Shraddha Kapoor: 'ఐలవ్యూ లతా ఆజీ' శ్రద్ధాకపూర్ ఎమోషనల్ పోస్ట్
దివంగత లతా మంగేష్కర్ ను గుర్తు చేసుకుంటూ శ్రద్ధాకపూర్ తనకున్న బెస్ట్ మూమెంట్స్ ను షేర్ చేసుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. దివంగత లతా మంగేష్కర్ ను గుర్తు చేసుకుంటూ ఆమెతో తనకున్న బెస్ట్ మూమెంట్స్ ను షేర్ చేసుకుంది. లతా మంగేష్కర్ తో కలిసి తన చిన్నప్పుడు తీసుకున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది శ్రద్ధాకపూర్.
'మీతో కలిసి గడిపిన క్షణాలను ఎప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటాను. నా తలపై మీ చేయి, మీ వెచ్చని చూపు, ఎంకరేజ్ చేసే మీ పదాలు, మీ సింప్లిసిటీకి, దైవత్వానికి థాంక్స్. ట్రూలీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్! ఐలవ్యూ లతా ఆజీ' అంటూ రాసుకొచ్చింది.
శ్రద్ధాకపూర్, లతా మంగేష్కర్ బంధువులవుతారు. శ్రద్ధా కపూర్ తాతయ్య పండిట్ పండరినాథ్ కొల్హాపూర్.. లతా మంగేష్కర్ కి ఫస్ట్ కజిన్. ఆ విధంగా శ్రద్ధా ఫ్యామిలీతో లతా మంగేష్కర్ కి అనుబంధం ఏర్పడింది. చిన్నప్పటినుంచే లతాను చూస్తూ పెరగడంతో శ్రద్ధా ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతుంది. ఆదివారం నాడు జరిగిన లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో కూడా శ్రద్దా పాల్గొంది.
ముంబయిలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు లతా మంగేష్కర్. కొంతకాలంగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె ఆదివారం నాడు కన్నుమూశారు. అమృతంలా ఉండే ఆమె గాత్రానికి లక్షల మంది అభిమానులున్నారు. ఆమెతో పాటలు పాడించుకోవడానికి అగ్ర సంగీత దర్శకులు కూడా ఎదురుచూసిన రోజులు ఉన్నాయి. 36 భాషల్లో ముప్పై వేలకు పైగా పాటలు పాడారామె.
View this post on Instagram