By: ABP Desam | Updated at : 15 Nov 2022 06:22 AM (IST)
Edited By: Suresh Chelluboyina
Krishna Health Update
తీవ్ర అస్వస్థతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సూపర్ స్టార్ కృష్ణ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నారని, ఉదయం నుంచి ఆయన అపస్మారక స్థితిలోనే ఉన్నారని వెల్లడించారు. 8 మంది డాక్టర్లు ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కృష్ణ కుటుంబ సభ్యులు ప్రైవేట్ రూమ్‌లో ఉన్నారని, మధ్య మధ్యలో ఆయన్ని చూసి వెళ్తున్నారన్నారని డాక్టర్ గురునాథ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఇంకా క్రిటికల్ స్టేజ్‌లోనే ఉన్నారని తప్పా.. ఇంకా ఇప్పుడేమీ చెప్పలేమని అన్నారు. కృష్ణ మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయని తెలిపారు. తమ హాస్పిటల్‌లో దగ్గర అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. కృష్ణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స్ పొందుతున్నారు.
కృష్ణ తీవ్ర అస్వస్థతో హాస్పిటల్‌లో చేరారనే వార్త తెలిసిన సమయం నుంచి హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆందోళనకర పరిస్థితులు కనిపించాయి. కృష్ణ కుటుంబ సభ్యులు, సన్నిహితులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అభిమానులు కూడా హాస్పిటల్ ముందు నిలుచొని కృష్ణ పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ఏడాది కృష్ణ కుటుంబంలో వరుసగా రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. కృష్ణ కుమారుడు రమేష్ బాబు మరణం, ఆ తర్వాత కృష్ణ భార్య ఇందిరా చనిపోవడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఇంతలోనే కృష్ణ తీవ్ర అస్వస్థతో ఆస్పత్రిపాలు కావడంతో ఘట్టమనేని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇంకా విషమంగానే కృష్ణ ఆరోగ్యం, 48 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేం: నరేష్
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై ఆయన కుమారుడు నరేష్ స్పందించారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన నరేష్ మీడియాకు పలు వివరాలు తెలియజేశారు. ‘‘నాన్నగారి పరిస్థితి నిలకడగా ఉంది. 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేం. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. కాస్త శ్వాస తీసుకుంటున్నారు. నాన్నగారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే వ్యక్తి. ఆయనకు ఎటువంటి ఆయనకు అనారోగ్య సమస్యలు లేవు. రియల్ లైఫ్, రీల్ లైఫ్‌లో రెండు కూడా డేరింగ్ డ్యాషింగ్ ఆయన. ఆయన ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్నారు. ఇండస్ట్రీ లో ఒక రెవల్యూషన్ ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ప్రాణాల కోసం ఫైట్ చేస్తున్నారు. త్వరగా కొలుకుంటారని ఆశిస్తున్నాం. మీ అందరి ప్రార్ధనలే కృష్ణ గారిని కాపాడుతాయి’’ అని తెలిపారు.
కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు ఐదుగురు సంతానం. పెద్దమ్మాయి పద్మావతిని గల్లా జయదేవ్‌కు ఇచ్చి వివాహం చేశారు. రెండో అమ్మాయి మంజుల నటిగా, నిర్మాతగా ప్రేక్షకులకు తెలుసు. ఆమె భర్త సంజయ్ స్వరూప్ నటుడు. మూడో అమ్మాయి ప్రియదర్శిని యువ హీరో సుధీర్ బాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ సోదరుడు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేశారు. ఇక, మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో సూపర్ స్టార్‌గా, తండ్రి తగ్గ తనయుడిగా స్టార్ డమ్ కొనసాగిస్తున్నారు. మే 31న కృష్ణ బర్త్ డే. ఆ రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. అందరితో కలిసి భోజనం చేశారు. కృష్ణ బర్త్ డే స్పెషల్ గా ఆయన్ను కుమార్తె మంజుల ఇంటర్వ్యూ చేశారు.
Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్
Skanda Overseas Reviews : ఓవర్సీస్ ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టిన 'స్కంద' టీమ్
Harish Shankar: విడాకులపై స్వాతి జవాబుకు హరీష్ శంకర్ ఫిదా - శభాష్ అంటూ ప్రశంసలు
మరో మూవీ నుంచి శ్రీలీలా ఔట్? ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
‘మాయ మశ్చింద్ర’ ట్రైలర్ వచ్చేసింది, ‘ఈగల్’ వాలేది అప్పుడే - ఈ రోజు టాప్ 5 మూవీ న్యూస్ ఇదే!
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం
Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్
ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !
Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !
/body>