By: ABP Desam | Updated at : 06 Jan 2023 05:40 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Ram Pothineni, Sreeleela/Instagram
టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరికొత్త మాస్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ మూవీలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా చేస్తున్నారు. హీరోయిన్ గా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ యాక్షన్ చిత్రంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ సినిమాపై ముందు నుంచీ ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ మూవీకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇటీవల సినిమా షూటింగ్ లో నటి శ్రీలీల కూడా జాయిన్ అయింది. రామ్, శ్రీలీల పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట దర్శకుడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో రామ్, శ్రీలీల జంట సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
బోయపాటి శ్రీను సినిమా అంటే అందులో హీరో క్యారెక్టర్ ఎంత మాస్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్షన్స్ సీన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఈ సినిమాను కూడా బోయపాటి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా చాలా జాగ్రత్తగా షూటింగ్ చేస్తున్నాడట. ఇందులో హీరో రామ్ కూడా పక్కా మాస్ గెటప్ లో కనిపించనున్నాడని టాక్. ప్రస్తుతానికి బోయపాటి శ్రీను మంచి ఫామ్ లో ఉన్నాడు. గతేడాది నందమూరి బాలకృష్ణ హీరోగా ‘అఖండ’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత రామ్ పోతినేని తో ఓ పవర్ ఫుల్ సినిమాను పట్టాలెక్కించాడు బోయపాటి. ఈ సినిమా కోసం అంత్యంత నైపుణ్యం గల సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారట.
Also Read: తారక్‌కు అరుదైన గుర్తింపు, ఆస్కార్ టాప్-10 బెస్ట్ యాక్టర్స్‌లో చోటుకు ఆస్కారం!
ఇక హీరో రామ్ రీసెంట్ గా ‘వారియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో హీరో రామ్ ఆశలన్నీ బోయపాటి సినిమా మీదే పెట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది అనడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. దానికి తోడు ఆమె ఇటీవల నటించిన ‘ధమాకా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ అమ్మడి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. హీరోయిన్ గా ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ బోయపాటి, రామ్ సినిమా షూటింగ్ లో చేరింది. ఈ క్రేజీ కాంబో తో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది
అలాగే ప్రస్తుతం అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బోయపాటి, రామ్ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయడానికి చూస్తున్నారు మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ లో ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. హిందీతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషలలో ఈ మూవీను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Naga Panchami December 8th Episode విభూది దాటొద్దని మోక్షకు కండీషన్.. వీడ్కోలు చెప్పేసి తన చితి తానే పేర్చుకున్న పంచమి!
Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
/body>