Spy Trailer: ‘స్వాత్రంత్ర్యం ఒకడిచ్చేది కాదు మనం లాక్కునేది’ - స్పై ట్రైలర్ చూశారా?
నిఖిల్ ‘స్పై’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో రిలీజ్ అయింది.
![Spy Trailer: ‘స్వాత్రంత్ర్యం ఒకడిచ్చేది కాదు మనం లాక్కునేది’ - స్పై ట్రైలర్ చూశారా? Spy Movie Trailer Released Online Starring Nikhil Ishwarya Menon Directed By Garry BH Spy Trailer: ‘స్వాత్రంత్ర్యం ఒకడిచ్చేది కాదు మనం లాక్కునేది’ - స్పై ట్రైలర్ చూశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/07/852a2f1082e9da97ad345491cad935cc1680843275417544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నిఖిల్ నటిస్తున్న ఇంట్రస్టింగ్ సినిమా ‘స్పై’. జూన్ 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పుడు గురువారం సాయంత్రం ‘స్పై’ ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. పూర్తిగా యాక్షన్ ప్యాక్డ్‌గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్ నిండిపోయింది. ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేలా ట్రైలర్‌ను కట్ చేశారు.
ట్రైలర్‌లో ఏం ఉంది?
‘చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు. దాస్తుంది. దానికి సమాధానం మనమే వెతకాలి.’ అంటూ మకరంద్ దేశ్‌పాండే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. వెంటనే‘ఖాదిర్‌ను చంపామని ప్రపంచానికి చెప్పాం. కానీ వాడింకా బతికే ఉన్నాడు. ఎలా?’ అంటూ సచిన్ ఖేడ్కర్ అడుగుతాడు. అఖండ సినిమాలో విలన్ పాత్రలో నటించిన నితిన్ మెహతా ఈ ఖాదిర్ పాత్రలో కనిపించారు.
నేతాజీ ఫైల్స్ ఖాదిర్ అనే టెర్రరిస్టుకి దొరకడం, వాటిని అతను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించి, స్పై అయిన నిఖిల్ దాన్ని ఆపడానికి ప్రయత్నించడంలో ఈ సినిమా సాగనుందని ట్రైలర్‌ను బట్టి అర్థం అవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ఎన్నో దేశాల్లో ఈ సినిమా చిత్రీకరించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో రివెంజ్ యాంగిల్ కూడా ఉంది. నిఖిల్ అన్నయ్య సుభాష్ పాత్రలో ఆర్యన్ రాజేష్ కనిపించారు. అన్నయ్య చావుకి ప్రతీకారం తీర్చుకునే తమ్ముడి పాత్రలో నిఖిల్ సిద్థార్థ్‌ను చూడవచ్చు. ట్రైలర్ చివర్లో రానా క్యామియోను చూపించారు. ‘స్వాతంత్ర్యం అంటే ఒకడిచ్చేది కాదు. మనం లాక్కునేది. ఇది చెప్పింది నేను కాదు... నేతాజీ.’ అనే డైలాగ్ రానా గొంతులో వినవచ్చు. ఓవరాల్‌గా ట్రైలర్‌ను మంచి యాక్షన్ ప్యాక్డ్‌గా కట్ చేశారు.
స్వాత్యంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యం ఆధారంగా ఈ మూవీను తెరకెక్కించినట్టు చెప్పడంతో మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. సినిమా యూనిట్ ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
‘స్పై’ మూవీను గతంలోనే జూన్ 29వ తేదీన విడుదల చేస్తారని ప్రకటించారు. అయితే తర్వాత రిలీజ్ చేసిన టీజర్‌లో మూవీ రిలీజ్ డేట్‌ను వేయలేదు. దీంతో అందరూ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని ఫిక్స్ అయిపోయారు. కానీ హీరో నిఖిల్ గానీ మూవీ టీమ్ గాని దీని గురించి ఎక్కడా మాట్లాడలేదు. దీంతో నిజంగానే మూవీ వాయిదా పడింది అని కన్ఫర్మ్ చేసుకున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లో మళ్లీ మూవీ రిలీజ్ డేట్ ను జూన్ 29వ తేదీ అని వేసి ఫిక్స్ చేశారు. హీరో సిద్ధార్థ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పుడు మరింత క్వాలిటీగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
Here is the Theatrical Trailer of #SPY
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 22, 2023
A cinema that we have made with Most Respect and Care 🙏🏽 #IndiasBestKeptSecret is about to unfold! #Netaji #SubhasChandraBose
▶️https://t.co/sSpORJY6UL pic.twitter.com/G3vqIL0BDv
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)