Game Changer First Look: స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్, ఇరగదీసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్
మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా పేరును ‘గేమ్ చేంజర్’ గా ఖరారు చేయగా తాజాగా మూవీలో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ తో కలసి ఓ భారీ ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటి వరకూ ‘ఆర్ సి 15’ పేరుతో షూటింగ్ పనులు జరుగుతున్నాయి. మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు అభిమానులు. అయితే చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయని అందరూ ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్టుగానే చరణ్ బర్త్ డే సందర్బంగా శంకర్-చరణ్ కాంబో మూవీ అప్డేట్స్ ను విడుదల చేశారు మేకర్స్. చెర్రీ బర్త్‌డే నేపథ్యంలో ఇప్పటికే ఈ మూవీకు ‘గేమ్ చేంజర్’ టైటిల్‌ను ప్రకటించారు. సాయంత్రం మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూస్తుంటే ఇందులో రామ్ చరణ్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఆ హెయిర్ స్టైల్, బైక్ మీద కూర్చున్న విధానం, చేతికి స్టైల్ వాచ్ ఇవన్నీ చూస్తుంటే ఈ మూవీలో సరికొత్త లుక్ తో చరణ్ మళ్లీ కొత్త ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తున్నారు చెర్రీ. అంతే కాకుండా ఈ పోస్టర్ లో చరణ్ చాలా సీరియస్ గా కనిపిస్తున్నారు. చూస్తుంటే యాక్షన్ సీన్ కు సంబంధించిన చిత్రంలా ఉంది. మొత్తానికి ఈ పోస్టర్ చూస్తే రామ్ చరణ్ మరో సరికొత్త సంచలనానికి శ్రీకారం చుడుతున్నట్లు కనిపింస్తోంది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దానితో పాటు చిన్న నోట్ ను కూడా రాసుకొచ్చారాయన. ‘‘ఇంత కంటే గొప్పగా బర్త్ డే గిఫ్ట్ ఎవరు ఇవ్వగలరు, నేను ఇంతకంటే ఇంకేమి అడగలేను’’ అంటూ రామ్ చరణ్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పై స్పందించారు.
ఇక ఈ సినిమా కథను కార్తీక్ సుబ్బరాజు అందించిన విషయం తెలసిందే. ఆయన సినిమాల్లో బలమైన స్టోరీ ఉంటుంది. అలాగే ఈ కథలో కూడా ఎన్నో బలమైన ఎలిమెంట్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు మెగా అభిమానులు. ఇక అలాంటి కథ దర్శకుడు శంకర్ చేతిలో పడితే ఆ విజన్ ను ఊహించుకుంటేనే గూస్ బంబ్స్ వస్తాయి. శంకర్ సినిమాల్లో హీరో పాత్రలు ఎంత బలంగా ఉంటాయో తెలిసిందే. అలాగే ఆయన సినిమాలు ఆన్నీ ఏదొక మెసేజ్ ను కూడా ఇస్తాయి, ఆలోచించేలా చేస్తాయి. అందుకే ఆయన సినిమాలంటే అంత క్రేజ్. ఇప్పటికే రామ్ చరణ్ కు గ్లోబల్ స్థాయి గుర్తింపు వచ్చింది. ఇది ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ లానే కనిపిస్తోంది. అందుకే ఈ మూవీ టైటిల్ ను కూడా అంతర్జాతీయ స్థాయిలో ‘గేమ్ చేంజర్’ అని పెట్టినట్టు సమాచారం. దీంతో రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్, శంకర్ ఇంటర్నేషనల్ విజన్ లు కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియార అద్వానీ నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు భారీ స్థాయిలో మూవీను నిర్మిస్తున్నారు.
Read Also: గ్లోబల్ స్టార్ కు సూపర్ డూపర్ విషెస్, చెర్రీకి మంచు మనోజ్ బర్త్ డే శుభాకాంక్షలు!
I couldn’t have asked for a better birthday gift !! #GameChanger
— Ram Charan (@AlwaysRamCharan) March 27, 2023
Thank you @shankarshanmugh sir!! @SVC_official @advani_kiara @DOP_Tirru @MusicThaman pic.twitter.com/V3j7svhut0