News
News
వీడియోలు ఆటలు
X

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాకు సంబంధించి ‘మల్లికా’ అనే వీడియో సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఇప్పటికే ఈ పాట లిరికల్ వీడియో ఆకట్టుకోగా తాజాగా విడుదలైన వీడియో సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

FOLLOW US: 
Share:

Shaakuntalam: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉంటోంది. ఆమె రీసెంట్ గా నటించిన ‘శాకుంతలం’ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే నవల ఆధారంగా ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘మల్లికా’ అనే వీడియో సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఇప్పటికే ఈ పాట లిరికల్ వీడియో ఆకట్టుకోగా తాజాగా విడుదల అయిన వీడియో సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సమంత గతేడాది ‘యశోద’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ మూవీ తర్వాత మళ్లీ ఫిమేల్ లీడ్ రోల్ మూవీ అయిన ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. ‘యశోద’ సినిమాతో పోలిస్తే ఈ మూవీలో సమంత చాలా గ్లామర్ గా కనిపింస్తోంది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్ అలాగే తాజాగా విడుదల చేసిన ‘మల్లికా’ వీడియో సాంగ్ లను చూస్తే అది ఇట్టే అర్థమైపోతుంది. ఇక ఈ పాటలోని విజువల్స్, మ్యూజిక్, లొకేషన్స్ అన్నీ చాలా అద్బుతంగా కనిపిస్తున్నాయి. నిమిషంన్నర నిడివి ఉన్న ఈ పాటలో సమంతతో పాటు అనన్య నాగళ్ల, అదిత బాలన్ కూడా కనిపించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ పాటకు అద్బుతమైన సంగీతాన్ని అందించారు. అలాగే లిరిక్స్, సింగర్స్ వాయిస్ కూడా బాగున్నాయి. మొత్తంగా ఈ ‘మల్లికా’ సాంగ్ సమంత అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు.

ఈ సినిమాలో వాడిన ఆభరణాలు అన్నీ ఒరిజినల్ బంగారంతోనే చేయించారు. ఈ విషయాన్ని దర్శకుడు గుణశేఖర్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దాదాపు 15 కిలోల బంగారాన్ని ఉపయోగించి ఆరేడు నెలలు కష్టపడి ఈ ఆభరణాలను తయారు చేయించారు. సమంత సహా ప్రధాన పాత్రలన్నిటికీ నిజమైన బంగారాన్నే ఉపయోగించారు మేకర్స్. దీంతో ఈ ఒరిజినాలిటీ వెండితెరపైన ఇంకా అందంగా కనిపిస్తుందంటున్నారు సినీ నిపుణులు. అందుకే ఈ సినిమాపై ఇప్పటినుంచే భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇక సమంత కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడిందనే చెప్పాలి. ‘యశోద’ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే తనకు కండరాల సంబంధిత వ్యాధి వచ్చింది. దీంతో కొన్ని నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉండి చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ‘శాకుంతలం’ విడుదల ఆలస్యం అవ్వడానికి ఇది కూడా ఓ కారణమని చెబుతారు. ఆమె పూర్తిగా కోలుకొని తిరిగి వచ్చాక సినిమాకు సంబంధించిన పనులను ముగించింది. ఈ సినిమాతో పాటు హిందీలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వస్తోన్న ‘సిటడెల్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది సమంత. దానితో పాటు విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న ‘ఖుషి’ సినిమాను కూడా పూర్తి చేయనుంది. 

Also Read : బాలీవుడ్‌కు కాజల్ భారీ పంచ్ - సౌత్‌తో కంపేర్ చేస్తూ గాలి తీసేసిందిగా!

Published at : 31 Mar 2023 03:17 PM (IST) Tags: Gunasekhar Shaakuntalam Samantha Mallika Video Song

సంబంధిత కథనాలు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి