అన్వేషించండి

The Ghost Vs Godfather: మెగాస్టార్‌తో పోటీ - నాగార్జున కావాలనే చేస్తున్నారా?

ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలకు టైం అంత బాలేదు. ఒక్కరికి కూడా సరైన హిట్టు పడడం లేదు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్', అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అక్టోబర్ 5న ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి. చిరు, నాగార్జున మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇద్దరూ సీనియర్ హీరోలే. అయితే ఇప్పుడు వీరిద్దరూ పోటీ పడడానికి రెడీ అవ్వడం చర్చకు దారి తీసింది. 

ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలకు టైం అంత బాలేదు. ఒక్కరికి కూడా సరైన హిట్టు పడడం లేదు. బాలయ్య 'అఖండ' తప్పించి.. సీనియర్ హీరోల సినిమాలు పెద్దగా ఆడింది లేదు. చిరు 'ఆచార్య', నాగార్జున 'వైల్డ్ డాగ్' సినిమాలు ఎంత పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయో తెలిసిందే. ఇలాంటి సమయంలో వీరిద్దరూ పోటీ పడడం అనేది ఆలోచించాల్సిన విషయమే. 

నిజానికి ఇంటర్నల్ గా జరిగిన డిస్కషన్స్ లో నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాను దసరా డేట్ కంటే వారం ముందు విడుదల చేసేలా ప్లాన్ చేశారట. దాంతో మెగాస్టార్ తన 'గాడ్ ఫాదర్' సినిమాకి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఇంతలో 'ది ఘోస్ట్' సినిమా డేట్ మారి.. అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ డేట్ ను హీరో నాగార్జున స్వయంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

ఆ డేట్ తో ఆయనకున్న అనుబంధం ఏమిటనేది తెలియదు కానీ ప్రస్తుతమైతే ఈ రెండు సినిమాలు అక్టోబర్ 5న రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు బెల్లంకొండ చిన్న కొడుకు గణేష్ నటించిన తొలి సినిమా 'స్వాతి ముత్యం' కూడా ఇదే రోజున విడుదల కాబోతుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. మరి ఈ మూడు సినిమాల్లో దేనికి మంచి ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి!

చిరు 'గాడ్ ఫాదర్' సినిమా విషయానికొస్తే.. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కథ ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు. అలానే చిరు, సల్మాన్ ల కాంబినేషన్ లో ఓ పాట కూడా ఉంటుందని తెలుస్తోంది.

మలయాళంలో  సూపర్‌ స్టార్ మోహన్‌లాల్(Mohan lal) నటించిన 'లూసిఫర్'కి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. . పృథ్వీరాజ్ సుకుమారన్  దర్శకత్వంలో తెరకెక్కిన 'లూసిఫర్' చిత్రం భారీగా వసూళ్లను సాధించింది. అదే రేంజిలో ఇక్కడ కూడా సినిమా సక్సెస్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 10 సినిమాలు - శుక్రవారం ఒక్క రోజే 7 మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
ఈ వారం థియేటర్లలోకి 10 సినిమాలు - శుక్రవారం ఒక్క రోజే 7 మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Podarillu Serial Today NoV 9: పెద్ది-మనీషా, కేశవ్‌-శైలూల ముద్దులాట గురించి మహాకు చెప్పిన చక్రి..మీ జీవితంలోకి కూడా మంచి అమ్మాయి వస్తుందన్న మహా
పొదరిల్లు: పెద్ది-మనీషా, కేశవ్‌-శైలూల ముద్దులాట గురించి మహాకు చెప్పిన చక్రి..మీ జీవితంలోకి కూడా మంచి అమ్మాయి వస్తుందన్న మహా
Janhvi Kapoor : ముక్కుకు సర్జరీ... అమ్మ శ్రీదేవి పెట్టిన కండిషన్ - జాన్వీ కపూర్ రియాక్షన్
ముక్కుకు సర్జరీ... అమ్మ శ్రీదేవి పెట్టిన కండిషన్ - జాన్వీ కపూర్ రియాక్షన్
Scene Collections : సూర్య 'సీన్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లో సాలిడ్ వసూళ్లు
సూర్య 'సీన్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లో సాలిడ్ వసూళ్లు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nvidia Jensen Huang Affair: చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
Fertility Centers Scam: అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Embed widget