By: ABP Desam | Updated at : 29 Jan 2023 10:22 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@MythriOfficial/twitter
సినీ నటుడు నందమూరి తారకరత్న హెల్త్ కండీషన్ లో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ ఆయన పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు బెంగళూరు హృదయాలయ హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. తాజాగా ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం తనకు ఎక్మోపై ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు వివరించారు. ఆయనకు చికిత్స అందించేందుకు 10 మంది వైద్యులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. వీరంతా ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
తారక రత్న త్వరగా కోలుకోవాలి- కల్యాణ్ రామ్ ట్వీట్
ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్యం గురించి హీరో నందమూరి కల్యాణ్ రామ్ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. “నా సోదరుడు శ్రీ నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. Get well soon and get back to complete health brother” అంటూ కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
నా సోదరుడు శ్రీ నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను .
Get well soon and get back to complete health brother. — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 28, 2023
అటు తన సోదరుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కల్యాణ్ రామ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం మంచిది కాదరని నిర్ణయించుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అమిగోస్’ వచ్చే నెల(ఫిబ్రవరి 10న) విడదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు మొలయ్యాయి. అందులో భాగంగానే ‘అమిగోస్’ మూవీలోని ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. బాలయ్య సూపర్ హిట్ సాంగ్ అయిన ‘ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదే వెన్నల’ అనే పాటని ఈ సినిమాలో కల్యాణ్ రామ్ రీమేక్ చేశారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. పూర్తి పాటను ఇవాళ(ఆదివారం) సాయంత్రం 5.09 గంటలకు విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.
#Amigos second single #EnnoRatrulosthayi promo out now ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) January 27, 2023
- https://t.co/rNGDCThYbU
Full song on 29th Jan at 5:09 PM ❤️#AmigosOnFeb10th @NANDAMURIKALYAN @AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial #SriVeturi #SpbCharan #SameeraBharadwaj @adityamusic pic.twitter.com/mGDfEcoD4h
‘అమిగోస్’ పాట విడుదల వాయిదా
కానీ, నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కల్యాణ్ రామ్ తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ మైత్ర మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పాట విడుదలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పాటను ఎప్పుడు విడుదల చేస్తారు? అనే విషయాన్ని మాత్రం చిత్ర బృందం ప్రకటించలేదు.
The song launch of #EnnoRatrulosthayi from #Amigos stands postponed to a later date.
— Mythri Movie Makers (@MythriOfficial) January 28, 2023
Praying & Wishing Sri. Taraka Ratna Garu a speedy recovery. pic.twitter.com/UQAKDQTKNU
Read: లోకేష్ కనగరాజ్‌ను ఏ తెలుగు నిర్మాత నమ్మలేదు - ‘విక్రమ్’ దర్శకుడిపై సందీప్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Jagapathi Babu Mother House: జగపతి బాబు తల్లి సింప్లిసిటీ, కొడుకు ఎంత పెద్ద స్టారైనా చిన్న ఇంట్లోనే నివాసం - ఇదిగో వీడియో
Anni Manchi Sakunamule: 'అన్నీ మంచి శకునములే' నుంచి సీతా కళ్యాణం సాంగ్ రిలీజ్
Varun Sandesh Vithika: ఆ సమయంలో మా చేతిలో రూ.5 వేలు కూడా లేవు: వరుణ్ సందేశ్ భార్య వితిక
Manisha Koirala: రజినీకాంత్ సినిమా వల్లే అక్కడ మూవీ ఛాన్సులు పోయాయి - మనీషా కోయిరాల సంచలన వ్యాఖ్యలు
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు
IPL 2023: ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్ ఫొటో! మరి రోహిత్ ఎక్కడా?