అన్వేషించండి

SSMB28: రూ.280 కోట్ల టార్గెట్ - త్రివిక్రమ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

SSMB28 టీమ్ ఇప్పటినుంచే సినిమా బిజినెస్ వ్యవహారాలపై నిర్మాతలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమయ్యారు. రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా (SSMB 28 Movie) ఇది.
 
ఈ సినిమాలో సరికొత్త లుక్ తో కనిపించబోతున్నారు మహేష్ బాబు. చాలా ఏళ్ల తరువాత త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమా మార్కెట్ డీల్స్ ఏవీ ఇంకా ఫైనల్ కాలేదు. అన్నీ డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్నాయి. ప్రస్తుతానికైతే కేవలం తెలుగు వెర్షన్ ను మాత్రమే రెడీ చేసే ఆలోచనలో ఉన్నారు. రిలీజ్ టైంకి హిందీ వెర్షన్ ఉంటుంది. 
 
అయితే ఇప్పటినుంచే సినిమా బిజినెస్ వ్యవహారాలపై నిర్మాతలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ రైట్స్ కోసం నిర్మాతలు రూ.23 కోట్లు కోట్ చేస్తున్నట్లు సమాచారం. అది కాకుండా.. సౌత్ లో నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్ కోసం రూ.100 కోట్లు అడుగుతున్నారట. వీటితో పాటు ప్రముఖ ఓటీటీ సంస్థతో డిజిటల్ రైట్స్ కోసం చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతానికైతే హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ కి సంబంధించిన బేరాలు నడిపించడం లేదు. 
 
ఎందుకంటే హిందీ వెర్షన్ ఉంటుందా..? ఉండదా..? అనే విషయంలో క్లారిటీ వస్తేనే ఆ లెక్కలు తేలుతాయి. నైజాంలో సినిమా హక్కులు రూ.45 కోట్ల రేంజ్ లో ఉంటాయట. ఆంధ్రలో రూ.50 కోట్లు, సీడెడ్ లో రూ.20 కోట్ల రేంజ్ లో అమ్మాలని చూస్తున్నారు. ఇవన్నీ ఫిక్స్ అయితే రూ.140 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ మీద, మరో రూ.140 కోట్ల నాన్ థియేట్రికల్ రైట్స్ మీద దక్కించుకోవాలని చూస్తున్నారు నిర్మాతలు. 
 
ఎలాగో బేరాలు ఉంటాయి కాబట్టి అటు ఇటు చూసుకున్నా.. ఈ సినిమాతో రూ.250 నుంచి రూ.280 కోట్ల బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఆ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో లేదో చూడాలి!
 
తొలిసారి ఈ సినిమా కోసం తనకు అచొచ్చిన ఫ్యామిలీ డ్రామాను పక్కన పెడుతున్నారు త్రివిక్రమ్. పూర్తిగా యాక్షన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సీన్ ఈ సినిమాలో కనిపించవట. నిజానికి త్రివిక్రమ్ ఫ్యామిలీ సబ్జెక్టు రాసుకున్నప్పటికీ.. మహేష్ మాత్రం యాక్షన్ పై దృష్టి పెట్టమని అడిగారట. దీంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో కీలకమార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఆలస్యమైందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ కి 'A' అనే అక్షరం చాలా సెంటిమెంట్. అందుకే ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అదే లెటర్ తో మొదలయ్యే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. కథకు కూడా 'అర్జునుడు' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.
 

టాప్ హెడ్ లైన్స్

Crazy Kalyanam Trailer : పెళ్లిళ్లు చేసుకున్నా లేకున్నా పిల్లల్ని మాత్రం కనండి - లివింగ్ టు గెదర్ అఫీషియల్... సీనియర్ నటుడు నరేష్ రియాక్షన్
పెళ్లిళ్లు చేసుకున్నా లేకున్నా పిల్లల్ని మాత్రం కనండి - లివింగ్ టు గెదర్ అఫీషియల్... సీనియర్ నటుడు నరేష్ రియాక్షన్
Nindu Noorella Saavasam Serial Today October 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వైజయంతి – ఎమోషనల్ అయినట్టు నటించిన మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వైజయంతి – ఎమోషనల్ అయినట్టు నటించిన మనోహరి  
Brahmamudi Serial Today October 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ పెళ్లి ఫిక్స్‌ - కండీషన్‌ పెట్టిన ఐశ్వర్య
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ పెళ్లి ఫిక్స్‌ - కండీషన్‌ పెట్టిన ఐశ్వర్య
Karthika Deepam 2 Serial Today October 12th: కార్తీకదీపం 2 సీరియల్: తల్లి కోసం దీప, జ్యోత్స్నలకు 15 కోట్లు ఆఫర్ చేసిన సూరజ్! జ్యోత్స్న ఏమైనట్లు?
కార్తీకదీపం 2 సీరియల్: తల్లి కోసం దీప, జ్యోత్స్నలకు 15 కోట్లు ఆఫర్ చేసిన సూరజ్! జ్యోత్స్న ఏమైనట్లు?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Embed widget