అన్వేషించండి

Sharwa35: ‘శమంతకమణి’ దర్శకుడితో ‘శతమానం భవతి’ హీరో - పుట్టినరోజున కొత్త సినిమా ప్రకటించిన శర్వా!

టాలీవుడ్ హీరో శర్వానంద్ తన తర్వాతి సినిమాను ప్రకటించారు.

Sharwa 35: విభిన్న కథలతో కూడిన చిత్రాలను ఎంచుకోవడంలో హీరో శర్వానంద్ (Sharwanand) ఎప్పుడూ ముందుంటారు. శర్వా సినిమా వస్తుందంటే అందులో సంథింగ్ స్పెషల్ ఉంటుందని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ మంచి సక్సెస్ అయింది. దాదాపు ఆరు నెలల టైమ్ తీసుకున్నాక శర్వానంద్ ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రకటించారు.

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు తీసే శ్రీరామ్ ఆదిత్యతో శర్వానంద్ తన తర్వాతి సినిమా తీయనున్నారు. ఈ విషయాన్ని ఒక అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా ప్రకటించారు. ఈ సినిమాలో శర్వానంద్ అల్ట్రా స్టైలిష్‌గా కనిపించనున్నారు. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’, ‘దేవదాస్’, ‘హీరో’ ఇలా శ్రీరామ్ ఆదిత్య తీసినవన్నీ క్రైమ్ థ్రిల్లర్లే.

ప్రస్తుతం శర్వానంద్‌తో తీస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ‘Sharwa35’ అని హ్యాష్‌ట్యాగ్ ద్వారా ఈ సినిమాని ప్రకటించారు. అంటే ఇది శర్వాకు 35వ సినిమా అన్నమాట. అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోలో క్రైమ్ ఛాయలేవీ కనిపించలేదు.

కానీ పోస్టర్‌లో ఉన్న కో-ఆర్డినేట్స్ మాత్రం లండన్‌ను సూచిస్తాయి. కాబట్టి లండన్ నేపథ్యంలో జరిగే అల్ట్రా స్టైలిష్ స్టోరీ అనుకోవచ్చు. సినిమా జోనర్ గురించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయిందని, ఒక షెడ్యూల్ కూడా పూర్తి అయిందని వార్తలు వస్తున్నాయి.,

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా ఉన్నారు. గతేడాది మలయాళ ‘హృదయం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ అందించిన హేషం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: విష్ణు శర్మ, ఎడిటర్: ప్రవీణ్ పూడి

శర్వానంద్ నిశ్చితార్థం కూడా ఈ సంవత్సరం జనవరిలోనే జరిగింది. సింపుల్ గా ఈ వేడుకును కానిచ్చేశారు. అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఎంగేజ్ మెంట్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వధువు రక్షిత రెడ్డి ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది. రక్షితరెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అని తెలిసింది. అంతేకాదు, ఆమె ఏపీ మాజీ మంత్రి  బొజ్జల గోపాల కృష్ణ మనువరాలని సమాచారం.  అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న రక్షిత, కరోనా విజృంభణ తర్వాత ఇండియాకు వచ్చింది.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేస్తుంది. ఇంతకీ శర్వానంద్ ఆ అమ్మాయిని ఎక్కడ కలిశాడు? వీరిది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా?  అనే విషయం మాత్రం బయటకు తెలియదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
T Rajaiah vs Kadiyam: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Embed widget