా' సాంగ్ పై సమంత కామెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/11/b92f07d808868b731023bfd26366c552_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'రాధేశ్యామ్' ట్రోల్స్ పై తమన్ రియాక్షన్
'రాధేశ్యామ్' ట్రోల్స్ పై తమన్ రియాక్షన్:
ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమాలో ఎమోషన్స్ లేవని కొందరు.. నేరేషన్ బాగా స్లోగా ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై ఓ మీమ్ వచ్చింది. ఆ మీమ్ ఏంటంటే.. సినిమా చాలా స్లోగా ఉందని అంటే.. లవ్ స్టోరీ అంటే స్లోగా కాకుండా ఫస్ట్ హాఫ్‌లో ఫస్ట్ నైట్ సెకండ్ హాఫ్‌లో సెకండ్ సెటప్ పెట్టాలా ఏంటి..? అని ఉంటుందని. ఈ మీమ్ ని షేర్ చేసిన తమన్ 'స్లో అంట.. నువ్వు పరిగెత్తాల్సింది.. అదిరింది మీమ్' అంటూ కామెంట్ చేశారు.
#BlockBusterRadheShyam 💥💥💥💥💥💥
— thaman S (@MusicThaman) March 11, 2022
Slowwwww antaaaaa … Nuvvvvuuu parrigethaaaalsindhiiiii 🤣🤣🤣🤣
Adhirindhiiiii memmeee !! 🍭🍭🍭🍭🎭🤪 pic.twitter.com/SGW10l5w5h
'ఊ అంటావా' సాంగ్ పై సమంత కామెంట్స్:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. 'ఊ అంటావా మావా' అనే సాంగ్ లో సమంత స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. నేషనల్ వైడ్ గా ఈ సాంగ్ పాపులర్ అయింది. తాజాగా ఈ పాటపై స్పందించింది సమంత. తనను అందరూ ఈ పాటతోనే గుర్తిస్తున్నారని.. తాను ఇంతవరకు చేసిన సినిమాలన్నీ మర్చిపోయారంటూ చెప్పుకొచ్చింది. రీసెంట్ గా జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు కార్యక్రమంలో మాట్లాడిన సమంత.. 'ఊ అంటావా' సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదని.. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండియా వైడ్ ఉన్న వారంతా కూడా తను చేసిన మిగిలిన సినిమాలు మర్చిపోయారంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
న్యూస్
హైదరాబాద్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion