SPY Movie First Look: నిఖిల్ పాన్ ఇండియా సినిమా - డైరెక్టర్ ఎవరంటే?
గతంలో 'గూఢచారి', 'హిట్', 'ఎవరు' వంటి సినిమాలకు ఎడిటర్ గా పని చేసిన గ్యారీ బిహెచ్ ఇప్పుడు దర్శకుడిగా సినిమా చేస్తున్నారు. ఇందులో నిఖిల్ ను హీరోగా తీసుకున్నారు
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోలు చాలా మంది పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశారు. ఈ క్రమంలో వాళ్లు నటిస్తోన్న సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు. చాలా మంది స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఆయన మరెవరో కాదు.. హీరో నిఖిల్. తన కొత్త సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
గతంలో 'గూఢచారి', 'హిట్', 'ఎవరు' వంటి సినిమాలకు ఎడిటర్ గా పని చేసిన గ్యారీ బిహెచ్ ఇప్పుడు దర్శకుడిగా సినిమా చేస్తున్నారు. ఇందులో నిఖిల్ ను హీరోగా తీసుకున్నారు. ఈ సినిమాకి 'స్పై' అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ.. తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ నిఖిల్ లుక్ చాలా ఇంటెన్సివ్ గా ఉంది. బుల్లెట్స్ మధ్య నుంచి హీరో నిఖిల్ చాలా స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్నారు. ఆయన చేతిలో గన్ కూడా ఉంది.
ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజ శేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 'స్పై' సినిమా విడుదల కానుంది. మరి నిఖిల్ కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వస్తుందో లేదో చూడాలి!
Also Read: సెట్స్ లో చూసుకుందాం - రామ్ చరణ్ కి చిరు వార్నింగ్
Also Read: 'ఆచార్య' ప్రీరిలీజ్ ఈవెంట్ - ఎప్పుడు? ఎక్కడ?
View this post on Instagram