SIIMA Awards 2021 Nominations: సైమా 2020 అవార్డులు.. నామినేషన్లలో సత్తా చాటిన బన్నీ, మహేష్.. ఇదిగో జాబితా!
2020 సంవత్సరం సైమా అవార్డులను ప్రకటించారు. ఇందులో రెండు తెలుగు సినిమాలకు 12 విభాగాల్లో నామినేషన్లు సాధించాయి.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమం.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA). కరోనా వైరస్ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా సైమా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం 2020 సంవత్సరానికి గాను వివిధ కేటగిరిల్లో నామినేటైన మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాను ప్రకటించారు. ఇందులో బన్నీ నటించిన ‘అలా వైకుంఠపురంలో’, ‘సరిలేరి నీకెవ్వరు’ సినిమాలకు 12 విభాగాల్లో నామినేట్ అయ్యింది. అయితే, హీరో సూర్య నటించిన ‘ఆకాశమే హద్దురా’ (సూరరైపోట్రు) తమిళ చిత్రం ఏకంగా 14 విభాగాలకు నామినేట్ కావడం గమనార్హం. కన్నడంలో ‘లవ్ మాక్‌టైల్’, ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’, ‘ఫ్రెంచ్ బిర్యానీ’ సినిమాలకు పది నామినేషన్లు దక్కాయి. మలయాళ చిత్రం ‘అయప్పనం కోషియం’ చిత్రం 12 విభాగాలకు నామినేట్ కావడం గమనార్హం.
కొద్ది రోజుల కిందట 2019 సంవత్సరానికి సైమా అవార్డుల్లో మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మహార్షి’ సినిమా 10 విభాగాలకు నామినేటైంది. తమిళంలో ‘అసురన్’ , కన్నడంలో ‘యజమానా’, మలయాళంలో ‘కుంబలంగి నైట్స్’ సినిమాలు సైమా నామినేషన్లలో ముందున్నాయి. అయితే, ఈ ఏడాది.. సైమా అవార్డుల వేడుకను హైదరాబాద్‌లోని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు సైమా ఛైర్‌పర్శన్ బృందా ప్రసాద్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబరు 11, 12 తేదీల్లో ఈ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 2019, 2020 సంవత్సరాలకు గాను వివిధ కేటగిరీల్లో నామినేటైన చిత్రాలకు అవార్డులు ప్రకటించనున్నారు.
2020 సైమా అవార్డుల్లో ‘అలా వైకుంఠపురం’ సినిమా.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ పాటల రచయిత, ఉత్తమ నేపథ్య గాయకుడు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ హాస్యనటుడు విభాగాలకు నామినేట్ అయ్యింది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ పాటల రచయిత, ఉత్తమ నేపథ్య గాయకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విభాగాలకు నామినేట్ అయ్యింది.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించడం కోసం 2012లో సైమా అవార్డుల కార్యక్రమం మొదలైంది. ఇప్పటివరకు 8 సార్లు ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇవన్నీ విదేశాల్లో జరగడం గమనార్హం. ఈసారి మాత్రం హైదరాబాద్ వేదికగా ఈ వేడుక జరగనుంది.
Also Read: చిరంజీవి బర్త్‌డేకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న కూతురు సుష్మిత
Also Read: వైష్ణవ్ తేజ్-క్రిష్ మూవీ టైటిల్ ఖరారు.. ఫస్ట్ లుక్ వీడియో అదుర్స్