PSPK In Unstoppable 2 : కొడుతూ ఉన్నా, చేతి నిండా రక్తమే - నవ్వుతూ బాధ బయటపెట్టిన పవన్
పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన 'అన్‌స్టాపబుల్ 2' ఎపిసోడ్ ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కొన్ని గంటలు... మరికొన్ని గంటలు మాత్రమే... నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' రెండో సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ కావడానికి! జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అతిథిగా వచ్చిన ఎపిసోడ్‌తో రెండో సీజన్‌కు ఎండ్ కార్డు వేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని రెండు భాగాలుగా వీక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
ఫిబ్రవరి 2... అనగా ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి పవర్ ఫైనల్ ఎపిసోడ్ ఫస్ట్ స్ట్రీమింగ్ కానుంది. ఆల్రెడీ దీనిపై బోలెడు హైప్ ఉంది. అందుకు ఆహా టీమ్ కూడా రెడీగా ఉంది. సర్వర్లు క్రాష్ కాకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొంది. అది పక్కన పెడితే... పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో ఒక్కొక్కటీ వస్తుంటే, ఎపిసోడ్ మీద అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి.
రిస్కీ స్టంట్స్...
చేతి నిండా రక్తం!
పవర్ ఫైనల్ విడుదలకు కొన్ని గంటల ముందు ఆహా టీమ్ కొత్త ప్రోమో విడుదల చేసింది. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి 'తమ్ముడు', 'బద్రి', 'తొలి ప్రేమ' చెబుతూ వస్తే చాలా సినిమాల్లో పవన్ సొంతగా స్టంట్స్ చేశారు. వాటి గురించి బాలకృష్ణ అడిగారు. అదీ సరదాగా! ఆ ఫైట్స్ చేసింది డూప్ అంట కదా!
Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?
పవన్ కళ్యాణ్ స్టంట్ చేసేటప్పుడు తనకు అయిన గాయం గురించి చెప్పారు. ''స్తంభాన్ని కొట్టాలి. గట్టిగా రక్తం వస్తుంది. షాట్ చేసేశా! అది అయిన తర్వాత దర్శకుడు ఎవరో రమ్మను'' అని చెప్పానని పవన్ నవ్వేశారు. ముఖంపై చిరునవ్వుతో తన బాధను బయట పెట్టారు. ఆయనతో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ ఎపిసోడ్ లో సందడి చేయనున్నారు.
Also Read : ఎవరీ ఆషిక? నందమూరి నయా నాయిక గురించి ఆసక్తికరమైన విషయాలు...
పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వీడియో గ్లింప్స్‌లో ''నేను కొన్ని మెజర్‌మెంట్స్ (కొలతలు) తీసుకోవాలి'' అని బాలకృష్ణ అంటే పవన్ కళ్యాణ్ నవ్వేశారు. ఇక, 'అన్‌స్టాపబుల్ 2' టీజర్ విషయానికి వస్తే... తనను 'బాల' అని పిలవమని పవన్ కళ్యాణ్ అడగడం... అందుకు పవన్ ''నేను ఓడిపోవడానికి సిద్ధం కానీ పిలవలేను'' అని పవన్ అనడం వైరల్ అయ్యింది. అభిమానులు ఎందుకు ఓట్లు వేయడం లేదనే అంశాన్ని కూడా బాలకృష్ణ అడిగారు.
ట్రైలర్ విషయానికి వస్తే... బండ్ల గణేష్ డైలాగ్ బాలకృష్ణ నోటి వెంట రావడం... బాలయ్య టాక్ షో ట్రేడ్ మార్క్ డైలాగ్ పవన్ నోటి వెంట రావడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్రివిక్రమ్ ఫ్రెండ్షిప్ గురించి అడిగితే చేయాల్సి వచ్చిందని, రామ్ చరణ్ ఆలనా పాలనా చూస్తూ క్లోజ్ అవ్వాల్సి వచ్చిందని పవన్ చెప్పుకొచ్చారు. 'అమ్మాయిలు, హారర్ సినిమాలు ఒక్కటే' అని సాయి తేజ్ చెప్పడం, ఇంటికి వెళ్ళిన తర్వాత బడిత పూజ ఉంటుందని పవన్ చెప్పడం అభిమానులను ఆకట్టుకున్నాయి.
రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి!
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఏయే టాపిక్స్ గురించి 'అన్‌స్టాపబుల్ 2'లో మాట్లాడారు? అని సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదు... రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'అన్‌స్టాపబుల్ 2' ఎపిసోడ్ గురించి వైసీపీ కూడా ఎదురు చూస్తోంది.