అన్వేషించండి

Good Night Movie: నవ్వించే గురక - ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ మూవీ ‘గుడ్ నైట్’, తెలుగులోనూ స్ట్రీమింగ్!

తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘గుడ్ నైట్’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీను తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

Good Night Movie: మనలో చాలా మంది నిద్రపోయేటపుడు గురక(snoring) పెడుతుంటారు. మన పక్కన ఎవరైనా గురక పెడుతూ ఉంటే భలే చికాకుగా అనిపిస్తుంటుంది. కుదిరితే దూరంగా వెళ్తాం లేదంటే చేసేదీమీలేక మనం కూడా వాళ్ల గురకకు అలవాటు పడిపోతాం. ఇది చెప్పుకునేంత పెద్ద సమస్య కాదు అలా అని చిన్నది కూడా కాదు. అలాంటి గురక బ్యాక్డ్రాప్ లోనే సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు గురక మీద ఎలా సినిమా తీస్తారు అనేగా మీ సందేహం. అయితే తమిళంలో తెరకెక్కిన ‘గుడ్ నైట్’ సినిమాను చూడాల్సిందే. గురక సమస్య ఉన్న ఓ వ్యక్తి కథే ఈ సినిమా. ఈ మూవీను తమిళ దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ తెరెక్కించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో తెలుగులోకి కూడా అందుబాటులోకి రానుంది. 

ఓటీటీలో తమిళం సూపర్ హిట్ మూవీ ‘గుడ్ నైట్’..

నిత్య జీవితంలో మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిల్లోంచే ఓ చిన్న అంశాన్ని తీసుకొని దాన్ని కథలా మార్చి రెండున్నర గంటల సినిమా తీసి హిట్ కొడుతున్నారు కొంతమంది టాలెంటెడ్ దర్శకులు. సినిమాలో కంటెంట్ ఉండాలే గానీ దాన్ని హిట్ చేయడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ మధ్య కాలంలో అన్ని భాషల్లోనూ ఇలాంటి సినిమాలు చాలానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గురక అనే చిన్న సమస్యను తీసుకొని దానికి ఇంట్రస్టింగ్ రైటింగ్ ను జతచేసి సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు గతంలో కూడా చాలా వచ్చాయి. గతేడాది తమిళంలో వచ్చిన ‘లవ్ టుడే’ సినిమా, మలయాళం లో వచ్చిన ‘రోమాంచమ్’ ఇవన్నీ ఇలాంటి కేటగిరీలోనివే తెలుగులో కూడా మారుతి లాంటి దర్శకులు నిత్య జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలను తీసుకొని పలు సినిమాలు తీసి హిట్ అందుకున్నారు కూడా. ఆ కోవలోకే ఇప్పుడు ఈ ‘గుడ్ నైట్’ సినిమా కూడా వచ్చి చేరనుంది. ఈ మూవీను జూలై 3 నుంచి తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

‘గుడ్ నైట్’ కథేంటంటే..

ఈ సినిమాలో హీరో కు గురక సమస్య ఉంటుంది. తన అక్కాబావతో కలసి ఉంటాడు. అయితే తనకున్న గురక సమస్య వల్ల నిత్యం ఎవరొకరితో తిట్లు తింటూనే ఉంటాడు. అయినా లైఫ్ ను అలా నెట్టుకుంటూ వస్తాడు. తర్వాత కొన్నాళ్లకు హీరోయిన్ పరిచయం అవుతుంది.  ఆమెతో పరిచయం కాస్త స్నేహంగా తర్వాత ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. తనకు గురక సమస్య ఉందనే విషయం ముందునుంచీ హీరోయిన్ దగ్గర దాస్తూవస్తాడు. పెళ్లి తర్వాత అసలు విషయం బయటపడుతుంది. గురక వల్ల వారి మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. భర్త సమస్యను భార్య అర్థం చేసుకుందా లేదా తర్వాత ఏం జరిగింది? అనేదే సినిమా.  ఈ మూవీలో మణికందన్, మీరా రఘునాథ్ హీరో, హీరోయిన్లుగా చేశారు. రమేష్ తిలక్, రాయచల్ రెబెక్కా, బాలాజీ శక్తివేల్, మరియు భగవతి పెరుమాళ్ కీలక పాత్రలు పోషించారు. యువరాజ్ గణేశన్, మగేష్ రాజ్ పసిలియన్, నజెరత్ పసిలియన్ సంయుక్తంగా నిర్మించారు.

Also Read: ‘లియో’ ఫస్ట్ లుక్ - సుత్తితో పళ్లు రాలగొట్టేంత కసి, డెవిల్‌ను తలపిస్తున్న విజయ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ కారు నెంబర్‌తో మరో కారు - ఎలా గుర్తించారంటే !
కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ కారు నెంబర్‌తో మరో కారు - ఎలా గుర్తించారంటే !
AP Intelligence Alert :    ఏపీలో హై అలర్ట్ - కౌంటింగ్ తర్వాత కూడా కేంద్ర బలగాల పహారా
ఏపీలో హై అలర్ట్ - కౌంటింగ్ తర్వాత కూడా కేంద్ర బలగాల పహారా
Vijayawada News: విద్యుత్ షాక్ తో కుప్పకూలిన ఆరేళ్ల బాలుడు - రహదారిపైనే సీపీఆర్ చేసి కాపాడిన వైద్యురాలు, సర్వత్రా ప్రశంసలు
విద్యుత్ షాక్ తో కుప్పకూలిన ఆరేళ్ల బాలుడు - రహదారిపైనే సీపీఆర్ చేసి కాపాడిన వైద్యురాలు, సర్వత్రా ప్రశంసలు
Rashmika Mandanna: బీజేపీకి సౌత్ స్టార్ దొరికిందా? రష్మిక మరో కంగనా అవుతుందా - ప్రమోషన్ వీడియోతో ఆసక్తికర చర్చ
Rashmika Mandanna: బీజేపీకి సౌత్ స్టార్ దొరికిందా? రష్మిక మరో కంగనా అవుతుందా - ప్రమోషన్ వీడియోతో ఆసక్తికర చర్చ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Jr NTR Jaggannapeta Temple | కోనసీమలో ఎన్టీఆర్ కట్టించిన గుడి ఇదే | ABP DesamPrabhas Tweet on Marriage | ఇన్ స్టా లో ఆసక్తికర పోస్టు పెట్టిన ప్రభాస్ | ABP DesamJr NTR At High court | తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హీరో ఎన్టీఆర్ | ABP DesamCSK Top 2 Scenario IPL 2024 Playoffs | చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 2 లో ప్లే ఆఫ్స్ ఆడాలంటే.! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ కారు నెంబర్‌తో మరో కారు - ఎలా గుర్తించారంటే !
కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ కారు నెంబర్‌తో మరో కారు - ఎలా గుర్తించారంటే !
AP Intelligence Alert :    ఏపీలో హై అలర్ట్ - కౌంటింగ్ తర్వాత కూడా కేంద్ర బలగాల పహారా
ఏపీలో హై అలర్ట్ - కౌంటింగ్ తర్వాత కూడా కేంద్ర బలగాల పహారా
Vijayawada News: విద్యుత్ షాక్ తో కుప్పకూలిన ఆరేళ్ల బాలుడు - రహదారిపైనే సీపీఆర్ చేసి కాపాడిన వైద్యురాలు, సర్వత్రా ప్రశంసలు
విద్యుత్ షాక్ తో కుప్పకూలిన ఆరేళ్ల బాలుడు - రహదారిపైనే సీపీఆర్ చేసి కాపాడిన వైద్యురాలు, సర్వత్రా ప్రశంసలు
Rashmika Mandanna: బీజేపీకి సౌత్ స్టార్ దొరికిందా? రష్మిక మరో కంగనా అవుతుందా - ప్రమోషన్ వీడియోతో ఆసక్తికర చర్చ
Rashmika Mandanna: బీజేపీకి సౌత్ స్టార్ దొరికిందా? రష్మిక మరో కంగనా అవుతుందా - ప్రమోషన్ వీడియోతో ఆసక్తికర చర్చ
Hyderabad News: హైదరాబాద్‌లో తగ్గని రియల్‌ ఎస్టేట్ బూమ్‌- డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం చూసే వాళ్లకు షాకింగ్ న్యూస్!
హైదరాబాద్‌లో తగ్గని రియల్‌ ఎస్టేట్ బూమ్‌- డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం చూసే వాళ్లకు షాకింగ్ న్యూస్!
Vijayashanti For BRS : బీఆర్ఎస్‌కు సపోర్టుగా విజయశాంతి - మారిన రాములమ్మ రాజకీయం
బీఆర్ఎస్‌కు సపోర్టుగా విజయశాంతి - మారిన రాములమ్మ రాజకీయం
PM Modi: బుల్‌డోజర్‌ ఎక్కడ వాడాలో యోగిని చూసి నేర్చుకోండి, ప్రతిపక్షాలపై మోదీ సెటైర్లు
PM Modi: బుల్‌డోజర్‌ ఎక్కడ వాడాలో యోగిని చూసి నేర్చుకోండి, ప్రతిపక్షాలపై మోదీ సెటైర్లు
Prabhas Instagram Story : ప్రభాస్ లైఫ్​లోకి కొత్త వ్యక్తి - హాట్ టాపిక్‌గా మారిన హీరో ఇన్‌స్టా స్టోరీ.. పెళ్లి గురించేనా?
ప్రభాస్ లైఫ్​లోకి కొత్త వ్యక్తి - హాట్ టాపిక్‌గా మారిన హీరో ఇన్‌స్టా స్టోరీ.. పెళ్లి గురించేనా?
Embed widget